పేరు మార్చుకుని మరీ వస్తోన్న తమిళ అర్జున్ రెడ్డి..ఈ సారి ఏ పేరంటే...

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘అర్జున్ రెడ్డి’ సినిమా ఎంత పెద్ద హిట్టైయిందే తెలిసిందే కదా. మరోవైపు తమిళంలో ఈ సినిమాను విక్రమ్ కొడుకు థృవ్ విక్రమ్ హీరోగా పరిచయం చేస్తూ రీమేక్ చేసిన సంగతి తెలిసిందే కదా.మొదట బాలా దర్శకత్వంలో ‘వర్మ’ టైటిల్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమాకు కొత్త టైటిల్‌తోొ న్యూ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: February 20, 2019, 9:23 AM IST
పేరు మార్చుకుని మరీ వస్తోన్న తమిళ అర్జున్ రెడ్డి..ఈ సారి ఏ పేరంటే...
ఆదిత్య వర్మగా వస్తోన్న విజయ్ దేవరకొండ
  • Share this:
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘అర్జున్ రెడ్డి’ సినిమా ఎంత పెద్ద హిట్టైయిందే తెలిసిందే కదా. ఈ సినిమాను అన్ని భాషల వాళ్లు రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాను హిందీలో షాహిద్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో ‘కబీర్ సింగ్’ టైటిల్‌తో తెరకెక్కుతోంది.

మరోవైపు తమిళంలో ఈ సినిమాను విక్రమ్ కొడుకు థృవ్ విక్రమ్ హీరోగా పరిచయం చేస్తూ రీమేక్ చేసిన సంగతి తెలిసిందే కదా.మొదట బాలా దర్శకత్వంలో ‘వర్మ’ టైటిల్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఐతే ఫైనల్ ఔట్‌పుట్ మంచిగా రాకపోవడంతో ..దర్శకుడు బాలాను పక్కకు తప్పించి మొత్తం సినిమాను మళ్లీ రీషూట్ చేయాలని ఫిక్స్ అయ్యారు.

రీ షూట్ చేయబోయే సినిమాకు ‘ఆదిత్య వర్మ’ అనే టైటిల్ ఫైనల్ చేసారు. ఈ చిత్రాన్ని గిరీశయ్య దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఈ సినిమాలో ధృవ్ సరసన బనితా సంధు హీరోయిన్‌గా ఫైనల్ అయింది. తొందర్లనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుంది. ఇ4 ఎంటర్టైన్మెంట్ వాళ్లు హీరో ధృవ్ తప్పించి..మిగతా ఆర్టిస్టులను, టెక్నీషియన్స్‌ను అందరనీ మార్చేసి మళ్లీ రీ షూట్‌కు  వెళుతున్నారు.

మరోవైపు ఈ చిత్రాన్ని ముందుగా డైరెక్ట్ చేసిన బాలా మాత్రం ఈ సినిమా నుంచి తానే స్వచ్చందంగా తానే తప్పుకున్నట్లు వెల్లడించారు. ఈ విషయమైన తాను మాట్లాడితే ధృవ్ కెరీర్‌పై ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. అందుకే ఈ వివాదాన్ని ఇంతటితో ముగించాలనుకుంటున్నాను అంటూ దర్శకుడు బాలా తన హుందాతనాన్ని చాటుకున్నాడు.

పూజా హెగ్డే లేటెస్ట్ ఫోటోస్


ఇవి కూడా చదవండి ఎన్టీఆర్ బయోపిక్ పై వర్మ సంచలనం.. భజన చేస్తే బయోపిక్ చూడరు..

’లక్ష్మీస్ వీరగ్రంథం‘లో లక్ష్మీపార్వతిగా శ్రీరెడ్డి?

ఎన్టీఆర్ మహానాయకుడు ట్రైలర్ పై ఆ రాజకీయ పార్టీ అసహనం..
First published: February 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading