నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను హిట్ కాంబినేషన్లో BB3(వర్కింగ్ టైటిల్) తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సింహా, లెజెండ్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న చిత్రం కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. మే 28న ఈ చిత్రం విడుదల కానున్నట్టుగా నిర్మాణ సంస్థ ద్వారక క్రియేషన్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో మిగిలిన షూటింగ్ వేగంగా జరుగుతుంతోంది. ఈ క్రమంలోనే వికారాబాద్ మండలం కొటాల గూడెంలో ఈ చిత్ర షూటింగ్ జరిపేందుకు ప్లాన్ చేశారు. అయితే అక్కడ షూటింగ్ జరిపేందుకు వెళ్లిన చిత్ర బృందాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారని సమాచారం. షూటింగ్ వలన పంటపొలాలు దెబ్బతింటాయని వారు చిత్ర బృందానికి తెలిపారు. షూటింగ్ జరిపితే పంటపొలాలు పాడవుతాయని చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ చిత్ర యూనిట్ అక్కడ ప్లాన్ చేసిన సన్నివేశాలకు మరో లోకేషన్ వెతికే పనిలో పడింది.
ఈ చిత్రానికి పవర్ ఫుల్ టైటిల్‌ను పరిశీలించిన చిత్ర బృందం.. గాడ్‌ఫాదర్ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఇక, ఈ చిత్రాన్ని ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందరెడ్డి నిర్మిస్తున్నారు. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటిస్తుంది. థమన్ ఈ చత్రానికి సంగీతం అందిస్తున్నాడు. సినిమా వేసవి వినోదంగా ఎన్టీఆర్ జయంతి(మే 28)న విడుదల కానుంది.
ఇక, బాలకృష్ణ జన్మదినం సందర్భంగా బీబీ3 ఫస్ట్ రోర్ పేరట రిలీజ్ చేసిన వీడియో ఓ రేంజ్ అభిమానులను అలరించింది. బాలకృష్ణ చెప్పిన డైలాగ్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది.