నాని గ్యాంగ్ లీడర్ టీజర్ విడుదలైంది. మెగాస్టార్ చిరంజీవి టైటిల్ తీసుకోవడం రిస్క్ అని తెలిసినా కూడా తీసుకున్నాడు నాని. జెర్సీ లాంటి సినిమా తర్వాత ఈయన చేస్తున్న సినిమా ఇది. ఇందులో నాని ఐదుగురు ఆడవాళ్లతో కలిసి కనిపిస్తున్నాడు. 8 ఏళ్ల చిన్న పాప.. 17 ఏళ్ల టీనేజ్ అమ్మాయి.. 22 ఏళ్ల కత్తి లాంటి అమ్మాయి.. 50 ఏళ్ల అమ్మ వయసు ఉన్న మహిళ.. కాటికి కాలు చాపుకున్న బామ్మ.. ఈ ఐదుగురు గ్యాంగ్ కు ఓ లీడర్.. అతడే మన గ్యాంగ్ లీడర్. ఈ ఐదుగురు లైఫ్ సైకిల్ గ్యాంగ్ లీడర్ కథ. మరోసారి విక్రమ్ కే కుమార్ తన మార్క్ స్క్రీన్ ప్లేతో సిద్ధమైపోయాడు.
ఇప్పుడు ఈ చిత్ర టీజర్ చూసిన తర్వాత సినిమా ఎలా ఉండబోతుందో అర్థమైపోతుంది. ఇప్పటి వరకు ఎమోషనల్ ఎంటర్ టైనర్స్ చేసాడు విక్రమ్ కే కుమార్. కానీ ఇప్పుడు మాత్రం ఈయన కామెడీ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. నాని ఇమేజ్‌కు సరిపోయేలా ఈ కథ రాసుకున్నాడు ఈయన. టీజర్లో ఐదుగురు ఆడవాళ్లతో నాని ఉన్న తీరు అద్భుతంగా ఉంది. వాళ్లందర్నీ చూస్తుంటే లైఫ్ సైకిల్ చూసినట్లుంది అంటూ కామెడీ డైలాగులు కూడా అదరగొట్టాడు నేచురల్ స్టార్. నా గ్యాంగ్.. విక్రమ్ కథ.. అనిరుధ్ మ్యూజిక్.. మైత్రి డబ్బు.. మన సినిమా.. మీ ఎంటర్ టైన్మెంట్ అంటూ ట్వీట్ చేసాడు నాని.
నా Gang
— Nani (@NameisNani) July 24, 2019
Vikram కధ
Anirudh సౌండ్
Mythri డబ్బు
మన Cinema
మీ ENTERTAINMENT #GangLeaderTeaser is here 🖐🏼👊🏼https://t.co/jgG8E78LYj@Vikram_K_Kumar @MythriOfficial @anirudhofficial @ActorKartikeya @priyankaamohan
బామ్మ, స్వాతి, ప్రియ, వరలక్ష్మి, చిన్ను మధ్య జరిగే కథ ఇది. ట్విట్టర్లో ఈ టీజర్ విడుదల చేసాడు నాని. చిరంజీవి ఆల్ టైమ్ క్లాసిక్ టైటిల్ తీసుకున్నా కూడా కథపై ఉన్న నమ్మకంతో గౌరవం పెంచేస్తామంటున్నాడు విక్రమ్ కే కుమార్. ఇందులో ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. జెర్సీ తర్వాత మరోసారి నాని సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. సినిమా విడుదల తేదీ త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు. ఆగస్ట్ 30 అనుకున్నా కూడా ఆ రోజు సాహో రానుండటంతో ఇప్పుడు నాని కొత్త డేట్ చూసుకుంటున్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Gang Leader, Nani, RX 100 Fame Karthikeya, Telugu Cinema, Tollywood, Vikram K Kumar