ప్రభాస్‌ పేరును బాగానే వాడుకుంటున్న విక్రమ్..

బాహుబలి సినిమాతో హీరోగా ప్రభాస్ రేంజ్ మారిపోయింది. ఈ సినిమాతో ప్రభాస్ గ్లోబల్ హీరోగా తన సత్తా చాటాడు. తాజాగా ప్రభాస్ క్రేజ్‌ను విక్రమ్ వాడుకోవాలని డిసైడ్ అయ్యాడు.

news18-telugu
Updated: November 3, 2019, 5:15 PM IST
ప్రభాస్‌ పేరును బాగానే వాడుకుంటున్న విక్రమ్..
ప్రభాస్, విక్రమ్ (Facebook/Photo)
  • Share this:
హీరో ప్రభాస్ పేరును తమిళ హీరో విక్రమ్ బాగానే వాడుకుంటున్నాడు. హీరోగా విక్రమ్ క్రేజ్ తగ్గడంతో ప్రభాస్ పేరును వాడుకుంటున్నారని డౌట్ పడుతున్నారా.. వివరాల్లోకి వెళితే.. బాహుబలి సినిమాతో హీరోగా ప్రభాస్ రేంజ్ మారిపోయింది. ఈ సినిమాతో ప్రభాస్ గ్లోబల్ హీరోగా తన సత్తా చాటాడు.ఈ సినిమా తర్వాత విడుదలైన ‘సాహో’ సినిమాకు డిజాస్టర్ టాక్ వచ్చిన  రూ. 400 కోట్లు కోట్లు కొల్లగొట్టింది. దీంతో హీరోగా ప్రభాస్ స్టామినా ఏంటో అందరికీ తెలిసొచ్చింది. తాజాగా హీరో ప్రభాస్‌ క్రేజ్‌ను తమిళ హీరో విక్రమ్ బాగానే వాడుకునే పనిలో పడ్డాడు. తాజాగా విక్రమ్ .. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ‘ధృవ నచ్చత్రం’ సినిమ ా చేస్తున్నాడు. తెలుగులో ‘ధృవ నక్షత్రం’ అనే టైటిల్‌తో రాబోతుంది. ఈ సినిమాలో విక్రమ్..‘జాన్’ అనే స్పై ఏజెంట్ పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్..  రాధాకృష్ణ దర్శకత్వంలో చేస్తోన్న సినిమాకు ‘జాన్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. అసలు ప్రభాస్ సినిమా షూటింగ్ ప్రారంభం కాకముందే విక్రమ్, గౌతమ్ మీనన్ షూటింగ్ కంప్లీటైంది. కానీ ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ‘ధృవ నచ్చత్రం’లో విక్రమ్ జాన్ పాత్రలో నటించడంపై ఆసక్తి కనబరుస్తున్నారు. త్వరలోనే విక్రమ్ ‘ధృవ నక్షత్రం’ సినిమా విడుదల కానున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. మరి ప్రభాస్ ‘జాన్’ పేరుతోనైనా హీరోగా విక్రమ్ ‘ధృవ నచ్చత్రం’ సినిమాతో సక్సెస్ అందుకుంటాడా లేదా అనేది చూడాలి.
First published: November 3, 2019, 5:15 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading