ఐఫా అవార్డ్స్‌కి ప్రత్యేక అతిథి... ఇంటర్వ్యూ ఇచ్చిన కుక్క...

IIFA Awards 2019 : ఐఫా అవార్డుల వేదిక దగ్గరకు కుక్క రావడమే విచిత్రమనుకుంటే... దాన్ని నుంచీ ఇంటర్వ్యూ తీసుకోవడం మరో చిత్రం. అది ఎలా జరిగిందో తెలుసుకోండి మరి.

Krishna Kumar N | news18-telugu
Updated: September 23, 2019, 9:48 AM IST
ఐఫా అవార్డ్స్‌కి ప్రత్యేక అతిథి... ఇంటర్వ్యూ ఇచ్చిన కుక్క...
ఐఫా అవార్డ్స్‌కి ప్రత్యేక అతిథి... ఇంటర్వ్యూ ఇచ్చిన కుక్క... (Credit - Insta - aditi_bhatia4)
  • Share this:
ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ (IIFA) 2019... 20వ ఎడిషన్ వేడుకలు మొన్ననే ముగిశాయి. చాలా మంది కళాకారులకు... వివిధ కేటగిరీల్లో అవార్డులు వచ్చాయి. సరే... అదంతా ఒక ఎత్తు. ఆ వేడుకలకు ఓ కుక్క వెళ్లింది. నిజానికి ఆ ఫంక్షన్‌లో చాలా సెక్యూరిటీ ఉంటుంది. అయినప్పటికీ అక్కడకు ఆ డాగ్ వెళ్లడం విశేషం. దాన్ని ఇంటర్వ్యూ చేసింది నటి అదితి భాటియా. హాయ్... ఇక్కడకు అనుకోని అతిథి వచ్చారు. తనను ఇంటర్వ్యూ చేసి బోలెడు విషయాలు తెలుసుకుందాం అంటూ అదితి భాటియా కుక్కను రకరకాల ప్రశ్నలు అడిగింది. ఆ కుక్క కూడా వాటికి సమాధానంగా... తన ముందు రెండు కాళ్లతో షేక్ హ్యాండ్ ఇచ్చింది.
 View this post on Instagram
 

Spread love! 🐶❤️


A post shared by Aditi Bhatia 🎭 (@aditi_bhatia4) on

ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయ్యింది. జస్ట్ రెండు రోజుల్లో ఈ వీడియోని ఏడు లక్షల మందికి పైగా చూశారు. ఆమె చెబుతున్నది వింటూ ఆ కుక్క ఎంతో పద్ధతిగా ఉండటాన్ని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. ఇక కామెంట్లకైతే లెక్కలేదు. రకరకాల కామెంట్లు చేస్తున్నారు. వాటిలో ఎక్కువ మంది క్యూట్ అని రాస్తున్నారు. ఓ నెటిజన్ మాత్రం... ఆ కుక్క సార్ కాదనీ... మేడమ్ అని కామెంట్ చేశారు. ఇంతకంటే క్యూటర్ వీడియో ఉంటుందా అని మరో నెటిజన్ ప్రశ్నించారు.
First published: September 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading