హోమ్ /వార్తలు /సినిమా /

Virata Parvam: విరాట పర్వం మొదటి 4 నిమిషాల సినిమా విడుదల.. ఎంత గొప్పగా ఉందంటే..!

Virata Parvam: విరాట పర్వం మొదటి 4 నిమిషాల సినిమా విడుదల.. ఎంత గొప్పగా ఉందంటే..!

Photo Twitter

Photo Twitter

ఈ వీడియోకు విడుదలైన కాసేపటికే వేలల్లో లైకులు వస్తున్నాయి. సినిమా హిట్ అనడానికి ఈ ఒక్క వీడియో చాలంటూ... నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. చాలా గొప్పగా తీశారంటూ.. కామెంట్ చేస్తున్నారు.

విరాటం పర్వం(Virata Parvam) మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి ఈ సినిమా టీం మొదటి నాలుగు నిమిషాల సినిమాను విడుదల చేసింది. రానా దగ్గుబాటి(Rana Daggubati), సాయి పల్లవి నటించిన విరాటపర్వం.. మూవీ రేపు విడుదల కానుంది. ఈ మూవీకి సంబంధించి ఆరంభంలో వచ్చే నాలుగు నిమిషాల దృశ్యాలను చిత్రం యూనిట్‌ యూట్యూబ్‌లో విడుదల చేసింది. ఈ చిత్రంలో హీరోయిన్‌ వెన్నెల పుట్టుకకు సంబంధించిన ఘటనలు ఉన్న ఈ దృశ్యాలు టైటిల్‌కు ముందు వస్తాయి.

వీడియోలో వెన్నెల పుడుతుంది. రాత్రి దట్టమైన అటవీ ప్రాంతం.... ఓ ట్రాక్టర్ రోడ్డుపై వెళ్తూ ఉంటుంది. అందులో ఓ మహిళ పురిటి నొప్పులతో బాధపడుతుంటుంది. ఇంతలో వారి ట్రాక్టర్‌ ముందు  కాల్పులు. నక్సలైట్...పోలీసులకు మధ్య హోరా హోరి కాల్పులు జరుగుతుంటాయి. అందులో ఓ నక్సలైట్ నివేద పేతురాజ్. పోలీసులపై కాల్పులు జరుపుతూ ఆమె సినిమా ఆరంభంలోనే కనిపిస్తుంది.  ఆమె నక్సలైట్..మాత్రమే  కాదు డాక్టర్ కూడా. పురిటి నొప్పులు పడుతున్న మహిళ దగ్గరకు వెళ్తుంది.

భయపడకండి నేను డాక్టర్‌ను ఏం కాదు... అంటూ ఆమెకు వైద్యం చేసి పురుడుపోస్తుంది. అలా పుట్టిన అమ్మాయే వెన్నెల. ఇంతలో పాపకు నువ్వే పేరు పెట్టమ్మ అంటూ.. అడుగుతారు. దీంతో పుట్టిన పసికందను చేతిలోకి తీసుకొని... అడవిలోకి చూస్తూ.. ఆరుబయటకాసిన చందమామను చూసి వెన్నెల అని పేరు పెడుతుంది. లాల్ సలాం అనగానే.. ఆమెను పోలీసులు కాల్చేస్తారు. బిడ్డను చేతిలో పట్టుకొనే ప్రాణాలు వదిలేస్తుంది. దీంతో ఈ వీడియో ముగుస్తుంది.

' isDesktop="true" id="1334714" youtubeid="_5cSyLqMFj4" category="movies">

ఇక ఈ  వీడియో చూసిన నెటిజన్లు సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ఒక్క వీడియోతోనే.. ఈ సినిమా ఎంత గొప్పగా తీశారో అర్థమవుతుందని కామెంట్ చేశారు. ఇప్పుడే రిలీజ్ అయ్యిన birth of వెన్నెల వీడియో చుసిన ఈ ఒక్క వీడియో చాలు విరాటపర్వం మువీ ఎంత విజయం సాధిస్తుందో తెలియజేయ్యడానికి. కంగ్రాట్స్ డైరెక్టర్ వేణు ఉడుగుల సార్ అంటూ పోస్టులు పెడుతున్నారు నెటిజన్స్.  చాన్నాళ్ళ తరవాత నక్సల్స్‌ బ్యాక్‌గ్రౌండ్‌తో వస్తున్న మూవీ కావడంతో తెలుగురాష్ట్రాల్లో ఆసక్తి పెరుగుతోంది.ఇక ఈ సినిమిలో రానా, సాయిపల్లవి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న విషయం తెలిసిందే.

First published:

Tags: Rana daggubati, Sai Pallavi, Virata Parvam

ఉత్తమ కథలు