హోమ్ /వార్తలు /సినిమా /

PS-1- Ponniyin Selvan Movie Review: పొన్నియన్ సెల్వన్ మూవీ రివ్యూ.. మణిరత్నం మార్క్ యావరేజ్ వార్ డ్రామా..

పొన్నియన్ సెల్వన్ -1 (PS-1 Ponniyin Selvan-1)
పొన్నియన్ సెల్వన్ -1 (PS-1 Ponniyin Selvan-1)
3/5
రిలీజ్ తేదీ:30/9/2022
దర్శకుడు : మణి రత్నం (Mani Ratnam)
సంగీతం : ఏ.ఆర్.రెహమాన్ (A.R.Rehman)
నటీనటులు : విక్రమ్, ఐశ్వర్యరాయ్ బచ్చన్, జయం రవి, కార్తి, త్రిష,శరత్ కుమార్,ప్రభు,విక్రమ్ ప్రభు,పార్థిపన్, జయరామ్, ప్రకాష్ రాజ్ తదితరులు..
సినిమా శైలి : Epic War Drama
సినిమా నిడివి : 2 Hr 56 Minits

PS-1- Ponniyin Selvan Movie Review: పొన్నియన్ సెల్వన్ మూవీ రివ్యూ.. మణిరత్నం మార్క్ యావరేజ్ వార్ డ్రామా..

’పొన్నియన్ సెల్వన్’ మూవీ రివ్యూ (Twitter/Photo)

’పొన్నియన్ సెల్వన్’ మూవీ రివ్యూ (Twitter/Photo)

PS-1- Ponniyin Selvan Movie Review: తమిళ దర్శకుడు మణిరత్నంకు తెలుగు సహా ప్యాన్ ఇండియా లెవల్లో ఎంతో మంది అభిమానున్నారు. ఈయన ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న హిస్టారికల్ మూవీ పొన్నియిన్ సెల్వన్. ఈ రోజు ప్యాన్ ఇండియా లెవల్లో విడుదలైంది. ఈ సినిమాలో ముఖ్యపాత్రలో విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష నటించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో మన మూవీ రివ్యూలో చూద్దాం..

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

రివ్యూ : పొన్నియన్ సెల్వన్ -1 (Ponniyin Selvan(PS-1))

నటీనటులు : విక్రమ్, ఐశ్వర్యరాయ్ బచ్చన్, జయం రవి, కార్తి, త్రిష,శరత్ కుమార్,ప్రభు,విక్రమ్ ప్రభు,పార్థిపన్, జయరామ్, ప్రకాష్ రాజ్ తదితరులు..

ఎడిటర్: ఏ. శ్రీకర్ ప్రసాద్

సినిమాటోగ్రఫీ: రవి వర్మన్

సంగీతం: ఏ.ఆర్,రెహమాన్

నిర్మాత : సుభాష్ కరణ్, మణి రత్నం

దర్శకత్వం: మణి రత్నం

విడుదల తేది : 30/9/2022

PS-1- Ponniyin Selvan Movie Review: తమిళ దర్శకుడు మణిరత్నంకు తెలుగు సహా ప్యాన్ ఇండియా లెవల్లో ఎంతో మంది అభిమానున్నారు. ఈయన ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న హిస్టారికల్ మూవీ పొన్నియిన్ సెల్వన్. ఈ రోజు ప్యాన్ ఇండియా లెవల్లో విడుదలైంది. ఈ సినిమాలో ముఖ్యపాత్రలో విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష నటించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో మన మూవీ రివ్యూలో చూద్దాం..

కథ విషయానికొస్తే..

సువిశాల చోళ సామ్రాజ్యానికి సుందర చోళుడు (ప్రకాష్ రాజ్) మహారాజు. తంజావురు కోట కేంద్రంగా పరిపాలన చేస్తుంటాడు.  ఇతనికి ముగ్గురు పిల్లలు యువరాజు ఆదిత్య కరికాలుడు (విక్రమ్), సుందర చోళుడి చిన్న కుమారుడు అరుళ్‌మోళి వర్మన్ (జయం రవి) ఇతనే పొన్నియన్ సెల్వన్. మరియు కూతురు రాజకుమారి కుందవై సుగుణవతి. సువిశాల రాజ్యంలో పెద్ద కుమారుడు ఆదిత్య కరికాలుడు పలు రాజ్యాలను జయిస్తూ రాజ్యాన్ని విస్తరించే పనిలో ఉంటాడు. చిన్న కుమారుడు అరుల్‌మోళి వర్మన్  శ్రీలంకలో రాజ్యాన్ని చూసుకుంటాడు. ఈ క్రమంలో రాజు సుందర చోళుడు అనారోగ్యంతో మంచానా పడతాడు. ఈ క్రమంలో కొడుకులు దూరంగా ఉన్న సుందర చోళుడి స్థానంలో అతని అన్న (కందారిత్య చోళుడు) కుమారుడు మధురాంతకుడికి రాజును చేయాలని రాజకోటలో కుట్రలు మొదలవుతాయి. ఈ క్రమంలో కోటలో జరిగే  శత్రువులను కుట్రలను సుందర చోళుడు కుమారులు చేధించారా.. ? మరియు   ఈ క్రమంలో రాజ నందిని (ఐశ్వర్యా రాయ్) ఎవరు ? వీరికి చోళ సామాజ్రానికి ఉన్న సంబంధం ఏమిటి ? ఆదిత్య కరికాలుడు స్నేహితుడు వల్లవ రాయన్ ( కార్తి) పాత్ర ఏమిటన్నదే పొన్నియన్ సెల్వన్ -1 స్టోరీ.

కథనం, టెక్నీషియన్స్ విషయానాకొస్తే..

దేశం గర్వంచదగ్గ దర్శకుల్లో మణి రత్నం ఒకరు. ఆయన ఏ సబ్జెక్ట్ తీసుకున్న దాన్ని అద్భుతంగా తెరకెక్కించడం మణి రత్నం శైలి. ఈయన 40 యేళ్ల  కెరీర్‌లో కల్కి కృష్ణమూర్తి రచించిన పొన్నియన్ సెల్వన్ నవలను సినిమాగా తెరకెక్కించాలన్నది జీవిత కాలపు కల. ఇపుడా కలను పొన్నియన్ సెల్వన్ -1 మూవీతో సాకారం చేసుకున్నాడు. ముఖ్యంగా గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్‌తో పాటు సినిమాను ఒక యుద్ధంతో ప్రారంభించాడు. ముఖ్యంగా మణి రత్నం ఇలాంటి క్లిష్ట సబ్టెక్ట్‌ను తెరపై చక్కగా ఆవిష్కరించినా... అక్కడక్కడ ఎమోషన్స్ మిస్ అయిన ఫీలింగ్ ఆడియన్స్‌కు కలుగుతుంది. ముఖ్యంగా ఈ సినిమాను ఎక్కువగా నాచురల్ లోకేషన్స్‌లో తీసే ప్రయత్నం చేసారు. దర్శకుడిగా మణి రత్నం టేకింగ్ బాగుంది.  క్లైమాక్స్‌లో వచ్చే సముద్రపు సన్నివేశాలను ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాయి. ముఖ్యంగా ముఖ్యంగా నవల చదివ వాళ్లు బాగానే కనెక్ట్ అవుతారు. కామన్ ఆడియన్స్ ఈ సినిమాకు ఏ మేరకు కనెక్ట్ అవుతారనేది చూడాలి. ముఖ్యంగా విక్రమ్, ఐశ్వర్య రాయ్ మధ్య దూరం పెరగడానికి కారణమైన నాజర్ పాత్ర ఎవరనేది రివీల్ చేయలేదు. ఐశ్వర్య రాయ్‌కు ఆమెకు ఉన్న సంబంధం ఏమిటో చెప్పలేదు. బహుశా రెండు పార్టు కోసం ఈ సీక్రెట్ రివీల్ చేయలేదమేమో. 

బాహుబలి సినిమాలో బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే సస్పెన్స్ తరహాలో ఐశ్వర్య రాయ్ పాత్రను పొన్నియన్ సెల్వన్‌లో  చూపించారు మణిరత్నం. బహుశా ఫస్ట్ పార్ట్ చూసిన ప్రేక్షకులకు రెండో పార్ట్ చూడాలనుకునే  ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడంలో మణి రత్నం  సక్సెస్ అయ్యారనే చెప్పాలి. మణి రత్నం ఈ సినిమాను యావరేజ్ వార్ డ్రామాగా నిలిపారు.  ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ .. ఈ సినిమాను ఇంకాస్త ట్రిమ్ చేసుంటే బాగుండేది. ఫోటోగ్రఫీ ఈ సినిమాకు ప్రాణంలా నిలిచింది. ప్రతి సన్నివేశాలన్ని తన కెమెరాలో అద్భుతంగా బంధించాడు.  చాలా రోజుల తర్వాత తనికెళ్ల భరణి ఈ సినిమాకు మాటలు అందించారు. విజువల్ ఎఫెక్ట్ బాగున్నాయి. ఏ.ఆర్. రెహమాన్ ఈ సినిమాకు అందించిన సంగీతం బాగుంది. ముఖ్యంగా రీ రికార్డింగ్‌తో ఈ సినిమాకు ప్రాణం పోసాడు. 

నటీనటుల విషయానికొస్తే.. 

విక్రమ్ సుందర చోళుడు పెద్ద కుమారుడు ఆదిత్య కరికాలుడు పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. సినిమా ప్రారంభంలో ఒక యుద్ధ సన్నివేశంలో శత్రువులను జయించి తీరు.. ఆకట్టుకుంటుంది. సినిమాలో ఈయన నిడివి తక్కువగా ఉంది. బహుశా రెండో పార్టులో ఈ పాత్ర నిడివి ఎక్కువగా ఉండే అవకాశం ఉందేమ.  మరోవైపు కార్తి  ఆదిత్య కరికాలన్‌కు అత్యంత నమ్మకస్తుడైన స్నేహితుడు వల్లవరాయన్ పాత్రలో అద్భుతంగా నటించారు. సినిమా మొత్తం తన భుజాలపైనే మోసాడు. సినిమాలో మెయిన్ లీడ్ ఇతనిదే. ఇక  సుందర చోళుడు రెండు కుమారుడు అరుళ్ మోళి వర్మన్ పాత్రలో జయం రవి నటన ఆకట్టుకుంది. దేశ ప్రజలు ఇతన్ని పొన్నియన్ సెల్వన్‌గా పిలుస్తుంటారు. మరోవైపు రాజ నందిని పాత్రలో ఐశ్వర్య రాయ్ అద్భుతంగా ఒదిగిపోయింది. సినిమాలో మెయిన్ పిల్లర్ ఈమె. సినిమా మొత్తం రెండో భాగం కొనసాగింపులో ఈమె పాత్రే కీలకం. త్రిష కుందవై సుగుణవతి పాత్రలో ఒదిగిపోయింది. శత్రువుల ఎత్తులను చిత్తులు చేసే పాత్రలో తనదైన నటన కనబరిచింది. ఇక చోళ సామ్రాజ్యపు కోశాధికారి.. సుందర చోళుడిని రాజుగా పదవీచ్యుడిని చేసి అతని అన్న కుమారుడిని రాజుగా చేయాలనుకునే పాత్రలో శరత్ కుమార్ విలనిజం బాగుంది. ఇక చోళ సామ్రాజ్యనేత సుందరచోళుడిగా ప్రకాష్ రాజ్ నటన గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. మలయాళ నటుడు జయరామ్ ఈ సినిమాలో చోళ సామ్రాజ్యపు గూఢచారి పాత్రలో నటించారు. చోళ సామ్రాజ్యపు ప్రధాన మంత్రి అనిరుద్ధ బ్రహ్మయ్యర్ కోసం పని చేస్తుంటారు. మిగతా పాత్రల్లో నటించిన నటీనటుల తమ పరిధి మేరకు నటించారు.

ప్లస్ పాయింట్స్ 

కార్తి, ఐశ్వర్య రాయ్‌ల  నటన

విజువల్ ఎఫెక్ట్స్

ఫోటోగ్రఫీ,

మ్యూజిక్

మైనస్ పాయింట్స్ 

స్లోగా సాగే నేరేషన్

స్క్రీన్ ప్లే

సినిమా నిడివి

చివరి మాట : పొన్నియన్ సెల్వన్.. మణి రత్నం మార్క్ యావరేజ్ వార్ డ్రామా..

రేటింగ్ :3/5

Published by:Kiran Kumar Thanjavur
First published:

రేటింగ్

కథ:
3/5
స్క్రీన్ ప్లే:
3/5
దర్శకత్వం:
3/5
సంగీతం:
3/5

Tags: Aishwarya Rai Bachchan, Chiyan Vikram, Jayam Ravi, Karthi, Ponniyin Selvan, Ponniyin Selvan -1 Movie Review, PS-1, Tollywood, Trisha

ఉత్తమ కథలు