Home /News /movies /

VIJAYASHANTI RARE RECORD KARTHAVYAM TEJASWINI MOVIE GOT TWEETED BY NATIONAL FILM ARCHIVES OF INDIA TA

విజయశాంతికి మరో అరుదైన గౌరవం.. మన దేశంలో ఏ హీరోయిన్‌కు సాధ్యం కాలేదు..

విజయశాంతి (Twitter/Vijayashanti)

విజయశాంతి (Twitter/Vijayashanti)

Vijayashanti | లేడీ సూపర్ స్టార్‌గా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న కథానాయిక విజయశాంతి. 80, 90లలో ఆమె ఒకవైపు గ్లామర్ హీరోయిన్‌గా నటిస్తూనే.. మరోవైపు నాయిక ప్రాధాన్య చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈమె మరో రికార్డును అందుకుంది.

ఇంకా చదవండి ...
లేడీ సూపర్ స్టార్‌గా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న కథానాయిక విజయశాంతి. 80, 90లలో ఆమె ఒకవైపు గ్లామర్ హీరోయిన్‌గా నటిస్తూనే.. మరోవైపు నాయిక ప్రాధాన్య చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. విజయశాంతి లేడీ ఓరియంటెడ్‌గా తెరకెక్కిన చాలా చిత్రాలు బాక్సాపీస్ దగ్గర మంచి విజయాలనే నమోదు చేసాయి. అలాంటి చిత్రాల్లో ‘కర్తవ్యం’ సినిమాకు ప్రత్యేకస్థానం ఉంది.  1990లో  ఏ.మోహన్ గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర స్టార్ హీరోల రేంజ్‌లో వసూళ్ల వర్షం కురిపించింది. ఈ చిత్రంలో విజయశాంతి దుర్మార్గుల భరతం పట్టే ఐపీఎస్ పోలీస్ అధికారిణి వైజయంతిగా అద్భుత నటనను కనబరిచారు. ఈ చిత్రానికి గాను విజయశాంతి.. మొదటిసారి జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకుంది. అంతేకాదు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ నటిగా నంది అవార్డును సైతం కైవసం చేసుకుంది. ఈ సినిమా చూసి చాలా మంది మహిళలు ప్రేరణ పొంది ఐపీఎస్ అధికారులయ్యారు. ఈ చిత్రాన్ని 1994లో హిందీలో ఎన్.చంద్ర దర్శకత్వంలో ‘తేజస్విని’ పేరుతో రీమేక్ చేస్తే...అక్కడ కూడా సూపర్ హిట్టైయింది. ఈ చిత్రాన్ని తమిళంలో వైజయంతి ఐపీఎస్ పేరుతో డబ్ చేసి రిలీజ్ చేసారు. అక్కడ కూడా వసూళ్ల ప్రభంజనం సృష్టించింది.

vijayashanti rare record karthavyam tejaswini movie got tweeted by national film archives of india,Vijayashanti,vijayashanti rare record,Vijayashanti NFAI,National film archives of india,Vijayashanti karthavyam,vijayashanti national award for best actress,National film archives of india vijayashanti kartavyam tejaswini,womens day 2020 vijayashanti kartavyam tejaswini, Vijayashanti supreme court,Vijayashanti welcomes supreme court verdict,vijayashanti on women army officers,Vijayashanti twitter,Vijayashanti movies,Vijayashanti mahesh babu,Vijayashanti sarileru neekevvaru,Vijayashanti mahesh babu sarileru neekevvaru,Vijayashanti anil ravipudi,telugu cinema,విజయశాంతి,విజయశాంతి అనిల్ రావిపూడి,విజయశాంతి మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు,'సుప్రీంకోర్డు స్వాగతించిన విజయశాంతి,సుప్రీంకోర్టు తీర్పును ఆహ్వానించిన విజయశాంతి,అంతర్జాతీయ మహిళ దినోత్సవం,మహిళా దినోత్సవం,కర్తవ్యం తేజస్విని విజయశాంతి నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్స్,ఎన్ఎఫ్ఏఐ,ఎన్ఎఫ్ఏఐ విజయశాంతి కర్తవ్యం తేజస్విని
విజయశాంతి కర్తవ్యం,తేజస్విని మూవీలను ట్వీట్ చేసిన NFAI (Twitter/Photo)


దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ‘కర్తవ్యం’ సినిమాకు మరో అరుదైన గుర్తింపు లభించింది. అంతర్జాతీయ మహిళ దినోత్సవం రోజున మనదేశానికి చెందిన నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా (NFAI) ఈ సినిమాకు సంబంధించిన తెలుగు, హిందీ పోస్టర్స్‌ను ట్వీట్ చేసింది. ఇప్పటి వరకు ఏ హీరోయిన్ నటించిన రెండు చిత్రాలను ఈ రకంగా నేషనల్ ఫిల్మ్ ఆర్కైౌవ్స్ ట్వీట్ చేయలేదు. ఒక రకంగా మన దేశంలో NFAI ట్వీట్ చేసిన మహిళ ప్రధాన చిత్రంగా ఇది రికార్దులకు ఎక్కింది. ఈ ముప్పై ఏళ్లలో ఎన్నో మహిళా ప్రాధాన్యత చిత్రాలు వచ్చినప్పటికీ ‘కర్తవ్యం’ సినిమా పోస్టర్స్ మాత్రం నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్స్ పోస్ట్ చేయడం తెలుగు సినిమాకు విజయశాంతికి దక్కిన గౌరవంగా భావించాలి.

Published by:Kiran Kumar Thanjavur
First published:

Tags: Bollywood, NFAI, Telugu Cinema, Tollywood, Vijayashanti, Womens Day 2020

తదుపరి వార్తలు