Home /News /movies /

VIKRAM PONNIYIN SELVAN 1 TAMIL STAR VIKRAM GREAT ACHIEVEMENT FOR PONNIYAN SELVAN 1 JR NTR RAM CHARAN COULD NOT DO IT WITH RRR TA

Vikram - Ponniyin Selvan-1: పొన్నియన్ సెల్వన్ కోసం విక్రమ్ మరో గ్రేట్ అఛీవ్‌మెంట్.. ఎన్టీఆర్, రామ్ చరణ్‌లకు కూడా సాధ్యం కాలేదు..

విక్రమ్ మరో రికార్డు (Twitter/Photo)

విక్రమ్ మరో రికార్డు (Twitter/Photo)

Vikram | తమిళ దర్శకుడు మణిరత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న హిస్టోరికల్ మూవీ పొన్నియిన్ సెల్వన్. దాదాపు మణిరత్నం తన కెరీర్‌లో తొలిసారి చారిత్రక నేపథ్యమున్న సినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో విక్రమ్, కార్తి, జయం రవి హీరోలుగా నటించారు. ఈ సినిమా కోసం విక్రమ్ మరో ఘనత అందుకున్నారు.

ఇంకా చదవండి ...
    Vikram - Ponniyin Selvan-1 : తమిళ అగ్ర నటుడు విక్రమ్ గురించి కొత్తగా పరిచయ వ్యాఖ్యలు అవసరం లేదు. తనదైన నటనతో భాషతో సంబంధం లేకుండా అభిమానులను సంపాదించుకున్న నటుడిగా విక్రమ్ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో ‘పొన్నియన్ సెల్వన్’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమ ా రెండు భాగాలుగా రానుంది. అందులో మొదటి భాగం 30 సెప్టెంబర్ 2022న విడుదల కానుంది. ఈ సినిమాను మణిరత్నం ప్రముఖ రచయత కల్కి కృష్ణమూర్తి రచించిన ‘పొన్నియన్ సెల్వన్’ నవల ఆధారంగా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ‘పొన్నియన్ సెల్వన్’ మూవీకి సంబంధించిన మొదటి భాగానికి సంబంధించిన షూటింగ్ కంప్లీటైంది. రెండో పార్ట్ కూడా సగం పూర్తైయింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు నడుస్తున్నాయి.

    పొన్నియన్ సెల్వన్ సినిమాను తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాక సంబంధించిన డబ్బింగ్ పనులపై మణిరత్నం దృష్టి పెట్టారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి విక్రమ్ తమిళంతో పాటు ఒకేసారి తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోనున్నారు. ఈ విషయాన్ని లైకా ప్రొడక్షన్ వాళ్లు అఫీషియల్‌గా ప్రకటించారు.


    రీసెంట్‌గా ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఎన్టీఆర్, రామ్ చరణ్.. మలయాళం తప్పించి మిగతా అన్ని భాషల్లో తమ పాత్రలకు తామే డబ్బింగ్ చెప్పుకున్నారు. ఇపుడు విక్రమ్ మలయాళం సహా ఐదు భాషల్లో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోనున్నారు. పొన్నియన్ సెల్వన్ మూవీ నుంచి విక్రమ్ ఒక్కడే ఐదు భాషల్లో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంటున్నారా లేదా అనేది చూడాలి.



    ఈ సినిమా ఓటీటీ డీల్ కుదిరిందని తెలుస్తోంది. ఈ సినిమా పోస్ట్ థియేట్రికల్ స్ట్రీమింగ్ హక్కులని ప్రముఖ ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుందట. అమెజాన్ ప్రైమ్ అన్ని భాషాల్లో కలిపి ఈ సినిమాకి రూ.  125 కోట్లకి కొనుగోలు చేసినట్టుగా తెలుస్తుంది. ఏఆర్ ఆర్ రెహమాన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. అంతేకాదు ప్రధానమైన పాత్రలకు సంబంధించిన లుక్స్ కూడా విడుదల చేశారు. ఆ పోస్టర్స్ చూస్తుంటే ఈ సినిమాపై మరింతగా ఆసక్తి పెరిగిపోతోంది. ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో విక్రమ్‌తో పాటు తమిళ నటుడు విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిష కనిపించనున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్టర్స్  సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

    IMDB Ratings : 2022లో IMDB లిస్టులో టాప్ మూవీస్ ఇవే.. RRR,KGF2,విక్రమ్ మూవీ ఎన్నో ప్లేస్‌లో ఉన్నాయంటే..


    ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఇది 10వ శతాబ్దంలో చోళరాజుల కాలానికి సంబంధించిన కథ అని తెలుస్తోంది. ఆ కాలంలో జరిగిన ఒక ఆసక్తికరమైన సంఘటనను ఆధారంగా చేసుకుని దాని చుట్టూ అల్లుకున్న కథ ఇదని అంటున్నారు. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ బ్యానర్ పై మణిరత్నం, సుభాష్ కరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఎస్.రవి వర్మన్ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అందిస్తున్నారు. అక్కినేని శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ చేస్తున్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Jr ntr, Kollywood, Ponniyin Selvan, Ram Charan, RRR, Tollywood, Vikram

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు