VINAYA VIDHEYA RAMA CROSSED BHARAT ANE NENU COLLECTIONS IN CEDED
‘భరత్ అనే నేను’ రికార్డు దాటేసిన ‘వినయ విధేయ రామ’..
రామ్ చరణ్ మహేశ్
అదేంటి ఫ్లాప్ సినిమా వచ్చి హిట్ సినిమా రికార్డులను తిరగరాయడం ఏంటి.. అసలేమైనా నమ్మేలా ఉందా ఇది అనుకుంటున్నారా..? కానీ కచ్చితంగా నమ్మాల్సిందే.. ఎందుకంటే ఇప్పుడు ఇదే జరుగుతుంది. నిజంగానే మహేశ్ బాబు రికార్డులను రామ్ చరణ్ దాటేసాడు.
అదేంటి ఫ్లాప్ సినిమా వచ్చి హిట్ సినిమా రికార్డులను తిరగరాయడం ఏంటి.. అసలేమైనా నమ్మేలా ఉందా ఇది అనుకుంటున్నారా..? కానీ కచ్చితంగా నమ్మాల్సిందే.. ఎందుకంటే ఇప్పుడు ఇదే జరుగుతుంది. నిజంగానే మహేశ్ బాబు రికార్డులను రామ్ చరణ్ దాటేసాడు. నమ్మడానికి ఇది కాస్త కష్టంగానే అనిపిస్తుంది కానీ లెక్కలు చెబుతున్న సాక్ష్యాలివి. అన్ని చోట్లా కాదు కానీ సీడెడ్ ఏరియాలో మాత్రం ‘వినయ విధేయ రామ’ టాక్తో పనిలేకుండా దున్నేస్తుంది. అక్కడ 6 రోజుల్లో ఈ చిత్రం 11 కోట్ల షేర్ వసూలు చేసింది.
రామ్ చరణ్ మహేశ్
తొలిరోజే రికార్డు స్థాయిలో 7.15 కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించిన ఈ చిత్రం ఆ తర్వాత ఐదు రోజుల్లో ఎలాగోలా కష్టపడి మరో నాలుగు కోట్లు వసూలు చేసింది. దాంతో ఇప్పుడు అక్కడ ‘భరత్ అనే నేను’ రికార్డులకు చెక్ పెట్టేసింది ఈ చిత్రం. మహేశ్ నటించిన ఈ చిత్రం అక్కడ ఫుల్ రన్లో 9.60 కోట్లు షేర్ వసూలు చేసింది. కానీ ఇప్పుడు ‘వినయ విధేయ రామ’ మాత్రం ఏకంగా 10 కోట్లకు పైగా షేర్.. అది కూడా కేవలం ఆరు రోజుల్లోనే సాధించి చరణ్ మాస్ పవర్ ఏంటో చూపించింది.
రామ్ చరణ్ మహేశ్
ఫ్లాప్ టాక్ వస్తేనే పరిస్థితి ఇలా ఉంటే.. ఒకవేళ దీనికి కానీ హిట్ టాక్ వచ్చుంటే అసలు ఊహించుకోడానికి కూడా భయపడే రికార్డులు సెట్ చేసేవాడేమో..? ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఆరు రోజుల్లో 47 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇప్పటికీ బి, సి సెంటర్లలో మంచి వసూళ్లనే సాధిస్తుంది ఈ చిత్రం. మరి చూడాలిక.. రన్ ముగిసేసరికి ఈ చిత్రం ఎంత దూరం వెళ్లనుందో..?
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.