హోమ్ /వార్తలు /సినిమా /

Vikram 6 Days WW Collections : కమల్ హాసన్ ‘విక్రమ్’ 6 డేస్ వాల్డ్ వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్స్..

Vikram 6 Days WW Collections : కమల్ హాసన్ ‘విక్రమ్’ 6 డేస్ వాల్డ్ వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్స్..

విక్రమ్ 6 డేస్ కలెక్షన్స్  (Photo Twitter)

విక్రమ్ 6 డేస్ కలెక్షన్స్ (Photo Twitter)

Vikram 6 Days WW Collections : కమల్ హాసన్ హీరోగా నటించగా.. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘విక్రమ్’. ఈ సినిమా ఫస్ట్ డే సూపర్ హిట్ టాక్‌ సొంతం చేసుకుంది. అంతేకాదు టాక్‌కు తగ్గట్టు ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే రాబడుతోంది. బాక్సాఫీస్ దగ్గర 6వ రోజు ఈ సినిమా ఏ మేరకు రాబట్టిందంటే..

ఇంకా చదవండి ...

Vikram 6 Days Box Office Collections  : యూనివర్సల్ హీరో  కమల్ హాసన్ (Kamal Haasan) ఓ వైపు రాజకీయాలు.. మరోవైపు సినిమాలను చక్కగా బ్యాలన్ చేస్తున్నారు.  ఇందులో భాగంగా  ఆయన గత శుక్రవారం (Vikram) ‘విక్రమ్’ అనే సినిమాతో పలకరించారు. ఈ సినిమా బాక్సాఫీష్ దగ్గర సూపర్ హిట్ టాక్‌ సొంతం చేసుకుంది. అందుకు తగ్గట్టు బాక్సాఫీస్ దగ్గర రఫ్పాడిస్తోంది. ఒక్క తమిళంలోనే కాదు.. తెలుగులో కూడా డీసెంట్ వసూళ్లను రాబట్టి.. ఇక్కడ బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది.  విక్రమ్ హిట్  సందర్భంగా తెలుగు ప్రేక్షకులకు కమల్ హాసన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ సినిమాకు (Lokesh kanagaraj) లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. విజయ్ సేతుపతి (Vijay Sethupathi), ఫహద్ ఫాసిల్ (Fahadh Faasil) నటించారు. ఇక ఈ సినిమాలో మరో తమిళ సూర్య గెస్ట్‌ రోల్‌లో అదగొట్టేసారు. ఇక ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 6 రోజుల్లో బాక్సాఫీస్ కలెక్షన్స్ విషయానికొస్తే..

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ. 1.05 కోట్లు రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి రూ.  8.60 కోట్ల షేర్ (రూ. 17.40 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టి బాక్సాఫీస్ దగ్గర స్ట్రాంగ్‌గా ఉంది.

ఇక ఈ సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే.. ఈ సినిమా మొదటి రోజు సెన్సేషనల్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంది. విక్రమ్ తొలిరోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 3.70 కోట్ల గ్రాస్‌ను 1.96 షేర్‌ను సొంతం చేసుకుందని ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి.  మొదటి రోజు విక్రమ్ ప్రపంచవ్యాప్తంగా సుమారుగా రూ. 50. 75 కోట్ల గ్రాస్‌ను అందుకున్నాయి.   ఇక ఈ సినిమా తెలుగు రైట్స్‌ను యువ నితిన్ స్వంత నిర్మాణ సంస్థ శ్రేష్ఠ్ మూవీస్ దక్కించుకుంది. ఇక అది అలా ఉంటే ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ గురించి అప్పుడే ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను హాట్ స్టార్ భారీ ధరకు దక్కించుకుందని తెలుస్తోంది. హాట్ స్టార్ తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషలకు చెందిన ఓటీటీ రైట్స్‌ను దక్కించుకుందని తెలుస్తోంది.

Nayanthara Wedding : నయనతార, నమ్రత సహా తమ కంటే తక్కువ వయసు వాళ్లను పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..

విక్రమ్ 6 రోజుల తెలుగు రాష్ట్రాల బాక్సాఫీస్ కలెక్షన్స్ విషయానికొస్తే..

Nizam: రూ. 4.26 కోట్లు

Ceeded: 1.35 కోట్లు

UA: 1.46 కోట్లు

East: రూ. 80L

West: రూ. 54L

Guntur: రూ.  70 L

Krishna: రూ. 73L

Nellore: రూ. 39L

AP-TG Total : రూ. 10.23 కోట్లు (18.46 కోట్లు గ్రాస్)

ఇక ఈ సినిమా తెలుగు రాష్ట్రాల బిజినెస్ ముందుగా రూ. 8 కోట్ల రేంజ్‌లో జరిగింది. ఆ తర్వాత రూ. కోటి తగ్గించి రూ. 7 కోట్లకు అమ్మారు.  ఓవరాల్‌గా రూ. 7.50 కోట్ల రేంజ్ టార్గెట్‌తో బరిలోకి దిగింది. తాజాగా ఆరు రోజుల్లో రూ. 2.73 కోట్ల లాభాలను తీసుకొచ్చింది.

విక్రమ్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్

Tamilnadu –రూ. 87.80 కోట్లు గ్రాస్

Telugu States- రూ. 18.46 కోట్లు గ్రాస్

Karnataka- రూ. 15.80 కోట్లు గ్రాస్

Kerala – రూ. 22.40 కోట్లు గ్రాస్

ROI – రూ. 4.10  కోట్లు గ్రాస్

Overseas – రూ. 78.15 కోట్లు గ్రాస్

Total WW collection – రూ. 226.71 CR గ్రాస్ కలెక్షన్స్.. (రూ. 114.10 కోట్ల షేర్) రాబట్టింది.

Day 1 WW Share  –రూ. 31.20 కోట్ల షేర్ (61.13 కోట్ల గ్రాస్ )

Day 2 WW Share - రూ. 19.60 కోట్ల షేర్ (రూ. 39.13 కోట్ల గ్రాస్)

Day 3 WW Share- రూ. 30.15 కోట్లు షేర్ (రూ. 60.02 కోట్ల గ్రాస్)

Day 4 WW Share– రూ. 14.10 కోట్లు షేర్ ( రూ. 28.23 కోట్ల గ్రాస్)

Day 5 WW ShareI – రూ. 10.45  కోట్లు గ్రాస్ (రూ. 20.80 కోట్ల గ్రాస్)

Day  WW ShareI – రూ. 8.60  కోట్లు గ్రాస్ (రూ. 17.40 కోట్ల గ్రాస్)

ప్రపంచ వ్యాప్తంగా విక్రమ్ మూవీ రూ. 100 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా ఇప్పటికే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది.

Nayanthara Wedding :భర్త విఘ్నేష్‌కు నయనతార ఇచ్చిన కట్న కానుకలు ఏంటో తెలుసా..


ఇక్కడ విశేషమేమంటే.. కమల్ హాసన్ తెలుగులో హిట్టు సినిమాలు లేక పది యేళ్లు  దాటింది. ఇక  ఈ సినిమా రన్ టైమ్ 2 గంటల 53 నిమిషాలు ఉంది.కమల్ హాసన్ (Kamal Haasan) హీరోగా 2002 లో వచ్చిన ‘పంచతంత్రం’ హిట్ అయ్యింది. ఇక ఆ తర్వాత వచ్చిన ‘దశావతారం’ ‘విశ్వరూపం' యావరేజ్ టాక్ తెచ్చుకోగా.. ఆ తర్వాత వచ్చిన ‘ఈనాడు’ ‘చీకటి రాజ్యం’ ఉత్తమ విలన్ వంటి సినిమాలు అనుకున్నంతగా అలరించలేదు. తాజాగా ‘విక్రమ్’ సినిమాతో అటు తమిళంతో పాటు తెలుగులో కూడా సాలిడ్ హిట్‌తో కమ్ బ్యాక్ అయ్యారు కమల్ హాసన్. మొత్తంగా కంటెంట్ బాగుంటే  సినిమా ఆదిరిస్తారనే దానికీ విక్రమ్ సూపర్ హిట్టే మరో నిదర్శనం. మొత్తంగా లోకేష్ కనగారాజ్.. తమిళంలో పాటు తెలుగులో వరుసగా ‘ఖైదీ’, ‘మాస్టర్’, విక్రమ్ సినిమాలతో హాట్రిక్ హిట్స్ అందుకోవడం విశేషం. ఈ సినిమా సక్సెస్ కావడంతో కమల్ హాసన్.. దర్శకుడు లోకేష్ కనగరాజ్‌కు కారును బహుమతిగా ఇచ్చారు. ఈ సినిమాలో అడిగిందే తడువుగా అతిథి పాత్ర చేసిన సూర్య కూడా అదిరిపోయే గిప్ట్ ఇచ్చాడు.

First published:

Tags: Kamal haasan, Lokesh Kanagaraj, Tollywood, Vikram

ఉత్తమ కథలు