Vijayendra Prasad: స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్‌కు తనయుడు రాజమౌళి కంటే ఆ డైరెక్టర్ అంటే ఎక్కువ ఇష్టమట..

విజయేంద్ర ప్రసాద్ (Twitter/Photo)

Vijayendra Prasad: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా దర్శకుడిగా రాజమౌళి ఎంత ఫేమసే.. ఆయన సినిమాలకు కథలను సమకూరుస్తూ.. రచయతగా అంతే పాపులర్ అయ్యారు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్.

 • Share this:
  Vijayendra Prasad: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా దర్శకుడిగా రాజమౌళి ఎంత ఫేమసే.. ఆయన సినిమాలకు కథలను సమకూరుస్తూ.. రచయతగా అంతే పాపులర్ అయ్యారు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్. ప్యాన్ ఇండియా హీరోలు, ప్యాన్ ఇండియా దర్శకులతో సమానంగా ప్యాన్ ఇండియా రచయతగా విజయేంద్ర ప్రసాద్ కథల కోసం టాలీవుడ్ నుంచి మొదలు పెడితే.. బాలీవుడ్ బడా హీరోలు, నిర్మాణ సంస్థలు ఎదురు చూసేలా చేస్తున్నారు.  ఇప్పటికే ఈయన ఇచ్చిన కథలతోనే  హిందీలో ‘భజరంగీ భాయిజాన్’, మణికర్ణిక’ వంటి సినిమాలు సూపర్ హిట్టైయ్యాయి. అంతేకాదు ప్రస్తుతం బాలీవుడ్‌లో సెట్స్ పైన ఉన్న పలు సినిమాలతో పాటు ‘సీత’ సనిమాకు కథను అందించారు విజయేంద్ర ప్రసాద్.

  ఇపుడు తన తనయుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు మరోసారి ఇద్దరు స్వాతంత్య్ర సమరయోధులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజులు కలిస్తే ఎలా ఉంటుందనేదనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా స్టోరీ లైన్ రెడీ చేసారు విజయేంద్ర ప్రసాద్. దీనికి రాజమౌళి తన దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈయన ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదగా’ కార్యక్రమంలో పాల్గొని తన సినిమాలకు సంబంధించిన పలు విషయాలను పంచుకున్నారు. ఈ ఇంటర్వ్యూలో విజయేంద్రప్రసాద్ చూస్తే ఒకింత ఆశ్చర్యం కలగక మానదు.

  తనయుడు రాజమౌళితో స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ (File/Photo)


  ఈయన కూడా అచ్చం గౌరవీయులైన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తరహాలో పెరిగిన గడ్డంతో దర్శనమిచ్చి ఓ ఋషిలా కనిపించారు. అందరు కథలను రాయడం కోసం ఏ బ్యాంకాక్ లేదా ఏదైనా మంచి ప్రదేశానికి వెళతారు. ఈయన మాత్రం ఇంట్లో నాలుగు గోడల మధ్యనే తన కథలను పూర్తి చేస్తారట. ఎన్నో అద్భుతమైన సినిమాలకు కథలను అందించిన ఈయనకు సినిమాలు చూస్తే నిద్ర వస్తుందట. అంతేకాదు ఒక్కోసారి నిద్రపోవడానికి సినిమాలకు వెళుతుంటారని చెప్పేవారు. మరోవైపు సినిమా ఇండస్ట్రీలో ఆయన నచ్చిన విషయం .. అబద్దాలు ఆడటం. ఇక్కడ అబద్దాలు ఆడేవారికి మంచి చోటు ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇండస్ట్రీకి వచ్చే వారు అబద్ధాలు చెప్పడం నేర్చుకోవాలని ఒకింత వ్యంగ్యంగా సమాధానమిచ్చారు.


  ఇక ప్యాన్ ఇండియా దర్శకుడిగా ఎంతో మంది ఫేవరేట్ దర్శకుడిగా మారిన తనయుడు రాజమౌళి ఇంట్లో ఉండగా.. ఈయనకు మాత్రం దర్శకుడు పూరీ జగన్నాథ్ అంటే ఎంతో ఇష్టమట. ఇష్టం అంటే జెలసీ అని చెప్పుకొచ్చారు. ఎందుకంటే.. పూరీ జగన్నాథ్.. ఏదో ఒకటి అరా సందర్భంలో తప్పితే.. ఆయన సినిమాలకు ఆయన కథను రాసుకుంటారు. రాజమౌళి ఎంత పెద్ద తోపు దర్శకుడు అయినా.. ఆయన ఇంత వరకు తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఇచ్చిన కథలతోనే సినిమాలను తెరకెక్కించి ప్యాన్ ఇండియా రైటర్‌గా పాపులర్ అయ్యారు.

  Rajamouli Jr NTR Ram Charans RRR Writer Vijayendra Prasad about RRR Movie And Tarak Vijayendra Prasad - RRR: ఆర్ఆర్ఆర్‌లో ఆ సీన్స్ కన్నీళ్లు తెప్పిస్తాయట.. రచయత విజయేంద్ర ప్రసాద్..,Vijayendra Prasad,RRR,Vijayendra Prasad About RRR Movie,Vijayendra Prasad RRR Movie,ZEE5, Zee network acquired the digital and satellite rights of RRR Movie in all languages,pen movies acquired the North India Distribution Rights, Ram Charan Birth day gift, Nick Powell Ram charan ntr RRR new Release Date confirmed officially announced, RRR Release Date leaked, English actor alison doody leaks the rrr release date, RRR update, ntr news, ntr intro,RRR update,Ntr as Komaram Bheem look,RRR fight secens,RRR news,RRR ntr fight,RRR leaks,ఆర్ ఆర్ ఆర్ లీక్స్, రాజమైమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్, charan intro,charan rrr intro, ntr rrr intro rrr release date,విజయేంద్ర ప్రసాద్,ఆర్ఆర్ఆర్ సీన్స్ పై విజయేంద్ర ప్రసాద్ భావోద్వేగం,విజయేంద్ర ప్రసాద్ ఎన్టీఆర్, రామ్ చరణ్,
  విజయేంద్ర ప్రసాద్ (Vijayendra Prasad Photo : Twitter)


  ఇక రచయతగా పాపులర్ అయిన ఈయన దర్శకుడిగా మాత్రం సక్సెస్ కాలేకపోయారు. ఈ సందర్భంగా ఓ వ్యక్తి రాజన్న సినిమా చూసి తెలుగులో ముందు వరుసలో ఉన్న అగ్ర దర్శకులుతో సమానంగా తెరకెక్కించరన్నారు. ఆ తర్వాత శ్రీవల్లీ’ సినిమా చూసిన అదే వ్యక్తి మీకు దర్శకత్వం రాదని ముఖం మీదే చెప్పారట. ఇంతకీ ఈయన ఈ మాటలు అన్నది ఎవరో కాదు ఆయన తనయుడు రాజమౌళి. ఇక ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవ్‌గణ్ వంటి బడా స్టార్స్ ఉన్న  ఆర్ఆర్ఆర్ స్పెషల్ సర్‌ ఫ్రైజ్ ఆలియా భట్ అంటూ చెప్పారు. ఈ సినిమాలో ఆమె ఉండేది కాసేపు అయినా.. సినిమా మొత్తం ఆమె ప్రభావం ఉంటుందన్నారు.  ఇలాంటి ఎన్నో ఆసక్తికర విషయాలను విజయేంద్ర ప్రసాద్ ఆలీతో పంచుకున్నారు.ఇక  ఈ ఇంటర్వ్యూ మొత్తం చూడాలంటే.. ఈ నెల 31 రాత్రి 9.30 గంటలకు ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదగా’ ప్రోగ్రామ్ చూడాల్సిందే.
  Published by:Kiran Kumar Thanjavur
  First published: