VINAYA VIDHEYA RAMA MOVIE REVIEW RAM CHARAN BOYAPATI SRINUS VINAYA VIDHEYA RAMA MOVIE REVIEW ONLINE
Vinaya Vidheya Rama Movie Review..‘వినయ విధేయ రామ’ మూవీ రివ్యూ..‘అంతా విధ్వంసమే’
వినయ విధేయ రామ పోస్టర్స్
Vinaya Vidheya Rama Movie Review Online | ‘రంగస్థలం’ తర్వాత రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘వినయ విధేయ రామ’. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై ట్రేడ్‌లో భారీ అంచనాలే ఉన్నాయి. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ సినిమాతో రామ్ చరణ్‌కు బోయాపటి శ్రీను సక్సెస్ అందించాడా లేదా మూవీ రివ్యూలో చూద్దాం.
‘రంగస్థలం’ తర్వాత రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘వినయ విధేయ రామ’. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై ట్రేడ్‌లో భారీ అంచనాలే ఉన్నాయి. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ సినిమాతో రామ్ చరణ్‌కు బోయాపటి శ్రీను సక్సెస్ అందించాడా లేదా మూవీ రివ్యూలో చూద్దాం.
స్టోరీ విషయానికొస్తే..
రామ్ కొణిదెల ఒక అనాథ..చిన్నపుడే నలుగురు అనాథలు అతన్ని పెంచి పెద్ద చేస్తారు. ఈ ఐదుగురు సొంత అన్నదమ్ముల్ల పెరుగుతారు. ఆ అనాథల్లో రామ్ చరణ్ చిన్నవాడు. వీళ్లదో అందమైన ఫ్యామిలీ. అందులో రామ్ పెద్దన్న (ప్రశాంత్) విశాఖ ఎలక్షన్ కమిషనర్‌గా అక్కడి బై ఎలక్షన్‌ను సాఫీగా జరిపిస్తాడు. ఈ సందర్భంలో అక్కడి ప్రతిపక్ష నాయకుడితో రామ్.. పెద్దన్నకు వైరం ఏర్పడుతుంది. అది నచ్చని ప్రతిపక్ష నాయకుడు హీరో కుటుంబాన్ని టార్గెట్ చేస్తాడు. ఈ సందర్భంలో బిహార్ నుంచి మున్నాభాయ్ మనుషులు (వివేక్ ఓబెరాయ్) రంగంలోకి దిగుతాడు. అతని వల్ల రామ్ కుటుంబానికి ఎలాంటి అన్యాయం జరిగింది. దానికి రామ్ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడనేదే ‘వినయ విధేయ రామ’ స్టోరీ.
వినయ విధేయ రామ
నటీనటుల విషయానికొస్తే..
‘రంగస్థలం’ సినిమాతో నటుడిగా ప్రూవ్ చేసుకున్న రామ్ చరణ్‌కు వినయ విధేయ రాముడిగా నటించే అవకాశమే రాలేదు. పూర్తిగా బోయపాటి స్టైల్లో నరుక్కుంటూ పోవడమే తప్ప..నటించే అవకాశమే రాలేదు. కథానాయిక కియరా అద్వానీ గురించి చెప్పాలంటే హీరోకే నటించే అవకాశమే రానప్పుడు హీరోయిన్‌కు ఎక్కడ ఉంటుంది. మరోవైపు ఈసినిమాలో విలన్‌గా చేసిన వివేక్ ఓబెరాయ్ మాత్రం తనదైన విలనిజాన్ని పండించాడు. కళ్లల్లో క్రూరత్వం, రౌద్రం అన్ని కలిసిన విలనిజాన్ని పండించాడు. మిగతా నటీనటుల విషయానికొస్తే చెప్పుకోవడానికి ఏమి లేదు.
వినయ విధేయ రామ
టెక్నీషియన్స్ విషయానికొస్తే..
ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో మాస్ సినిమాలంలే బోయపాటి శ్రీను అనేంతగా పేరు గడించాడు. ఈసారి రామ్ చరణ్ వంటి మెగాహీరోకు ఏమి చెప్పి ఈ సినిమా కథను ఒప్పించాడో ఆ దేవుడికే తెలియాలి. ఇందులో కథ అనేది కిచిడి చేసి పారేసాడు. ఎపుడు ఏ సీన్ వస్తుందో ప్రేక్షకులు గందరగోళ పడేలా చిత్రీకరించాడు. అప్పట్లో రాజమౌళి తెరకెక్కించిన ‘సింహాద్రి’, ‘విక్రమార్కుడు’ సినిమా ఫార్ములాను మరోసారి మిక్సీలో వేసి ఈ కిచిడీ కథను తయారు చేసినట్టు ఉంది. కిచిడీ కథే అయిన దానికి తగ్గ సన్నివేశాలు, ఎమోషనల్ కంటెంట్ బాగుండాలి. అందులో బోయపాటి శ్రీను విఫలమయ్యాడు. టెక్నాలజీ పెరిగిన ఈ కాలంలో హీరోను వాళ్ల అన్నయ్య పిలిస్తే..ట్రైన్‌పై ఎక్కి బిహార్, నేపాల్ బార్డర్‌కు వెళ్లడం వంటి చాలా అతిగా ఉన్నాయి. బిహార్‌లోని మగథలో మున్నాభాయ్ (వివేక్ ఓబరాయ్) చెప్పిందే వేదం. అక్కడ పోలీసులు, మిలటరీ, ప్రభుత్వం ఏమి చేయలేని నిస్సహాయ స్థితి. అక్కడ ఎవడు పోటుగాడు లేనంటూ హీరో వచ్చి మగథలో మున్నాభాయిని ఎదిరించడం. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఫలానా టైమ్‌లో జరిగింది అనే దానికి క్లారిటీ లేకుండా బోయపాటి ఈ సినిమా తెరకెక్కించాడు.
వినయ విధేయ రామ
ఈ సినిమాను బోయపాటి కేవలం యాక్షన్ సన్నివేశాల కోసమే తెరకెక్కించినట్టు క్లైమాక్స్‌లో ఒక పిల్లాడిని విలన్ పాముతో బెదిరిస్తూ...పాముతో తన చేతికి కాటు వేయించుకుంటాడు. విచిత్రంగా పాము చచ్చిపోతుంది. ఇలాంటి చిత్ర విచిత్రమైన సన్నివేశాలు ఈ సినిమాలో ఎన్నో ఉన్నాయి. దర్శకుడిగా సుకుమార్..రామ్ చరణ్‌ను నటుడిగా ప్రూవ్ చేసి పది మెట్లు ఎక్కిస్తే..బోయపాటి శ్రీను మాత్రం రామ్ చరణ్‌లో ఉన్న నటనను కాకుండా..అతని సిక్స్ ప్యాక్ బాడీ చూపించడానికే పరిమితం అయి అతన్ని మరోసారి పాతాళంలోకి తోసేసాడు. మొత్తానికి ‘వినయ విధేయ రామ’ టైటిల్‌కు ఈ సినిమాకు పొంతనే లేదు. ఒక సినిమాను ఎలా తీయకూడదో బోయపాటి శ్రీను ఈ చిత్రంతో నిరూపించాడు.
వినయ విధేయ రామ
దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఈ సినిమాకు వర్కౌట్ కాలేదు. ఈసారి తన పాటలతో మ్యాజిక్ చేయలేకపోయాడు. రిషి పంజాబీ, ఆర్థర్ విల్సన్ ఫోటోగ్రఫీ, నిర్మాణ విలువలు రిచ్‌గా ఉన్నాయి.యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ బాగుంది. మొత్తానికి సంక్రాంతి పండగ సందర్భంగా వచ్చిన ‘వినయ విధేయ రామ’ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టింది. మొత్తానికి ‘వినయ విధేయ రామ’ అని కాకుండా ఈ సినిమాను వినయ విధ్వంసక రామ అని చెప్పాలి.
నటీనటులు: రామ్ చరణ్, కియరా అద్వానీ, వివేక్ ఓబెరాయ్, ప్రశాంత్, స్నేహ, ఆర్యన్ రాజేష్, చలపతి రావు తదితరులు మ్యూజిక్: దేవీశ్రీ ప్రసాద్ సినిమాటోగ్రఫర్: రిషీ పంజాబీ, ఆర్థర్.ఏ.విల్సన్ నిర్మాత : డివివి దానయ్య దర్శకత్వం : బోయపాటి శ్రీను రేటింగ్: 1.5/5
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.