హోమ్ /వార్తలు /సినిమా /

Villa 369: దర్శకుడు చేతులు మీదుగా విడుదలైన ‘విల్లా 369’.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్ పోస్టర్..

Villa 369: దర్శకుడు చేతులు మీదుగా విడుదలైన ‘విల్లా 369’.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్ పోస్టర్..

‘విల్లా’ 369 ఫస్ట్ లుక్ (File/Photo)

‘విల్లా’ 369 ఫస్ట్ లుక్ (File/Photo)

Villa 369: విగన్ క్రియేషన్స్ సమర్పణలో విజయ్, శీతల్ బట్ హీరో, హీరోయిన్లు గా సురేష్ ప్రభు దర్శకత్వంలో విద్య గణేష్, నిర్మాతగా, డా.రాకేష్ సహ నిర్మాతగా కలసి చేస్తున్న సినిమా "విల్లా 369".

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Villa 369: విగన్ క్రియేషన్స్ సమర్పణలో విజయ్, శీతల్ బట్ హీరో, హీరోయిన్లు గా సురేష్ ప్రభు దర్శకత్వంలో విద్య గణేష్, నిర్మాతగా, డా.రాకేష్ సహ నిర్మాతగా కలసి చేస్తున్న సినిమా "విల్లా 369". శర వేగంగా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను దర్శకుడు తేజ విడుదల చేశారు. అనంతరం దర్శకుడు తేజ మాట్లాడుతూ.. దర్శకుడు సురేష్ ప్రభు మంచి సబ్జెక్ట్ ను సెలెక్ట్ చేసుకొని తీసిన "విల్లా 369" సినిమా దర్శక, నిర్మాతలకు మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు తెలిపారు. చిత్ర నిర్మాత విద్య గణేష్ మాట్లాడుతూ.. ఈ చిత్రానికి దర్శకుడు మంచి నటీ నటులను సెలెక్ట్ చేసుకున్నాడు. ఈ సినిమాకు డి. ఓ. పి ర్యాడీ రఫీ కెమెరా పనితనం అద్భుతంగా ఉంది. సంగీత దర్శకుడు మహావీర్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని అన్నారు.

చిత్ర దర్శకుడు సురేష్ ప్రభు మాట్లాడుతూ..ఇలాంటి మంచి కథను చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతలకు ధన్యవాదముల తెలియజేసారు. నిర్మాతల విద్య గణేష్, సహ నిర్మాత డా.రాకేష్, ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్స్ చిత్రం శ్రీను, లక్ష్మణ్ బాబు లు అందరూ నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చినందునే ఈ సినిమా అనుకున్న విధంగా చాలా బాగా వచ్చింది. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా చిత్రాన్ని ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు తెలిపారు.

తేజ చేతులు మీదుగా విడుదలైన విల్లా 369 ఫస్ట్ లుక్ (Twitter/Photo)

నటీ నటులు రవి వర్మ, జ్యోతి, చిత్రం శ్రీను, శివారెడ్డి తదితరులు

సాంకేతిక నిపుణులు

నిర్మాత : విద్య గణేష్

దర్శకుడు : సురేష్ ప్రభు

సహ నిర్మాత : డా.రాకేష్

కెమెరా : ర్యాడీ రఫీ

సంగీతం : మహావీర్

ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్స్ : చిత్రం శ్రీను, లక్ష్మణ్ బాబు

పి. ఆర్ ఓ : మధు వి.ఆర్

దర్శకుడు తేజ విషయానికొస్తే.. గత కొన్నేళ్లుగా ఈయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రాలు పెద్దగా విజయాలు సాధించలేదు. ’నేనే రాజు నేనే మంత్రి’ తర్వాత ‘సీత’ సినిమా పెద్దగా అలరించలేకపోయింది. ఇక ఈయన దగ్గుబాటి రానా తమ్ముడు హీరోగా అహింస సినిమా తెరకెక్కించాడు. ఈ సినిమా పూర్తైయింది. త్వరలో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

First published:

Tags: Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు