రివ్యూ : బీస్ట్
నటీనటులు : విజయ్, పూజా హెగ్డే, యోగి బాబు, సెల్వ రాఘవన్
సంగీతం : అనిరుధ్ రవిచంద్రన్
సినిమాటోగ్రఫీ : మనోజ్ పరమహంస
ఎడిటర్: ఆర్.నిర్మల్
నిర్మాతలు : సన్ పిక్చర్స్
కథ, దర్శకత్వం : నెల్సన్ దిలీప్ కుమార్
తమిళ స్టార్ హీరో విజయ్ (Vijay) గత కొన్నేళ్లుగా తెలుగు మార్కెట్ పై పట్టు సాధిస్తున్నారు. ఇక్కడ వరుస విజయాలతో దూకుడు మీదున్నారు. గతేడాది ‘మాస్టర్’ మూవీతో తెలుగులో సూపర్ హిట్ అందుకున్న ఈయన.. ఇప్పుడు నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilipkumar) దర్శకత్వంలో ‘బీస్ట్’ అనే మూవీ చేసారు. ఈయన గతేడాది ‘వరుణ్ డాక్టర్’ అనే కామెడీ థ్రిల్లర్‌తో అలరించారు. తాజాగా ఈయన దర్శకత్వంలో విజయ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా రివ్యూ ఎలా ఉందో ఓ సారి చూద్దాం..
కథ
వీరరాఘవన్ (విజయ్) భారత గూఢచార సంస్థ అయిన RAW (Reserch and Analylis Wing) లో సీక్రెట్ ఏజెంట్. ఈ నేపథ్యంలో ఉమర్ ఫరూక్ అనే టెర్రరిస్ట్ లీడర్‌ను పట్టుకునే ఆపరేషన్ కు నాయకత్వం వహిస్తారు. ఈ క్రమంలో ఓ చిన్న అమ్మాయి కన్నుమూస్తోంది. తన వల్లే ఈ ఆపరేషన్‌లో చిన్న అమ్మాయి మరణించిందనే ఆవేదనతో ‘రా’ కు రాజీనామా చేస్తాడు. ఈ క్రమంలో వీరరాఘవకు ప్రీతి (పూజా హెగ్డే) పరిచయమవుతోంది. ఈ క్రమంలో వీర రాఘవ ప్రభుత్వానికి పట్టించిన ఉమర్ ఫరూక్‌ను విడిపించకోవడానికి ఆయన అనుచరులైన కొంత మంది టెర్రరిస్టులు ఓ మాల్‌ను హైజాక్ చేస్తారు. ఆ మాల్‌లో అనుకోకుండా ’రా’ కు రాజీనామా చేసిన వీర రాఘవ ఉంటాడు. ఈ క్రమంలో మాల్‌లో అమాయకులైన ప్రజలను మాజీ గూఢచారి అయిన వీరరాఘవ ఎలా సేవ్ చేసాడు ..? ఈ క్రమంలో టెర్రిరిస్టులకు హీరోకు మధ్య ఎలాంటి యుద్ధం జరిగింది. చివరకు హీరో ఉగ్రవాదులపై ఎలా పై చేయి సాధించి ప్రజలను దేశపు ఔనత్యాన్ని ఎలా కాపాడాడు అనేదే ఈ సినిమా స్టోరీ.
కథనం..
ఒక గూఢచారి కథ అనుకున్నపుడు అందకు తగ్గ సన్నివేశాలతో పాటు ప్రాంతం కూడా కీ రోొల్ ప్లే చేస్తోంది. జైల్లో ఉన్న టెర్రరిస్టు లీడర్‌ను విడిపించుకోవడానికి ఆయన అనుచరులు ఎక్కడ లేనట్టు చెన్నైకి వచ్చిన ఓ మాల్‌ను హైజాక్ చేయడం వంటివి లాజికల్‌గా లేవు. ఏదైనా పంజాబ్ లేదా దేశ సరిహద్దు ప్రాంతానికి సంబంధించిన ప్రదేశం అయితే.. కరెక్ట్‌గా ఉండేది. విజయ్ వంటి స్టార్ హీరో సినిమా అంటే అంచనాల కంటే లెక్కలు ఎక్కువగా ఉంటాయి..ఆ లెక్కలు మ్యాచ్ అయితేనే అంచనాలు నిలబడతాయి. బీస్ట్ విషయంలో ఈ కథ, కథనంతో పాటు ప్రాంతీయ నేపథ్యం కూడా బ్యాలెన్స్ తప్పాయనే చెప్పాలి.సినిమా బాగుంది.. నవ్వుకోవడానికి పర్లేదు అనిపిస్తుంది. కానీ విజయ్ లాంటి సూపర్ స్టార్ ముందు కథ తేలిపోయింది.డాక్టర్ సినిమా తరహాలోనే.. బీస్ట్ కూడా డార్క్ కామెడీ చుట్టూ తిరుగుతుంది..
సీరియస్ కథను తీసుకున్న దర్శకుడు.. దాన్ని తెరకెక్కించే విధానం అంతగా కనెక్ట్ కాదు.
విజయ్ లాంటి స్టార్ ఉండడంతో అంచనాలు పెరిగిపోయాయి..కథతో దాన్ని బ్యాలెన్స్ చేయడంలో తడబడ్డాడు నెల్సన్ దిలీప్ కుమార్. ఫస్టాఫ్ అక్కడక్కడా వచ్చే సన్నివేశాలు నవ్విస్తాయి..సెకండాఫ్ అయితే డల్ అయ్యింది.. క్లైమాక్స్ మరీ సింపుల్ గా తేల్చేశాడు..విజయ్ ఇమేజ్ ఈ సినిమాకు శాపం.. అతన్ని ఇంత చిన్న కథలో ఊహించుకోవడం కష్టమైపోతోంది.డార్క్ కామెడీ బాగుంది.. కొన్ని యాక్షన్ సీక్వెన్స్ లు అదిరిపోయాయి..అన్నీ బాగానే ఉన్నాయి అనిపించినా ఓవరాల్ సినిమా వర్కవుట్ అవ్వలేదు..విజయ్ ఇరగదీశాడు.. స్టైలిష్ యాక్షన్ తో అదరగొట్టాడు. పూజా హెగ్డే న్యాచురల్ గా ఉంది. యోగి బాబు అండ్ బ్యాచ్ కామెడీ పర్లేదు .నెల్సన్ రైటింగ్ బాగుంది కానీ దర్శకుడుగా మాత్రం ఆకట్టుకోలేదు. అనిరుద్ మ్యూజిక్ ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్.
ప్లస్ పాయింట్స్
విజయ్ నటన
యాక్షన్ సీక్వెన్స్
యోగి బాబు కామెడీ
మైనస్ పాయింట్స్
రెగ్యులర్ కథ, కథనం
లాజిక్ లేని సన్నివేశాలు
ప్రాధాన్యత లేని హీరోయిన్ పాత్ర
రేటింగ్ : 2.5/5
చివరి మాట : రొటీన్ యాక్షన్ కామెడీ డ్రామా
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Beast Movie, Tollywood, Vijay