VIJAYASHANTI INTERESTING COMMENT ON OLD SHOOTING DAYS TA
అప్పట్లో కారులోనే అంతా అంటూ... విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు..
‘సరిలేరు నీకెవ్వరు’లో విజయశాంతి (Twitter/Photo)
అప్పట్లో మేము కష్టపడ్డట్టు ఇప్పటి హీరో, హీరోయిన్లు అసలు కష్టపడటం లేదు. అంటూ ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల్లో విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
అప్పట్లో మేము కష్టపడ్డట్టు ఇప్పటి హీరో, హీరోయిన్లు అసలు కష్టపడటం లేదు. అంటూ ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల్లో విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ప్రస్తుతం హీరోలతో పాటు హీరోయిన్లు.. ఒక సినిమా చేసిన తర్వాత ఇంకోటి ఆచితూచి చేస్తున్నారు. కానీ అప్పట్లో హీరోలు.. హీరోయిన్లు మాత్రం ఒకేసారి నాల్గైదు సినిమా షూటింగ్స్‌లో పాల్గొనేవారని చెప్పింది విజయశాంతి. నేనైతే ఒకేసారి అరడజనుకు పైగా సినిమాల చేసే దాన్ని. దీంతో ఒక్కోసారి షూటింగ్ స్పాట్లో డ్రెస్సులు ఛేంజ్ చేసుకునే టైమ్ ఉండేది కాదు. అందుకే కారులోనే డ్రెస్‌తో పాటు మేకప్ వేసుకొని ఒక షూటింగ్ స్పాట్ నుంచి మరో షూటింగ్ ప్లేస్‌కు వెళ్లే వాళ్లమని చెప్పుకొచ్చింది. ఈ రకంగా నిర్మాతలకు, దర్శకులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మసులుకునే వాళ్లం. ఇపుడునట్లు అప్పట్లో కార్వాన్ లాంటివి లేవని చెప్పింది. అవుట్ డోర్ షూటింగ్ అయితే ఎంతో ఇబ్బంది పడేవాళ్లం. అంతేకాదు అపట్లో మేము హిట్ ప్లాపులు అనేవి పట్టించుకోకుండా సినిమాలు చేసేవాళ్లమంటూ చెప్పుకొచ్చింది.
విజయశాంతి వ్యాఖ్యలు చూస్తుంటే.. ఇప్పటి హీరో, హీరోయిన్లు ఎంతలా సినిమాలను ఎంజాయ్ చేస్తున్నారనే విషయం అర్థమవుతోంది. సరిలేరే నీకెవ్వరు సినిమాలో విజయశాంతి.. ప్రొఫెసర్ భరతి పాత్రలో నటించింది. సినిమాలో మహేష్ బాబును గైడ్ చేసే పాత్ర. మహేష్ బాబు, రష్మిక హీరో, హీరోయిన్లుగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్ జారీ చేసారు.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.