Home /News /movies /

VIKRAM ACTOR KAMAL HAASAN COMMENTS ON CINEMA THEATRES GOES VIRAL SR

Kamal Haasan | Vikram : గుడి కంటే సినిమా థియేటర్ గొప్పది.. జాతి, మతం పట్టింపులు ఉండవు : కమల్ హాసన్..

Kamal Haasan Photo : Twitter

Kamal Haasan Photo : Twitter

Kamal Haasan | Vikram : కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ సినిమా విక్రమ్ జూన్ 3న విడుదలకానుంది. దీంతో ప్రమోషన్స్‌లో భాగంగా కమల్ హాసన్ తాజాగా కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇంకా చదవండి ...
    Kamal Haasan | Vikram | విశ్వనటుడు కమల్ హాసన్ (Kamal Haasan) ఓ వైపు రాజకీయాలు చేస్తూనే మరోవైపు సినిమాలను చేస్తోన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఆయన ప్రస్తుతం (Vikram) ‘విక్రమ్’ అనే సినిమా చేసారు. ఈ సినిమాకు (Lokesh kanagaraj) లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. విజయ్ సేతుపతి (Vijay Sethupathi), ఫహద్ ఫాసిల్ (Fahadh Faasil) నటించారు. ఇక ఈ సినిమాలో మరో తమిళ సూర్య (Suriya) గెస్ట్‌ రోల్‌లో కనిపించనున్నారు. ఈ సినిమా జూన్ 3న విడుదలకానుంది. దీంతో ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఓ పాట విడుదలై మంచి రెస్పాన్స్‌ తెచ్చుకుంది.  ఈ సినిమాలో ఉన్న ముగ్గురు హీరోల లుక్స్‌, నటన అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. ట్రైలర్‌ను చూస్తుంటే.. ఈ సినిమాలో కమల్‌హాసన్‌ 'రా' ఏజెంట్‌గా కనిపించనున్నట్టు తెలుస్తోంది. రీసెంట్‌గా విడుదలైన ఈ మూవీ తెలుగు ట్రైలర్‌ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా తెలుగు రైట్స్‌ను యువ నితిన్ స్వంత నిర్మాణ సంస్థ శ్రేష్ఠ్ మూవీస్ దక్కించుకుంది.

    ఇక అది అలా ఉంటే ప్రమోషన్స్‌లో భాగంగా కమల్ హాసన్ మాట్లాడుతూ తాజాగా కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆయన సినిమాల గురించి మాట్లాడుతూ.. థియేటర్ అనేది గుడి కంటే గొప్ప చోటని భావిస్తా. పక్కనున్నవాడు ఏ జాతి,మతం అనే పట్టింపు ఎవరికీ వుండదు.ఇది కేవలం స్పోర్ట్స్, సినిమా థియేటర్‌లలోనే సంభవిస్తుంది. ఎన్ని మార్పులు వచ్చినా దేని ప్రాధన్యత దానికి వుంటుంది. Vikram సినిమాను థియేటర్లలో చూసి ఆదరిస్తారు అని ఆశిస్తున్నానంటూ పేర్కోన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక విక్రమ్ విషయానికి వస్తే.. ఈ చిత్రానికి సంగీతం అనిరుధ్ రవిచందర్, సినిమాటోగ్రఫీ గిరీష్ గంగాధరన్, ఎడిటింగ్ ఫిలోమిన్ రాజ్  చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు బుక్ మై షోలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఈ సినిమాను 2 మిలియన్స్ పైగా ఇంట్రెస్ట్‌ నమోదు కావడం సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. మొత్తంగా నేషనల్ వైడ్‌గా ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు ఉన్నాయో తెలుస్తోంది.



    ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీగా రిలీజ్ అవుతుందట. తమిళ, తెలుగు, హిందీ ఇలా అన్ని భాషల్లో అన్ని ఏరియాల్లో కలిపి దాదాపు 5000 వేల కి పైగానే స్క్రీన్ లలో రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే.. తెలంగాణ (నైజాం) : రూ. 2.80 కోట్లు..   రాయలసీమ (సీడెడ్) - రూ. 1.55 కోట్లు, ఆంధ్ర - రూ. 3.65 కోట్లు,  ఆంధ్ర ప్రదేశ్ + తెలంగాణ : రూ. 8 కోట్లు. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ కావాలంటే.. రూ. 8.50 కోట్లు రాబట్టాలి.

    Kamal Haasan lokesh kanagaraj Vikram, Vikram censor completed, Vikram Telugu Trailer released, Vikram theatrical trailer released, Kamal Haasan Vikram release date, Kamal Haasan lokesh kanagaraj Vikram telugu rights, Kamal Haasan lokesh kanagaraj Vikram first look, kamal haasan film,Lokesh Kanagaraj, fahad fasil , vijay sethupathi ,rajinikanth kamal haasan film update, kamal hassan news, lokesh kanak raj films,rajinikanth films, రజనీకాంత్, కమల్ హాసన్, టాలీవుడ్ న్యూస్
    కమల్ హాసన్ ‘విక్రమ్’ (Twitter/Photo)


    ఇక  ఈ సినిమా రన్ టైమ్ 2 గంటల 53 నిమిషాలు ఉంది.కమల్ హాసన్ (Kamal Haasan) హీరోగా 2002 లో వచ్చిన ‘పంచతంత్రం’ హిట్ అయ్యింది. ఇక ఆ తర్వాత వచ్చిన ‘దశావతారం’ ‘విశ్వరూపం' యావరేజ్ టాక్ తెచ్చుకోగా.. ఆ తర్వాత వచ్చిన ‘ఈనాడు’ ‘చీకటి రాజ్యం’ ఉత్తమ విలన్ వంటి సినిమాలు తెలుగులో అనుకున్నంతగా అలరించలేదు.  కానీ ఈ సినిమాకు మాత్రం మంచి బజ్ వచ్చింది. దీనికి ఈ సినిమా దర్శకుడు కూడా ఓ కారణం అయ్యి ఉండోచ్చు. లోకేష్ (lokesh kanagaraj) దర్శకత్వంలో వచ్చిన ‘ఖైదీ’ ‘మాస్టర్’ వంటి చిత్రాలు తెలుగులో మంచి విజయాలను సాధించాయి. బయ్యర్లకు లాభాలను కూడా అందించాయి. ఇక మరో కారణం (Vikram) ‘విక్రమ్’ మూవీలో విజయ్ సేతుపతి, పహాద్ ఫాజిల్ నటించడం కూడా కలిసి వచ్చింది.



    ఈ సినిమా పొలిటికల్ థ్రిల్లర్ గా ఉండబోతోందని తెలుస్తోంది. విక్రమ్ సినిమా కమలహాసన్ నటించే 232వ చిత్రంగా వస్తోంది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందే ఈ చిత్రాన్ని కమల్‌కు చెందిన రాజ్‌కమల్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇది ఆ బ్యానర్‌లో వచ్చే 50వ సినిమా.  ఈ  చిత్రంలో నరేన్, చెంబన్ వినోద్, కాళిదాస్ జయరామ్, గాయత్రి కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్, ఆర్ మహేందర్ విక్రమ్ భారీ ఎత్తున నిర్మించారు.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Kamal haasan, Tollywood news, Vikram Movie

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు