రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’ తొలిరోజే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అనుకున్నట్లుగానే సినిమా కూడా పరాజయం పాలైంది. ఇప్పటికే చాలా చోట్ల దారుణమైన నష్టాలు తీసుకొచ్చింది ఈ చిత్రం. అయితే ఇంత దారుణంగా దెబ్బతిన్నా కూడా కొన్ని రికార్డులను మాత్రం తన ఖాతాలో వేసుకుంది ఈ చిత్రం.
రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’ తొలిరోజే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అనుకున్నట్లుగానే సినిమా కూడా పరాజయం పాలైంది. ఇప్పటికే చాలా చోట్ల దారుణమైన నష్టాలు తీసుకొచ్చింది ఈ చిత్రం. అయితే ఇంత దారుణంగా దెబ్బతిన్నా కూడా కొన్ని రికార్డులను మాత్రం తన ఖాతాలో వేసుకుంది ఈ చిత్రం. తెలుగు ఇండస్ట్రీలో ఏ ఫ్లాప్ సినిమాకు సాధ్యం కాని రీతిలో కొన్ని రికార్డులు తిరగరాసాడు రామ్ చరణ్. ఫుల్ రన్లో ఈ చిత్రం 62 కోట్లు వసూలు చేసింది. ఇదే ఇప్పుడు ఆల్ టైమ్ రికార్డులు సృష్టించింది. నైజాంలో 13 కోట్ల వరకు షేర్ వసూలు చేసిన వినయ విధేయ రామ.. ఆంధ్రాలో కూడా భారీగానే తీసుకొచ్చింది.
వినయ విధేయ రామ
ఓ ఫ్లాప్ సినిమాకు ఇంత భారీ వసూళ్లు రావడం తెలుగు ఇండస్ట్రీలో ఇదే తొలిసారి. తొలిరోజు వచ్చిన దారుణమైన టాక్ చూసి కనీసం 40 కోట్లు దాటుతుందా అనుకుంటున్న తరుణంలో ఏకంగా 60 కోట్ల షేర్ అందుకోవడం చిన్న విషయం కాదు. ఈ క్రమంలోనే ‘కాటమరాయుడు’, ‘స్పైడర్’, ‘అజ్ఞాతవాసి’, ‘బ్రహ్మోత్సవం’, ‘సర్దార్ గబ్బర్ సింగ్’ లాంటి భారీ డిజాస్టర్స్ కలెక్షన్లను దాటేస్తూ వచ్చింది ‘వినయ విధేయ రామ’. ఆ సినిమాలు కూడా ఫ్లాపులే అయినా కూడా భారీ వసూళ్లు సాధించాయి. ఇప్పుడు వినయ విధేయ రామ ఫుల్ రన్ కలెక్షన్లలో అందర్నీ దాటేసింది.
మహేశ్ బాబు చరణ్
పవన్ స్టామినాతో ‘అజ్ఞాతవాసి’, ‘సర్దార్’, ‘కాటమరాయుడు’ సినిమాలు 50 కోట్లకు పైగానే షేర్ వసూలు చేసాయి. కాటమరాయుడు అయితే ఏకంగా 61 కోట్ల షేర్ వసూలు చేసింది. ఫ్లాప్ సినిమాల్లో ఇప్పటి వరకు ఇదే రికార్డు. కానీ ఇప్పుడు ‘వినయ విధేయ రామ’ దాన్ని తిరగరాసాడు. ఇక స్పైడర్ 50 కోట్లకు పైగానే షేర్ వసూలు చేసింది.
వినయ విధేయ రామ అజ్ఞాతవాసి
బ్రహ్మోత్సవం లాంటి డిజాస్టర్ కూడా 40 కోట్ల వరకు షేర్ తీసుకొచ్చింది. మొత్తానికి ఇప్పుడు భారీ డిజాస్టర్ అయి కూడా భారీ వసూళ్లు తీసుకొచ్చిన సినిమాల్లో నెంబర్ వన్ స్థానంలో ‘వినయ విధేయ రామ’ ఉంది. ఇది కూడా ఓ రకంగా రికార్డే మరి. చరణ్ మాస్ స్టామినాకు ఇది కొలమానమే. ప్రస్తుతం ఈయన రాజమౌళి సినిమాతో బిజీగా ఉన్నాడు.
కైరా అద్వానీ హాట్ ఫోటోషూట్..
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.