ఎన్నో చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ విలన్ పొన్నంబలం. ఇటీవలే ఆయన ఆస్పత్రి పాలైన విషయం తెలిసిందే. కిడ్నీలు పాడవ్వడంతో ఆయన ఆస్పత్రిలో చేరారు. అయితే ఆయన ఆస్పత్రిపాలవ్వడంతో అతనికి సంబంధించి రకరకాల వార్తలు మీడియాలో చక్కర్లుకొట్టాయి. అతిగా మద్యం సేవించడం, డ్రగ్స్ వాడకం వల్లే తన కిడ్నీలు పాడైయ్యాయని వచ్చిన వార్తలు అవాస్తవమన్నారు పొన్నంబలం. తన సోదరుడు విషం ఇవ్వడం వల్లే తన కిడ్నీ ఫెయిల్ అయ్యిందన్న సంచలన నిజాన్ని ఆయన వెల్లడించారు.
కొన్ని వారాల క్రితం నటుడు పొన్నంబలం కిడ్నీ ఫెయిల్యూర్ కారణంగా ఆస్పత్రిలో చేరారు. ఆ తర్వాత ఆయనకు అతని బంధువు , దర్శకుడు జగన్నాథన్ తన కిడ్నీని దానం చేయడం వల్ల బతికిపోయారని నివేదికలు వెలువడ్డాయి. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పొన్నంబలకు ఫిబ్రవరి 10న కిడ్నీ మార్పిడి జరిగింది. ఇప్పుడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి.. కోలుకున్న తర్వాత ఆయన బిహైండ్ వుడ్స్ వెబ్‌సైట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాలు వెల్లడించారు. మద్యం, మాదక ద్రవ్యాల వినియోగం వల్ల తన కిడ్నీలు విఫలమవుతున్నాయని చాలా మంది భావించారన్నారు. కానీ అలాంటిదేమీ జరగలేదన్నారు. తన తండ్రికి నలుగురు భార్యలని.. మూడో భార్య కొడుకు తన దగ్గర కొంత కాలం మేనేజర్‌గా పనిచేశాడని తెలిపారు. మేనేజర్‌గా పనిచేసిన తన తమ్ముడే ఒకసారి తనకు బీరులో స్లో పాయిజన్ ఇచ్చాడన్నారు.
అయితే అతను అలా చేశాడని మొదట తనకు తెలియదన్నారు. ఆ తర్వాతే ఈ దారుణమైన పని చేశాడని తనకు తెలిసిందన్నారు. దేవుడి దయ వల్ల ఇప్పుడు తన ఆరోగ్యం బాగుందని.. కోలుకుంటున్నానని తెలిపారు. తనకు కష్ట సమయంలో సహాయం చేసిన ప్రతి ఒక్కరికీ తాను రుణపడి ఉంటానన్నారు. ఇకు నటుడు పొన్నంబలం విషయానికి వస్తే... 90వ దశకంలో తమిళ చిత్రసీమలో ప్రధాన విలన్‌గా వెలుగొందారు. రజనీ, కమల్, అజిత్, విజయ్ వంటి ప్రముఖ హీరోలతో కలిసి నటించారు. ఆయ పలువ తెలుగు సినిమాల్లో నటించారు. నాథమి సినిమాలో శరత్‌కుమార్‌కు విలన్ పాత్ర పొన్నంబలకు మంచి పేరు తెచ్చి పెట్టింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.