VIJAYASHANTI EXCELLENT FIGHT SCENE IN THE SHOOTING OF MAHESH BABU SARILERU NEEKEVVARU SHOOTING TA
ఈ ఏజ్‌లో విజయశాంతి చేసిన ఫీట్ చూసి ఆశ్యర్యపోతున్న అభిమానులు..
విజయశాంతి (Twitter/Vijayashanti)
ఒకప్పుడు లేడీ అమితాబ్‌గా ప్రేక్షకుల నీరాజనాలు అందుకున్న విజయశాంతి..దాదాపు 13 ఏళ్లు లాంగ్ గ్యాప్ తర్వాత మహేష్ బాబు హీరోగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో నటిగా రీ ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఈ సినిమా సందర్భంగా విజయశాంతి చేసిన ఒక ఫీట్ ఇపుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
ఒకప్పుడు లేడీ అమితాబ్‌గా ప్రేక్షకుల నీరాజనాలు అందుకున్న విజయశాంతి..దాదాపు 13 ఏళ్లు లాంగ్ గ్యాప్ తర్వాత మహేష్ బాబు హీరోగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో నటిగా రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ చేసిన పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో ప్రొఫెసర్ భారతీ పాత్రలో చక్కగా ఒదిగిపోయారు. చాలా ఏళ్ల తర్వాత నటిగా రీ ఎంట్రీ ఇచ్చినా.. తనలో ఏ మాత్రం ఫైర్ తగ్గలేదని మరోసారి ప్రూవ్ చేసుకుంది. ఈ చిత్రం తర్వాత తమ సినిమాల్లో మంచి పాత్రల కోసం దర్శక, నిర్మాతలు హీరోలు ఆమెను సంప్రదిస్తున్నారు. తాజాగా అనిల్ రావిపూడి ఈ సినిమా షూటింగ్ సమయంలో విజయశాంతిపై తీసిన ఓ వీడియోను అనిల్ రావిపూడి తన ట్విట్టర్లో షేర్ చేశాడు. ఆ వీడియోలో బ్రహ్మాజీని విజయశాంతి కాలితో కిక్ ఇస్తున్న వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. 13 సంవత్సరం తర్వాత అద్భుతమైన పునరాగమనం మేడమ్. విజయశాంతి మేడమ్ మాస్టర్ కిక్ అంటూ అనిల్ రావిపూడి ట్వీట్ చేశారు. ఆ వీడియోను చూసిన నెటిజన్లు విజయశాంతిని అభినందిస్తున్నారు. మునుపటిలా విజయశాంతి చేసిన ఈ షాట్స్ ఇపుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.