VINAYA VIDHEYA RAMA MOVIE TAMIL AND MALAYALAM COLLETIONS RAM CHARAN DISAPPOINTED ONCE AGAIN PK
‘వినయ విధేయ రామ’ తమిళ, మలయాళ కలెక్షన్లు ఎన్నో తెలుసా..?
వినయ విధేయ రామ పోస్టర్
వినయ విధేయ రామ తెలుగులో డిజాస్టర్. ఇక్కడ ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేవు. ఇక వారం రోజుల కింద ఈ చిత్రాన్ని తమిళ, మలయాళ ఇండస్ట్రీల్లో కూడా విడుదల చేసారు. రామ్ చరణ్ సినిమాలకు ఇక్కడే కాదు.. కేరళలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. అక్కడ కూడా ఆయన మార్కెట్ భారీగానే ఉంటుంది.
వినయ విధేయ రామ తెలుగులో డిజాస్టర్. ఇక్కడ ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేవు. ఇక వారం రోజుల కింద ఈ చిత్రాన్ని తమిళ, మలయాళ ఇండస్ట్రీల్లో కూడా విడుదల చేసారు. రామ్ చరణ్ సినిమాలకు ఇక్కడే కాదు.. కేరళలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. అక్కడ కూడా ఆయన మార్కెట్ భారీగానే ఉంటుంది. పైగా ఎవడు, మగధీర లాంటి సినిమాలు అక్కడ మంచి విజయం సాధించాయి కూడా. దాంతో చరణ్ సినిమాలను అక్కడ విడుదల చేస్తుంటారు. అదే క్రమంలో ఇప్పుడు వినయ విధేయ రామను కూడా డబ్ చేసారు.
వినయ విధేయ రామ ఫైల్ ఫోటో
కేరళలో ఈ చిత్రానికి ఓపెనింగ్స్ బాగానే వచ్చినా ఆ తర్వాత డల్ అయిపోయింది. వారం రోజుల్లో ఇప్పటి వరకు కోటి రూపాయల గ్రాస్.. 50 లక్షల షేర్ వసూలు చేసింది ఈ చిత్రం. దాంతో పాటు తమిళనాట కూడా కోటి రూపాయల వరకు వసూలు చేసింది ఈ చిత్రం. రెండు చోట్లా కలిపి 2 కోట్లకు అమ్మితే ఇప్పటి వరకు వచ్చింది కోటి మాత్రమే. అంటే అక్కడ కూడా వినయ విధేయ రామ డిజాస్టర్ అయిపోయింది. మొత్తానికి బోయపాటి శ్రీను ఈ చిత్రంతో రామ్ చరణ్‌కు మరిచిపోలేని షాక్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈయన రాజమౌళి సినిమాతో బిజీగా ఉన్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.