Home /News /movies /

VIRATA PARVAM RANA SAI PALLAVI PRIYAMANI MOVIE VIRATA PARVAM MOVIE RELEASE ON JUNE 17 TA

Virata Parvam - Rana : రానా, సాయి పల్లవిల ‘విరాట పర్వం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. అనుకున్న డేట్ కంటే ముందే విడుదల..

జూన్ 17న రానా ‘విరాట పర్వం’ విడుదల (Twitter/Photo)

జూన్ 17న రానా ‘విరాట పర్వం’ విడుదల (Twitter/Photo)

Rana - Virata Parvam : రానా దగ్గుబాటి, సాయిపల్లవి ప్రధాన పాత్రలో నక్సల్స్  బ్యాగ్రౌండ్‌లో వస్తోన్న తాజా చిత్రం విరాటపర్వం. ఇప్పటికే థియేట్రికల్ రిలీజ్ డేట్ ప్రకటించిన ఈ సినిమా మేకర్స్.. తాజాగా ఈ సినిమాను ప్రీ పోన్ చేశారు. అంతేకాదు కొత్త విడుదల తేది కూడా ప్రకటించారు.

ఇంకా చదవండి ...
  Rana - Virata Parvam : రానా దగ్గుబాటి, సాయిపల్లవి ప్రధాన పాత్రలో నక్సల్స్   బ్యాగ్రౌండ్‌లో వస్తోన్న తాజా చిత్రం విరాటపర్వం. వేణు ఊడుగుల దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమా ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ చిత్రం గతేడాది ఏప్రిల్ 30న విడుదలకావాల్సి ఉంది. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా విడుదలను వాయిదా వేసింది చిత్రబృందం. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయాలనీ అనుకున్నారని టాక్ వచ్చింది. ప్రఖ్యాత స్ట్రీమింగ్ నెట్ వర్క్ నెట్‌ఫ్లిక్స్ సంస్థ రూ. 35 కోట్లకు  పైగా ఆఫర్ చేసిందనే వార్తలు వచ్చాయి. ఐతే.. ఈ సినిమాను థియేట్రికల్ రిలీజ్ చేయాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమా ఓటీటీ డీల్ క్యాన్సిల్ చేసుకుంది. ఈ సినిమాలో రానా.. రవన్న అనే కామ్రేడ్ పాత్రలో కనిపించనున్నారు.ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

  ఇక రానా బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన  మారదులే.. ఈ దోపిడి దొంగల రాజ్యం మారదులే.. రౌద్రపు శక్తి దాడిని ఎదురించే పోరాటం మనదే. చలో .. ఛలో.. ఛలో పరిగెత్తు.. అడుగే పిడుగై.. గుండెల దమ్మును చూపించు. ఛలో .. పరిగెత్తు.. చీకటి మింగిన సూర్యుడిని తెచ్చి తూర్పు కొండను వెలిగిద్దాం.. పొంగిన వీపుల బరువులు దించి విప్లవ గీతం వినిపిద్దాం. ఛలో.. ఛలో .. పరిగెత్తు.. ఛలో పరిగెత్తు.. తెరవని తలుపుకు తాళంలా.. గడిల ముందు కుక్కల్లా.. ఎన్నాళ్లు.. ఇంకెనాళ్లు.. ఛలో పరిగెత్తు.. ఛలో పరిగెత్తు అంటూ రానా  చెప్పిన డైలాగులు ఆకట్టుకున్నాయి. ముందుగా ఈ సినిమాను జూలై 1న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ తాజాగా ఈ సినిమాను రెండు వారాల ముందే జూన్ 17న విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు.

  జూన్ 17న విరాట పర్వం విడుదల (Twitter/Photo)


  ముందుగా విరాట పర్వం సినిమాకు దాదాపు రూ. 50 కోట్ల ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం. అందులో డిజిటల్ రిలీజ్‌కు రూ. 41 కోట్లు.. శాటిలైట్‌కు రూ. 9 కోట్లకు డీల్ కుదిరినట్టు సమాచారం. దీంతో మేకర్స్ కూడా ఈ సినిమాను థియేట్రికల్ కాకుండా నేరుగా ఓటీటీలో విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు కూడా వార్తలు వచ్చాయి.

  Dasari Death Anniversary : కోడి రామకృష్ణ, రవిరాజా, ధవళ సత్యం సహా దాసరి దగ్గర శిష్యరికం చేసిన దర్శకులు..

  ‘విరాట పర్వం’ సినిమాను వేణు ఊడుగుల నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో  రానా, సాయి పల్లవి ,నివేతా పేతురాజ్, ప్రియమణి, నందితా దాస్‌, నవీన్ చంద్ర, జరీనా వహాబ్‌, ఈశ్వరీ రావు, సాయిచంద్ ముఖ్య పాత్రలు పోషించారు. బెనర్జీ, నాగినీడు, రాహుల్ రామకృష్ణ, దేవీ ప్రసాద్‌, ఆనంద్ రవి, ఆనంద్ చక్రపాణి ఇతర పాత్రల్లో నటించారు. విరాటపర్వం మూవీకి  సురేష్ బొబ్బిలి సంగీతం సమకూర్చారు. ఈ సినిమాకు డానీ సాంచెజ్ లోపెజ్‌, దివాకర్ మణి సినిమాటోగ్రఫీ అందించారు.

  Top Highest Grosser Indian Movies : RRR, KGF 2 సహా భారతీయ బాక్సాఫీస్ దగ్గర ఎక్కువ వసూళ్లు సాధించిన సినిమాలు..

  పొలిటికల్‌ పీరియాడిక్ థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కుతోంది. సినిమా ప్రధానంగా పొలిటికల్‌ థ్రిల్లర్ అయినా మాస్ ఎలిమెంట్స్ కూడా చాలా ఇంట్రస్ట్‌గా ఉంటాయని టాక్. ఈ కథ ప్రధానంగా తెలంగాణ ప్రాంతంలోని 1980-1990లో అప్పటి సామాజిక పరిస్థితుల ఆధారం వస్తోంది. అందులో భాగంగా అప్పటి దళారుల వ్యవస్థను ఈ సినిమాలో చర్చించనున్నారు దర్శకుడు వేణు ఊడుగుల. విరాటపర్వంను అటూ హిందీ, తమిళ భాష‌ల్లోనూ రిలీజ్ చేయనుంది చిత్రబృందం. త్వరలో ఈ సినిమా విడుదల తేదిని అధికారికంగా ప్రకటించనున్నారు.
  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Priyamani, Rana daggubati, Sai Pallavi, Tollywood, Virata Parvam

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు