మహేష్ బాబు వ్యక్తిత్వంపై విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు..

సరిలేరు నీకెవ్వరు సినిమా ద్వారా మళ్లీ ముఖానికి రంగు వేసుకుంటున్న విజయశాంతి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ సందర్భంగా మహేష్ బాబుపై ఆమె ఆస్తకికర వ్యాఖ్యలు చేశారు.

news18-telugu
Updated: October 31, 2019, 4:36 PM IST
మహేష్ బాబు వ్యక్తిత్వంపై విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు..
‘సరిలేరు నీకెవ్వరు’లో విజయశాంతి (Twitter/Photo)
  • Share this:
విజయశాంతి.. సినిమాల్లో ఉన్నా, రాజకీయాల్లో ఉన్నా ఫైర్ బ్రాండ్ ఆమె. హీరోయిన్ అంటే అందాల ప్రదర్శనే కాదు.. హీరోకు దీటుగా ఇజం చూపించగలదని నిరూపించారు. 2006 వరకు సినిమాలు చేసి, ఆ తర్వాత రాజకీయాల్లో బిజీగా గడిపిన విజయశాంతి.. మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించి దీపావళి సందర్భంగా ఆమె లుక్‌ను విడుదల చేయగా.. మంచి రెస్పాన్స్ వచ్చింది. దాదాపు 13 ఏళ్ల తర్వాత పోస్టర్‌పై విజయశాంతి కనిపించడంతో ఈ లేడీ సూపర్ స్టార్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అయితే.. సరిలేరు నీకెవ్వరు సినిమా ద్వారా మళ్లీ ముఖానికి రంగు వేసుకుంటున్న ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ సందర్భంగా మహేష్ బాబుపై ఆస్తకికర వ్యాఖ్యలు చేశారు. ‘30 ఏళ్ల కిందట మహేష్ బాబుతో కలిసి కొడుకు దిద్దిన కాపురం సినిమాలో కలిసి నటించాను. ఆ సినిమా షూటింగ్ అప్పుడే ఆయన గొప్ప స్టార్ అవుతాడని ఊహించా. సచిన్ టెండూల్కర్ ఎంత గొప్ప బ్యాట్స్‌మనో.. మహేష్ కూడా అంత గొప్ప స్టార్ అవుతాడని అనిపించింది.’ అని విజయశాంతి తెలిపారు.

‘సరిలేరు నీకెవ్వరు’లో విజయశాంతి


మరి సెట్‌లో మహేష్ బాబు మిమ్మల్ని ఏమని పిలుస్తారని అడగ్గా.. అమ్మ అని పిలుస్తారని, లేకపోతే మేడం అని అంటారని విజయశాంతి చెప్పారు. మీరు మహేష్ బాబును ఏమని పిలుస్తారని ప్రశ్నించగా.. బాబు అని పిలుస్తానని చెప్పుకొచ్చారు. ఇక, మహేష్ బాబు వ్యక్తిత్వంపై మాట్లాడిన ఆమె.. సెట్‌లో అందరితో సరదాగా ఉంటారని, పని విషయానికి వచ్చే సరికి మాత్రం కామ్‌గా తన పని తాను చేసుకుంటారని, ఆ విషయంలో కృష్ణలాగే అని అన్నారామె. తన రీ ఎంట్రీ మహేష్ బాబు సినిమా ద్వారానే కావడం సంతోషంగా ఉందని, ఆయనతో కలిసి పని చేయడం ఇంకా ఆనందంగా ఉందని వెల్లడించారు.

ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో క్యారెక్టర్ కోసం దాదాపు 10 కేజీల బరువు తగ్గానని, దాని కోసం జిమ్‌లో రోజుకు రెండు గంటల పాటు కష్టపడ్డానని విజయశాంతి చెప్పారు. అనిల్ రావిపూడి కథ చెప్పినపుడు రెండున్నర గంటలకు పైగా పొట్ట చెక్కలయ్యేలా నవ్వానని తెలిపారు.

First published: October 31, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>