రివ్యూ : విరాట పర్వం (విరాట పర్వం)
నటీనటులు : రానా దగ్గుబాటి, సాయి పల్లవి, ప్రియమణి, నందిదా దాస్, జరీనా వాహెబ్ తదితరులు..
ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్
సినిమాటోగ్రఫీ: దివాకర్ మణి, డానీ సాంచెజ్ లోపెజ్
సంగీతం: సురేష్ బొబ్బిలి
నిర్మాతలు : సురేష్ బాబు.సుధాకర్ చెరుకూరి, రచన, దర్శకత్వం: వేణు ఊడుగుల విడుదల తేది : 17/6/2022
రానా దగ్గుబాటి (Rana Daggubati), సాయిపల్లవి (Sai Pallavi) ప్రధాన పాత్రలో నక్సల్ బ్యాగ్రౌండ్‌లో వస్తోన్న లేటెస్ట్ చిత్రం విరాటపర్వం (Virataparvam). వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. మరి ఈ మూవీ రివ్యూ ఎలా ఉందో చూద్దాం..
కథ విషయానికొస్తే..
విరాట పర్వం కథ విషయానికొస్తే.. 1990 దశకంలో తెలంగాణ ప్రాంతంలో జరిగిన నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కించారు. ఈ సినిమా వెన్నెల (సాయి పల్లవి) అనే అమ్మాయి చుట్టు తిరుగుతోంది. ఈమె కామ్రేడ్ రవన్న (రానా దగ్గుబాటి) రచనలకు ప్రేరణ పొంది అతని ప్రేమలో పడుతోంది. ఇక తన ప్రేమను గెలిపించుకోవడానికీ వెన్నెల ఏమి చేసింది. ? చివరకు వెన్నెల, రవన్నల ప్రేమకథ ఎలాంటి మలుపుతు తిరిగింది? ఈ క్రమంలో ఆమె జీవితంలో రాజకీయాల నాయకులు , పోలీసులు ఎలాంటి ప్రభావం చూపించరనేదే విరాట పర్వం కథ.
కథనం..
దర్శకుడు వేణు ఊడుగుల విరాట పర్వం తాను అనుకన్న కథను అనుకున్న విధంగా కమర్షియల్ అంశాల జోలికి వెళ్లకుండా తెరకెక్కించాడు. ఒక అమ్మాయి ప్రేమను విప్లవం కంటే గొప్పగా చూపించాడు. నచ్చిన వాళ్ల కోసం ముళ్ల ప్రయాణమైన .. ఎంతో హాయిగా ఉంటుందనేది ఈ సినిమాలో చూపించాడు. సినిమాగా కమర్షియల్ అంశాలకు దూరంగా డాక్యుమెంటరీలా ఉండటం ఒక్క వర్గం ప్రేక్షకులను మెప్పిస్తుందా అనేది చూడాలి. ఒక ప్రేమకథను నక్సల్ బ్యాక్ డ్రాప్‌లో చెప్పడం అనేది అంత ఈజీ టాస్క్ కాదు.. కానీ డైరెక్టర్ తాను అనుకున్న దాన్ని తెరపై అంతే చక్కగా ఆవిష్కరించాడు. దివాకర్ మణి, డాని షన్‌చాజ్ ఫోటోగ్రఫీ బాగున్నాయి. తెలంగాణ పల్లెలు, అడవులను తన కెమెరాలో అందంగా బంధించాడు. సురేష్ బొబ్బలి ఈ సినిమాకు ఇచ్చిన సంగీతం.. ఆర్ఆర్ బాగుంది. నిర్మాణ విలువలు రిచ్‌గా ఉన్నాయి. మొత్తంగా కథను నమ్మి చేసిన రానాను, నిర్మించిన నిర్మాతలను అభినందించాలి. కమర్షియల్ అంశాలకు దూరంగా ఉన్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏ మేరకు వసూళ్లను రాబడుతుందో చూడాలి.
నటీనటుల విషయానికొస్తే..
విరాట పర్వం కామ్రేడ్ రవన్న పాత్రలో రానా చక్కగా ఒదిగిపోయాడు. అంతేకాదు.. నక్సలైట్‌గా పవర్‌ఫుల్‌గా ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో రానా పలికిన డైలాగులు బాగున్నాయి. వెన్నెల పాత్రలో నటించిన సాయి పల్లవి గురించి కొత్తగా చెప్పాల్సింది కాదు. ఈ పాత్రకు ఆమె తప్ప మరెవరు చేసినా ఈ స్థాయి నటన ప్రదర్శించలేరు. సినిమాలో ఎంత మంది నటీమణులున్న అందరి చూపు తనపై ఉండేలా యాక్ట్ చేసింది. కేవలం కళ్లతోనే హావభావాలు పలకించిన తీరు అద్భుతం. ఈ సినిమాలో నటనకు అవార్డులు వచ్చినా ఆశ్యర్యపోవాల్సిన పనిలేదు. ఇక సహాయపాత్రల్లో నటించిన ప్రియమణి, నందితా దాస్, నవీన్ చంద్ర, జరీనా వాహెబ్, రాహుల్ రామకృష్ణ తమ పరిధి మేరకు నటించారు.
ప్లస్ పాయింట్స్
రానా, సాయి పల్లవిల నటన
కథ, దర్శకత్వం
సంగీతం
నిర్మాణ విలువలు..
మైనస్ పాయింట్స్
డాక్యుమెంటరీలా సాగే సినిమా
కమర్షియల్ అంశాలకు దూరంగా ఉండటం..
చివరి మాట : విరాట పర్వం.. నిజాయితీతో చేసిన ప్రయత్నం..
రేటింగ్ : 2.75/5
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Rana daggubati, Sai Pallavi, Virata Paravam