Home /News /movies /

VIKRAM GOUD MOVIE SPECIAL POSTER ON THE OCCUATION OF KIRAN RAJ BIRTHDAY SLB

Kiran Raj: విక్రమ్ గౌడ్ స్పెషల్ పోస్టర్ రిలీజ్.. రగ్డ్ లుక్‌లో హీరో కిరణ్ రాజ్

Photo Twitter

Photo Twitter

Kiran Raj Birthday: డిఫరెంట్ కాన్సెప్ట్‌తో నేటితరం ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యేలా ‘విక్రమ్ గౌడ్’ అనే మూవీ రూపొందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసి ఆకట్టుకున్నారు మేకర్స్.

కన్నడ నటుడు కిరణ్ రాజ్ ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతోన్నారు. కన్నడలో రీసెంట్‌గా వచ్చిన ‘బడ్డీస్’ సినిమాతో కిరణ్ రాజ్ (Kiran Raj) హీరోగా మంచి విజయాన్ని అందుకున్నారు. ఇక ఇప్పుడు ‘విక్రమ్ గౌడ్’ (Vikram Goud) అంటూ కిరణ్ రాజ్ తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించేందుకు రెడీ అవుతున్నారు. కుమారి సాయి ప్రియ సమర్పణలో మహేశ్వర పిక్చర్స్ బ్యానర్‌పై కణిదరపు రాజేష్, పి. ఉషారాణి నిర్మిస్తున్న ఈ చిత్రానికి పాశం నరసింహారావు దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, కన్నడ భాషలలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కిరణ్ రాజ్‌కు జంటగా దీపికా సింగ్ (Deepika Singh) నటిస్తోంది.

డిఫరెంట్ కాన్సెప్ట్‌తో నేటితరం ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యేలా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. కిరణ్ రాజ్ పుట్టిన రోజు (జూలై 5) సందర్భంగా ‘విక్రమ్ గౌడ్’ నుంచి ఓ కొత్త పోస్టర్‌ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్‌లో రగ్డ్ లుక్‌లో కిరణ్ రాజ్ కనిపించారు. ప్రస్తుతం ఈ పోస్టర్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల చేసిన టీజర్, పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. తాజాగా విడుదల చేసిన ఈ పోస్టర్ సినిమాపై ఆసక్తి పెంచిందని చెప్పుకోవాలి.

పోసాని కృష్ణమురళీ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రానికి లొట్టిపలి రామకృష్ణ సహ నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. పామరాజు జానకి రామారావు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు చేపట్టారు. మంత్ర ఆనంద్ సంగీతాన్ని అందిస్తుండగా.. రాఘవేంద్ర బి కోలారి కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఎడిటర్‌గా జె.పి. పని చేస్తున్నారు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం చివరి షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కానుందని చిత్రయూనిట్ తెలిపింది. అతిత్వరలో ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు మేకర్స్.
Published by:Sunil Boddula
First published:

Tags: Sandalwood, Tollywood, Tollywood actor

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు