VINAYA VIDHEYA RAMA REVIEW BY PARUCHURI GOPALA KRISHNA AND SAYS NO EMOTIONAL DRAMA IN MOVIE PK
‘వినయ విధేయ రామ’ ఫ్లాప్‌పై సీనియర్ రైటర్ సంచలన కామెంట్స్..
రామ్ చరణ్ వినయ విధేయ రామ
సంక్రాంతికి విడుదలై దారుణంగా ప్రేక్షకులను నిరాశ పరిచిన సినిమా వినయ విధేయ రామ. ఆకాశమంత అంచనాలతో వచ్చి పాతాళానికి పడిపోయింది ఈ చిత్రం. రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ చిత్రం ఊహించిన దానికంటే దారుణంగా ఫ్లాప్ అయింది.
సంక్రాంతికి విడుదలై దారుణంగా ప్రేక్షకులను నిరాశ పరిచిన సినిమా వినయ విధేయ రామ. ఆకాశమంత అంచనాలతో వచ్చి పాతాళానికి పడిపోయింది ఈ చిత్రం. రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ చిత్రం ఊహించిన దానికంటే దారుణంగా ఫ్లాప్ అయింది. ఇక ఇప్పుడు సినిమా వచ్చి మూడు నెలల తర్వాత దీనిపై సంచలన కామెంట్స్ చేసాడు రైటర్ పరుచూరి గోపాలకృష్ణ. సినిమా ఎందుకు ఫ్లాప్ అయింది అనేదాని కంటే కూడా ఇలా ఉంటే బాగుండేదేమో అనే విధంగా రివ్యూ ఇచ్చాడు ఈయన. కొన్ని మార్పులు చేసుంటే పరిస్థితి మరోలా ఉండేదని చెప్పాడు పరుచూరి.
వినయ విధేయ రామ ఫైల్ ఫోటో
తాజాగా వినయ విధేయ రామ గురించి ఆయన చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి. సినిమాలో ప్రశాంత్ చనిపోయిన సంగతి ప్రీ క్లైమాక్స్ వరకు ఎవరికీ తెలియకుండా దాచేసాడు దర్శకుడు.. కానీ అలా కాకుండా హీరో అన్నయ్య చనిపోయిన విషయాన్ని వదిన పాత్రలో నటించిన స్నేహకు తప్ప అందరికీ చెప్పుంటే కాస్తైనా ఎమోషనల్ సీన్స్ వర్కవుట్ అయ్యేవని చెప్పాడు పరుచూరి. ఇలా చేసుంటే సినిమా హిట్ అవుతుందా అంటే కాదేమో కానీ కాస్త ఆసక్తికరంగా మారే అవకాశం ఉండేదంటున్నాడు ఈయన.
వినయ విధేయ రామ పరుచూరి
ఇక సినిమాలో ఏ సీన్ ఎందుకు వస్తుంది.. ఎప్పుడు వస్తుందనే విషయంపై కూడా చాలా చోట్ల క్లారిటీ మిస్ అయిందని చెప్పాడు పరుచూరి. అందులో ఓ సన్నివేశంలో కొందరు నక్సల్ స్క్వాడ్ వచ్చి హీరో కుటుంబాన్ని తీసుకెళ్తారు.. అదే సమయంలో ఇంటర్వెల్ సీన్లో సడన్ గా బీహార్ సిఎం అక్కడికి వస్తాడు.. దానికి ముందు జరిగిన ముఖేష్ రిషి ఎపిసోడ్ ఏమైందో చివరివరకు తెలియదు. అసలు వారిని హీరో శిక్షించాడా లేదా అనేది కూడా చూపించలేదని చెప్పాడు పరుచూరి. ఇలాంటి సన్నివేశాల వల్లే సినిమాకు మైనస్ అయిందంటున్నాడు ఈయన.
వినయ విధేయ రామ పరుచూరి
దానికి తోడు కథ బీహార్ వెళ్లడంతోనే నేటివిటీ పోయిందని.. ప్రీ క్లైమాక్స్ వరకు కూడా చాలా సన్నివేశాలు ఆసక్తకిరంగా లేవని చెప్పాడు ఈయన. తాను థియేటర్లో సినిమా చూడలేదని.. అమేజాన్ ప్రైమ్ వీడియోలో సినిమా చూసాడు కాబట్టి దాన్ని బట్టి రివ్యూ ఇస్తున్నానని చెప్పాడు పరుచూరి. తలలు నరికితే తలలు గద్దలు ఎత్తుకెళ్లడం థియేటర్లలో బాగా డిస్ట్రబెన్స్ అనిపిస్తుందని గుర్తు చేసాడు ఈయన.
వినయ విధేయ రామ పోస్టర్
దానికి తోడు పాముతో విలన్ కాటేయించుకోవడం కూడా వర్కవుట్ కాలేదని చెప్పాడు. కొన్ని మార్పులు చేసి ఎమోషనల్ డ్రామా చేసుంటే గ్యాంగ్ లీడర్ మాదిరి అన్నా, వదిన.. వాళ్ల కోసం హీరో చేసే త్యాగం గుర్తు చేసుంటే వినయ విధేయ రామ మనసుకు హత్తుకునేదని చెప్పాడు ఈయన. మొత్తానికి ఒక్కోసారి ఎంత కష్టపడినా కూడా ఫలితం సరిగ్గా రాదని గుర్తు చేసాడు ఈ రైటర్. ఈయన ప్రస్తుతం సైరా సినిమాకు చిరంజీవితో కలిసి పని చేస్తున్నాడు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.