VIJAYASHANTI ROLE IS VERY IMPORTANT IN MAHESH BABU SARILERU NEEKEVVARU MOVIE PK
సరిలేరు నీకెవ్వరులో విజయశాంతికి మాత్రమే ఎందుకీ మినహాయింపు..?
‘సరిలేరు నీకెవ్వరు’లో విజయశాంతి (Twitter/Photo)
ఒకటి రెండు కాదు.. 13 ఏళ్ళ తర్వాత మళ్లీ రీ ఎంట్రీ ఇస్తుంది విజయశాంతి. అప్పుడెప్పుడో నాయుడమ్మ సినిమా తర్వాత మళ్లీ ఇన్నేళ్లకు సరిలేరు నీకెవ్వరులో కీలక పాత్రలో నటించింది లేడీ సూపర్ స్టార్.
ఒకటి రెండు కాదు.. 13 ఏళ్ళ తర్వాత మళ్లీ రీ ఎంట్రీ ఇస్తుంది విజయశాంతి. అప్పుడెప్పుడో నాయుడమ్మ సినిమా తర్వాత మళ్లీ ఇన్నేళ్లకు సరిలేరు నీకెవ్వరులో కీలక పాత్రలో నటించింది లేడీ సూపర్ స్టార్. అనిల్ రావిపూడి తన కథతో ఆమెను మెప్పించి స్క్రీన్‌పై మళ్లీ విజయశాంతిని చూసేలా చేసాడు. ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఇన్నేళ్ళ తర్వాత ఆమె నటించడానికి ఒప్పుకుందంటే కచ్చితంగా అందులో ఎంత విషయం ఉందో అర్థమైపోతుంది. దానికి తోడు ఆమె కారెక్టర్ ఎలా ఉండబోతుందో కూడా అర్థం చేసుకోవచ్చు. విజయశాంతి కూడా ఇప్పుడు ఇదే చెబుతుంది.
సినిమాలో తన పాత్ర చాలా హూందాగా ఉంటుందని.. ఇన్నేళ్ళ తర్వాత తన రీ ఎంట్రీ కోసం ఎలాంటి పాత్ర అయితే కోరుకున్నానో అలాంటి పాత్రే ఇది అంటూ చెప్పింది. ఇక ఇప్పుడు అనిల్ రావిపూడి మరో సీక్రేట్ కూడా చెప్పాడు. ఈ చిత్రంలో విజయశాంతి పాత్రకు మాత్రమే ఉన్నది.. మిగిలిన వాళ్లకు లేని తేడా ఒకటి బయటపెట్టాడు. సరిలేరు నీకెవ్వరులో మహేష్ బాబుతో సహా అన్ని పాత్రలు కూడా కామెడీ చేస్తాయని.. కానీ ఒక్క విజయశాంతి మాత్రమే కామెడీకి దూరంగా ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు అనిల్.
‘సరిలేరు నీకెవ్వరు’ మూవీతో నటిగా విజయశాంతి రీ ఎంట్రీ
ఆమె పాత్ర మాత్రం పూర్తిగా సీరియస్ దారిలో సాగుతుందని.. విజయశాంతితో ఉన్నపుడే మహేష్ పాత్ర కూడా సీరియస్‌గా ఉంటుందని చెప్పాడు అనిల్ రావిపూడి. ఆమె పాత్ర అలా ఉండటానికి కారణం కూడా ఏం లేదు.. సినిమా కథను లీడ్ చేసేది విజయశాంతి అంటున్నాడు అనిల్. అందుకే ఆమె తప్ప అందరితోనూ కామెడీ చేయించినట్లు చెప్పాడు అనిల్. ప్రకాశ్ రాజ్, అజయ్ లాంటి వాళ్లు కూడా ఈ చిత్రంలో కడుపుబ్బా నవ్వించారని తెలుస్తుంది.