Home /News /movies /

VIJAYASHANTI DO YOU KNOW ABOUT LADY SUPER STAR VIJAYASHANTI HUSBAND SRINIVAS PRASAD RELATION SHIP WITH NTR NBK NANDAMURI FAMILY HERE ARE THE DETAILS TA

VijayaShanti : నందమూరి కుటుంబానికి విజయశాంతి భర్తకు మధ్య ఉన్న సంబంధం ఇదే..

భర్త శ్రీనివాస్ ప్రసాద్‌తో విజయశాంతి (File/Photo)

భర్త శ్రీనివాస్ ప్రసాద్‌తో విజయశాంతి (File/Photo)

VijayaShanti: లేడీ సూపర్ స్టార్ విజయశాంతి (Vijayashanti) భర్త శ్రీనివాస్ ప్రసాద్‌ (Srinivas Prasad)కు నందమూరి(Nandamuri) కుటుంబానికి మధ్య సంబంధం ఉంది. వివరాల్లోకి వెళితే..

  VijayaShanti: లేడీ సూపర్ స్టార్ విజయశాంతి (Vijayashanti) భర్త శ్రీనివాస్ ప్రసాద్‌ (Srinivas Prasad)కు నందమూరి(Nandamuri) కుటుంబానికి మధ్య సంబంధం ఉంది. వివరాల్లోకి వెళితే.. విజయశాంతి తెలుగు చిత్రసీమకు లేడీ సూపర్ స్టార్. తన యాక్షన్‌తో  స్ట్రీట్ ఫైటర్ అవతారమెత్తిన మగరాయుడు. భారత నారిగా తన కర్తవ్యం నెరవెర్చిన పెంకిపెళ్లాం కూడా. గ్లామర్‌కి గ్రామర్ నేర్పిన లేడీబాస్. ఒసేయ్ రాములమ్మ గా దుర్మార్గులను ప్రతిఘటించిన అరుణ కిరణం. తన నటనతో ఒక హిస్టరిని క్రియేట్ చేసారు. అంతేకాదు యాక్షన్ ఓరియంటెడ్ మూవీస్‌తో  లేడీ అమితాబ్‌గా పేరు తెచ్చుకున్నారు. విజయశాంతి పేరు చెబితే తెరపై ఆమె చేసిన పోరాటాలే కాదు. ఆమె ఒలికించిన శృంగారం కూడా గుర్తుకొస్తుంది. అటు ఫర్ఫామెన్స్ ఓరియంటెడ్ మూవీస్‌లో నటిస్తునే.. ఇటు గ్లామర్ డాల్‌గా తన సత్తా చాటింది. ఆడియన్స్ చేత విశ్వ నట భారతిగా పిలిపించుకుంది. 

  1964 జూన్ 24న వరంగల్‌లో జన్మించింది. ఆమె అసలు పేరు శాంతి.  తెర పేరులోని విజయను తన పిన్ని విజయలలిత పేరు నుంచి తీసుకుంది. హీరోయిన్ గా విజయశాంతి ఫస్ట్ మూవీ 1979లో వచ్చిన ‘కల్లుక్కుళ్ ఈరమ్’ అనే తమిళ మూవీ. ఈ సినిమాలో నటించేటపుడు ఆమె వయసు పదిహేనేళ్లే. మాతృ భాష తెలుగులో ఆమె యాక్ట్ చేసిన మొదటి చిత్రం ‘కిలాడీ కృష్ణుడు’. సూపర్ స్టార్ కృష్ణ హీరోగా తెరకెక్కిన ఈమూవీ నటిగా విజయశాంతి కి మంచి మార్కులే పడ్డాయి. 

  Aryan Khan to Salman Khan Via Sanjay Dutt : ఆర్యన్ ఖాన్ నుంచి సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ వరకు జైల్లో ఎక్కువ రోజులు గడిపిన బీటౌన్ సెలబ్రిటీలు వీళ్లే..


  కెరీర్ మొదట్లో ఎక్కువగా గ్లామర్ పాత్రలనే చేసిన విజయశాంతికి నటిగా మంచి గుర్తింపు ఇచ్చిన సినిమా ‘నేటి భారతం’. ఈతరం ఫిలింస్ పతాకంపై టి.కృష్ణ దర్శకత్వంలోవచ్చిన ఈ చిత్రం నటిగా విజయశాంతికి మంచి బ్రేక్ ఇచ్చింది. ఈ సినిమా తర్వాత నటిగా విజయశాంతి వెనుదిరిగి చూసుకోలేదు. అప్పటికే జయసుధ, జయప్రద తమ అభినయంతో.. శ్రీదేవి,మాధవి తమ అందచందాలతో తెలుగుతెరను ఏలుతున్న రోజుల్లో నటిగా.. విజయశాంతి సినీ ప్రస్థానం ప్రారంభమైంది. అప్పటికే కథానాయికలుగా స్థిరపడిన వారిని సవాలు చేస్తూ విజయశాంతి విజృంభించింది.

  Actress Vijayashanti shocking comments for not having children.. Here behind the story pk.. జూన్ 24న విజ‌య‌శాంతి పుట్టిన రోజు. దాంతో ఈమె చాలా రోజుల త‌ర్వాత మీడియా ముందుకొచ్చింది. త‌న గురించి.. త‌న జీవితంలో జ‌రిగిన ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల గురించి మ‌నసు విప్పి మాట్లాడింది విజ‌య‌శాంతి. vijayashanti,vijayashanti twitter,vijayashanti instagram,vijayashanti movies,vijayashanthi,vijayashanti about not having children,vijayashanti husband,vijayashanti latest news,vijayashanti songs,vijayashanti speech,vijayashanti news,vijayashanti reveals shocking facts about not having children,vijayashanti real life,actress vijayashanti shocking comments for not having children,vijayashanti comments on kcr,vijayashanti personal life,vijayashanthi children's,telugu cinema,విజయశాంతి,విజయశాంతి సినిమాలు,విజయశాంతి పిల్లలు,విజయశాంతి భర్త,విజయశాంతి ఫ్యామిలీ,తెలుగు సినిమా
  విజయశాంతి (File/Photo)


  ఈమె తన కెరీర్‌లో ఎక్కువగా చిరంజీవి, బాలకృష్ణ, కృష్ణలతో ఎక్కువగా నటించింది.  గత నలభై ఏళ్లుగా తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూనే ఉంది. ఈమె కెరీర్ మంచి పీక్స్‌లో ఉండగానే శ్రీనివాస్ ప్రసాద్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఈయనకు నందమూరి కుటుంబానికి సంబంధం ఉంది. 

  Chiranjeevi Old Titles: ’రాజా విక్రమార్క’ సహా చిరంజీవి ఓల్డ్ టైటిల్స్‌తో వచ్చిన సినిమాలు ఇవే..

  విజయశాంతి భర్త శ్రీనివాస్ ప్రసాద్.. ఎన్టీఆర్ పెద్దల్లుడు.. గణేష్ రావుకు స్వయాన మేనల్లుడు అవుతారు. ఈయనకు హీరో బాలకృష్ణకు మంచి ఫ్రెండ్‌షిప్ ఉండేది. ఈ దోస్తానాతోనే బాలయ్యతోె ఒక సినిమాను నిర్మించాలనుకున్నారు. అందులో భాగంగా బాలకృష్ణతో కలిసి యువరత్న ఆర్ట్స్ స్థాపించి.. ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ‘నిప్పురవ్వ’ సినిమాను తెరకెక్కించారు. ఆ సినిమాలో హీరోయిన్‌గా పలువురు పేర్లు పరిశీలించి చివరకు విజయశాంతిని ఎంపిక చేసారు. ఆ సినిమాలో నటింపజేసేందకు ప్రసాద్.. స్వయంగా విజయశాంతి దగ్గరకు వెళ్లారు.

  Nandamuri Balakrishna Vijayashanti super hit combination in tollywood silver screen,Balakrishna,NBK,vijayashanti,NBK vijayashanti,balakrishna,vijayashati,balakrishna vijayashanti,balakrishna vijayashanti,nippu ravva,rowdy inspector,roja,vijayashanti,roja vijayashanti,ruler,balakrishna nandamuri,boyapati srinu,balayya,nbk,balakrishna roja vijayashanti,balakrishna roja,balakrishna vijayashanti,roja jabardasth comedy show,roja twitter,roja facebook,roja instagram,vijayashanti facebook,vijaya shanti twitter,vijayashanti instagram,balakrishna facebook,balakrishna twitter,balakrishna instagram,tollywood,telugu cinema,బాలకృష్ణ,రోజా,విజయశాంతి,బాలకృష్ణ విజయశాంతి రోజా,విజయశాంతి రోజా,బాలకృష్ణ రోజా,బాలకృష్ణ విజయశాంతి,బాలకృష్ణ బోయపాటి శ్రీను విజయశాంతి,
  బాలకృష్ణ,విజయశాంతి (File/Photo)


  అలా వాళ్ల మధ్య పరిచయం కాస్తా ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది. ఈయన నిర్మాతగా బాలయ్యతో కలిసి ‘నిప్పురవ్వ’ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర యావరేజిగా నిలిచింది. ఇక బాలయ్య, విజయశాంతి కాంబినేషన్‌లో వచ్చిన చివరి సినిమా ఇదే కావడం విశేషం.
  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Nandamuri Family, NBK, NTR, Tollywood, Vijayashanti

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు