VINTAGE TV SERIAL ACTRESS PRESENT PERSONAL LIFE FULL DETAILS ARE HERE NR
Tv Actresses: ఈ సీరియల్ నటులు మీకు గుర్తున్నారా.. ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా?
Etv Serials
Tv Actresses: బుల్లితెరలో ఎక్కువ హవా సీరియల్స్ దే అని చెప్పాలి. ఎందుకంటే ప్రేక్షకులను అతి తక్కువ సమయంలో అభిమానులుగా మార్చుకుంది. అంతే కాకుండా అందులో నటించే నటుల పాత్రలు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేవి.
Tv Actresses: బుల్లితెరలో ఎక్కువ హవా సీరియల్స్ దే అని చెప్పాలి. ఎందుకంటే ప్రేక్షకులను అతి తక్కువ సమయంలో అభిమానులుగా మార్చుకుంది. అంతే కాకుండా అందులో నటించే నటుల పాత్రలు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేవి. ఇప్పటికి బుల్లితెరలో సీరియల్స్ హవానే నడుస్తుంది. ఇక ఇందులో నటించే నటులు వెండితెరపై కూడా నటిస్తున్నారు. వెండితెర నటులు బుల్లితెరపై కూడా అడుగులు పెడుతున్నారు. ఇదిలా ఉంటే ఒకప్పుడు ఈటీవీ లో ప్రసారమయ్యే సీరియల్స్ మంచి ఆదరణలో ఉండేవి. అందులో నటించే నటులు కూడా తమ పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇంతకీ వాళ్ళెవరు.. ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసుకుందాం.
ఈటీవీ లో డైరెక్టర్ వంశీ దర్శకత్వం వహించిన 'లేడీ డిటెక్టివ్' సీరియల్ చాలా మంచి సక్సెస్ అందుకుంది. ఇక ఈ సినిమాలో 'ఉత్తర' హీరోయిన్ గా నటించి ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది. ఆ తర్వాత మరే సీరియల్ లో కూడా నటించని ఉత్తర పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యింది.
ఇక మరో సీరియల్ 'స్నేహ' కూడా ఈటీవీలో ప్రసారం కాగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇందులో నటి 'కావేరి' హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈమె కూడా పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకి దూరమైంది.
థ్రిల్లర్ నేపథ్యంలో ప్రసారమైన 'అన్వేషిత' సీరియల్ కూడా బుల్లితెర అభిమానులను బాగా ఆకట్టుకుంది. ఇందులో అచ్యుత్, యమునా కీలక పాత్రలో నటించారు. అతి తక్కువ సమయంలో ఈ సీరియల్ మంచి సక్సెస్ అందుకుంది. ఇందులో నటించిన నటులకు నంది అవార్డులు కూడా అందాయి.
ఇక ఈటీవీలో ప్రసారమైన 'అంతరంగాలు' సీరియల్ గురించి అందరికీ తెలిసిందే. ఇందులో అచ్యుత్, శరత్ బాబు, కల్పన లు కీలక పాత్రలలో నటించారు. ఇక వీళ్ళు ఆ తర్వాత పలు సీరియల్స్ లో కూడా నటించారు. ఇందులో కల్పన తన పెళ్లి తర్వాత ఇండస్ట్రీని దూరం పెట్టింది.
ఒకప్పుడు మంచి ఫామ్ లో ఉన్న 'ఎండమావులు' సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేది. ఈ సీరియల్ కూడా మంచి రేటింగ్ తో దూసుకెళ్ళింది. ఇందులో మహర్షి, జ్యోతి రెడ్డి లు నటించి వెండితెరపై కూడా ఎన్నో సినిమాలలో నటించారు.
Published by:Navya Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.