చిరంజీవి, మహేష్‌పై విజయశాంతి ఆసక్తికరమైన వ్యాఖ్యలు..

సరిలేరు నీకెవ్వరు సినిమాతో మరోసారి వార్తల్లో నిలిచింది విజయశాంతి. 13 ఏళ్లుగా రాజకీయాల్లోనే ఉన్న ఈమె ఇప్పుడు మళ్లీ సినిమాల వైపు వస్తుంది. దాంతో పాటు చాలా ఏళ్ళ తర్వాత చిరంజీవిని కలవడం..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: January 8, 2020, 9:01 PM IST
చిరంజీవి, మహేష్‌పై విజయశాంతి ఆసక్తికరమైన వ్యాఖ్యలు..
విజయశాంతి చిరంజీవి మహేష్ బాబు
  • Share this:
సరిలేరు నీకెవ్వరు సినిమాతో మరోసారి వార్తల్లో నిలిచింది విజయశాంతి. 13 ఏళ్లుగా రాజకీయాల్లోనే ఉన్న ఈమె ఇప్పుడు మళ్లీ సినిమాల వైపు వస్తుంది. దాంతో పాటు చాలా ఏళ్ళ తర్వాత చిరంజీవిని కలవడం.. ఆయన కూడా బాగా ఎమోషనల్ అవ్వడంతో సరిలేరు నీకెవ్వరు ఈవెంట్‌లో ఈ ఇద్దరి సీన్ బాగా హైలైట్ అయింది. ఇక ఈ వేడుకలో చిరంజీవి కూడా విజయశాంతిపై ప్రశంసల వర్షం కురిపించాడు. దాంతో ఈమె కూడా బాగానే ఎమోషనల్ అయింది. అందుకే ఇప్పుడు ఫేస్ బుక్ వేదికగా చిరు, మహేష్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది విజయశాంతి. ఈ ఇద్దరి గురించి ఓ పెద్ద లేఖ రాసింది ఈమె.

ఆ లేఖ ఇలా సాగింది.. నటనా పరమైన ప్రశంసల వల్ల లభించే సంతోషం ఒకటైతే… కమర్షియల్ సినిమాల విజయంతో సాధించే స్టార్‌డం ఇమేజ్ వల్ల అందుకునే ఆనందం ఇంకొకటి. ఈ రెండూ కళాకారులను అత్యంత ప్రభావితం చేయగలిగే అంశాలే అన్నది నా అభిప్రాయం. జాతీయ ఉత్తమ నటిగా నేను అవార్డు తీసుకున్న సందర్భంలో ఎంత గౌరవంగా భావించానో… నటనకు డిక్షనరీ లాంటి మహానటుడు శివాజీ గణేషన్ గారు నన్ను 'గ్రేట్ ఆర్టిస్ట్, నా దత్తపుత్రిక' అని సంబోధించినప్పుడు అంతకుమించి గౌరవంగా భావించాను. అలాగే కమర్షియల్ సినిమాల పరంగా ఎన్ని విజయాలు సాధించినా… లేడీ సూపర్‌స్టార్, లేడీ అమితాబ్ లాంటి అభినందనలు పొందినా… ఆ మాటను తెలుగు సినిమాను కమర్షియల్‌ పరంగా, కలెక్షన్ల పరంగా అత్యున్నత స్థాయికి తీసుకెళ్లిన మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పడంతో ఆ పదాలకు ఒక విలువ, పదింతల మర్యాద లభించినట్లుగా భావిస్తున్నాను. సాధారణంగా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇలాంటి ప్రశంసలు అందుకోవడం ఆనవాయితీ. కానీ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఫంక్షన్ లోనే మెగాస్టార్ ద్వారా నేను అభినందనలు అందుకోవడానికి అవకాశం కల్పించిన సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి కృతజ్ఞతలు. 'సరిలేరు నీకెవ్వరు' దర్శకుడు రావిపూడి గారితో పాటు… మొత్తం చిత్ర యూనిట్‌కు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.. మీ విజయశాంతి అంటూ ముగిసింది ఈమె. జనవరి 11న సరిలేరు నీకెవ్వరు విడుదల కానుంది. ఇందులో లెక్చరర్ పాత్రలో నటించింది విజయశాంతి.
Published by: Praveen Kumar Vadla
First published: January 8, 2020, 9:01 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading