స్టార్ డైరెక్టర్ మణిరత్నం (Manirathnam) ప్రెస్టేజియస్ మూవీ పొన్నియిన్ సెల్వన్ (Ponniyin Selvan). 500 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాతో మొదటిసారి పాన్ ఇండియా మార్కెట్లో బిగ్ హిట్ అందుకోవాలని పక్కాగా ప్లాన్ చేశారట మణిరత్నం. 10వ శతాబ్దంలో చోళరాజుల కాలానికి సంబంధించిన కథతో ఈ ‘పొన్నియన్ సెల్వన్’ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో భారీ తారాగణాన్ని చూడబోతున్నాం. చియాన్ విక్రమ్ (Vikram) ముఖ్య పాత్ర పోషించగా.. కార్తి (Karthi), త్రిష (Trisha), విక్రమ్ (Vikram), ఐశ్వర్య రాయ్ (Aishwarya Rai), ప్రకాష్ రాజ్ (Prakash Raj), జయం రవి (Jayam Ravi), జయరాం (Jayaram), ప్రభు (Prabhu), శరత్ కుమార్, పార్తీబన్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసి ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ ఇచ్చారు మణిరత్నం.
ఈ మూవీ తెలుగు టీజర్‌ను సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh babu) రిలీజ్ చేశారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాలో ఈ టీజర్‌ని షేర్ చేసిన మహేష్ బాబు.. తన ఫేవరెట్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కిస్తున్న భారీ సినిమా పొన్నియిన్ సెల్వన్ టీజర్ రిలీజ్ చేయడం ఎంతో థ్రిల్లింగ్ గా ఉందని పేర్కొన్నారు. విడుదల చేసిన కాసేపట్లోనే ఈ టీజర్ వైరల్ అయింది.
ఈ వీడియో చూస్తుంటే మణిరత్నం స్టామినా మరోసారి ప్రూవ్ కానుందని స్పష్టంగా తెలుస్తోంది. ఆనాటి రాజుల కాలాన్ని తిరిగి ఇప్పుడు ప్రేక్షకులకు కళ్ళకు కట్టినట్లు చూపించబోతున్నారని అర్థమవుతోంది. ఒక నిమిషం 21 సెకనుల నిడివితో కట్ చేసిన ఈ టీజర్ ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ ఇచ్చిందని చెప్పుకోవాలి. భారీ లెవెల్ సన్నివేశాలకు ఏఆర్ రెహమాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రాణం పోసింది.
తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళీ భాషల్లో ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ఈ చిత్రంపై భారీ డిమాండ్ నెలకొంది. దీంతో 24 కోట్లు భారీ మొత్తం చెల్లించి టిప్స్ మ్యూజిక్ వారు ఈ సినిమా ఆడియో హక్కులు పొందారనేది కోలీవుడ్ వర్గాల మాట. ఈ ప్రతిష్టాత్మక సినిమాను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగా తొలి భాగాన్ని సెప్టెంబర్ 30న విడుదల చేయనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chiyan Vikram, Manirathnam, Ponniyin Selvan