Video: Manike Mage Hithe.. ఒరిజినల్ సాంగ్ చూశారా? షాకవుతారు!

ఒరిజినల్ సాంగ్ చూశారా? (image credit - youtube)

Viral Video: చాలా మంది శ్రీలంక సింగర్ యొహానీ డె సిల్వా (yohani de silva) పాడినదే ఒరిజినల్ వెర్షన్ అనుకుంటున్నారు. అసలు పాటను ఇప్పుడు చూద్దాం.

  • Share this:
    Viral Video: మనికే మాగే హితే (Manike Mage Hithe) అనే ఓ సాంగ్ దేశాన్ని ఊపేస్తోంది. శ్రీలంక సింగర్ యొహానీ డె సిల్వా (yohani de silva) ఈ సాంగ్‌ను సింహళ భాషలో పాడింది. గత 8 వారాలుగా ఈ సాంగ్ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కనిపిస్తోంది. కొన్ని చోట్ల ఈ సాంగ్ క్లిప్‌లను యాడ్ చేస్తున్నారు. ఇలా యూత్ అంతా ఈ సాంగ్‌కి కనెక్ట్ అయిపోయారు. అంతేకాదు... అసలా సింగర్ ఎవరు... భలే పాడిందే... అనుకుంటూ... ఆమె గురించి గూగుల్ (google trend search), యూట్యూబ్‌ (youtube trending)లో తెగ వెతుకుతున్నారు.

    ఒరిజినల్ వెర్షన్ వేరే:
    అక్కడితో అయిపోలేదు... ఈ సాంగ్‌కి ఇంగ్లీష్, హిందీ, ఇతర భాషల్లో వెర్షన్లు వస్తున్నాయి. అందువల్ల నెటిజన్లలో చాలా మంది... యొహానీ పాడినదే ఒరిజినల్ సాంగ్ అనీ... దాని నుంచి ఇతర సాంగ్స్ వస్తున్నాయని అనుకుంటున్నారు. కానీ అసలు విషయం తెలిస్తే ఒకింత ఆశ్చర్యం తప్పదు. యొహానీ కంటే ముందే ఈ సాంగ్ శ్రీలంక నుంచి వచ్చింది. యొహానీ వీడియోని ఈ సంవత్సరం యూట్యూబ్‌లో అప్‌లోడ్ చెయ్యగా... ఒరిజినల్ వెర్షన్ సాంగ్... గతేడాదే యూట్యూబ్‌లో అప్‌లోడ్ అయ్యింది.

    పాపులర్ అయిన యొహానీ:
    మనికే మాగే హితే అంటూ పాటను మొదలుపెట్టిన యొహానీ... ఇండియాలో ఫేమస్ అయిపోయింది. అసలు సింహళ భాష పాటకు అర్థమేంటి అని చాలా మంది వెతుకుతున్నారు. ప్రేయసిపై తనకు ఉన్న ప్రేమను చాటి చెప్పడమే ఈ సాంగ్. ఇందులో స్వీట్ లవ్ స్టోరీ ఉంటుంది. నిజానికి దీన్ని అమ్మాయిల కంటే అబ్బాయిలు పాడటం కరెక్ట్. కానీ సింహళ భాషలో యొహానీ పాడటంతో... ఆ లిరిక్స్ డిఫరెంటుగా ఉండటంతో నెటిజన్లు కనెక్ట్ అయిపోయారు. మరి ఒరిజినల్ సాంగ్ చూడాలి కదా మనం.

    ఒరిజినల్ సాంగ్ ఇదే:
    ఒరిజినల్ సాంగ్‌ని శ్రీలంక సింగర్ సతీషన్ (Satheeshan) పాడాడు. లిరిక్స్, ర్యాప్ ఇచ్చింది దుల్హన్ ARX (Dulhan ARX), సాంగ్ డైరెక్ట్ చేసినది హసిత్ ఆర్యన్ (Hasith Aryan). దీన్ని జులై 31, 2020లోనే అప్‌లోడ్ చేసినా హిట్ కాలేదు. తీరా యోహానీ పాడాక వైరల్ అయ్యింది. ఇప్పుడు ఇదే సాంగ్‌తో 100కు పైగా ట్రాక్స్ ఉన్నాయంటే నమ్మగలరా?

    యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్... ఎందులోకైనా వెళ్లండి... సర్ఫింగ్ చేస్తుంటే... ఎక్కడో ఒకచోట మీకు యోహానీ తగలడం ఖాయం. ఈ షార్ట్ ట్రిమ్మ్‌డ్ గర్ల్ అంతలా ఫ్లోటింగ్ అవుతోంది. ఆమె పాడిన స్వీట్ మెలోడీ యూత్ హార్ట్స్‌ను టచ్ చేస్తోంది. ఆమె స్మైలీ ఫేస్... నెటిజన్ల హృదయాల్లో ఫిక్స్ అవుతోంది. పాటలో భాష అర్థం కాకపోయినా... అవిలేవి... శ్రీదేవి.. అంటూ నెటిజన్లు కనెక్ట్ అయిపోతున్నారు. ఈ సాంగ్ ఆడియో, వీడియో క్వాలిటీ కూడా బాగుంది.

    ఇది కూడా చదవండి: Earth: భూమిపై రాబోతున్న మహా ఖండం.. సైంటిస్టుల అంచనా

    ఇప్పుడు ఇదే సాంగ్‌ని చాలా మంది సింగర్లు పాడుతున్నారు. వేర్వేరు వెర్షన్లలో ఇస్తున్నారు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ కుమ్మేస్తోంది. చివరకు బిగ్ బీ అమితాబ్ బచ్చన్, ఆయన మనవరాలు ఆరాధ్య కూడా ఈ సాంగ్‌ని సోషల్ మీడియాలో షేర్ చేశారు.... అలా దూసుకుపోతోంది మనికే మాగే హితే....
    Published by:Krishna Kumar N
    First published: