ఒకరోజు ముందే ఓనమ్ సెలెబ్రేట్ చేసుకున్న ప్రియా వారియర్..

ప్రియా వారియర్.. ఈ పేరుతో ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఆ మధ్య ఇండియన్ వైడ్‌గా ఈ భామ తప్ప మరో టాపిక్ లేకుండా పోయింది. ఎందుకంటే అంతగా కన్నుగీటి సంచలనం అయిపోయింది..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 10, 2019, 5:12 PM IST
ఒకరోజు ముందే ఓనమ్ సెలెబ్రేట్ చేసుకున్న ప్రియా వారియర్..
ప్రియా ప్రకాష్ వారియర్(priya.p.varrier/Instagram)
  • Share this:
ప్రియా వారియర్.. ఈ పేరుతో ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఆ మధ్య ఇండియన్ వైడ్‌గా ఈ భామ తప్ప మరో టాపిక్ లేకుండా పోయింది. ఎందుకంటే అంతగా కన్నుగీటి సంచలనం అయిపోయింది ఈ భామ. అయితే ఒరు అదార్ లవ్ సినిమాతో స్టార్ హీరోయిన్ అయిపోదామని కలలు కన్న ఈ ముద్దుగుమ్మకు ఆ సినిమా ఊహించని షాక్ ఇచ్చింది. కానీ ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినా కూడా ప్రియాకు పెద్దగా కలిసొచ్చింది లేదు. ప్రస్తుతం నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి సినిమాలో నటిస్తుంది ఈ భామ. ఇదిలా ఉంటే కేరళ బ్యూటీ కావడంతో ఓనమ్ సెలెబ్రేషన్స్‌లో మునిగిపోయింది.


ముఖ్యంగా అక్కడ పది రోజుల పాటు ఈ వేడుకలు జరగనున్నాయి. అందులో సెప్టెంబర్ 11 ప్రధానమైంది. దాంతో ఒక్కరోజు ముందే అడ్వాన్స్‌గా ఓనమ్ శుభాకాంక్షలు తెలిపింది ఈ ముద్దుగుమ్మ. మళయాలీలకు ఓనమ్ అనేది ప్రధానమైన పండగ. ఇక్కడ యాంకర్ సుమ లాంటి వాళ్లు కూడా ఓనమ్‌ను ఘనంగా సెలెబ్రేట్ చేసుకుంటారు. పైగా పక్కా కేరళ అమ్మాయి కావడంతో ప్రియా వారియర్ కూడా ఈ సంబరాల్లో తేలిపోతుంది.
First published: September 10, 2019, 5:12 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading