Vijayashanti: సుశాంత్ కేసుపై విజయశాంతి కామెంట్స్.. అందరికీ ఒకే న్యాయం

సినీరంగంలో ఒకప్పుడు ఇంతకంటే దారుణమైన పరిస్థితుల్లో చిక్కుకుని ఎందరో నటీమణులు బలవన్మరణాలకు పాల్పడ్డారని.. వారిలో ఒక్కరి ఆత్మకైనా శాంతి కలిగించేలా ఈ స్థాయిలో విచారణలు, దర్యాప్తులు జరిగాయా? అని ప్రశ్నించారు.

news18-telugu
Updated: September 4, 2020, 10:53 AM IST
Vijayashanti: సుశాంత్ కేసుపై విజయశాంతి కామెంట్స్.. అందరికీ ఒకే న్యాయం
సుశాంత్ సింగ్, విజయశాంతి
  • Share this:
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజపుత్ కేసు ఇటు బాలీవుడ్.. అటు మహారాష్ట్ర రాజకీయాల్లో.. ప్రకంపనలు రేపుతోంది. రోజుకో మలుపుతో ఈ కేసు క్రైమ్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. సీబీఐతో పాటు ఎన్‌సీబీ (నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో) కూడా కేసును దర్యాప్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో సుశాంత్ సింగ్ కేసు దర్యాప్తు తీరుపై టాలీవుడ్ సీనియర్ నటి, కాంగ్రెస్ నేత విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ యువహీరో సుశాంత్ రాజ్‌పుత్ ఆత్మహత్య వెనుక వాస్తవాల్ని వెలికితీసేందుకు ప్రభుత్వాలు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారని... దోషుల్ని పట్టుకోవడానికి సీబీఐ విచారణకు సైతం ఆదేశించడం హర్షణీయమే అని అభిప్రాయపడ్డారు. ఐతే సినీరంగంలో ఒకప్పుడు ఇంతకంటే దారుణమైన పరిస్థితుల్లో చిక్కుకుని ఎందరో నటీమణులు బలవన్మరణాలకు పాల్పడ్డారని.. వారిలో ఒక్కరి ఆత్మకైనా శాంతి కలిగించేలా ఈ స్థాయిలో విచారణలు, దర్యాప్తులు జరిగాయా? అని ప్రశ్నించారు.

''చాలామంది నటీమణులు అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించినప్పుడు నామమాత్రంగా కేసులు నమోదు కావడం, తూతూ మంత్రంగా విచారణ చేసి చివరకి మమ అనిపించడమే చూశాం. సుశాంత్ కేసులో బయటకొస్తున్న విషయాలు చూస్తుంటే విస్మయం కలుగుతోంది. వెండితెరపై వెలగాలని ఎన్నో ఆశలతో వచ్చే కళాకారులు ఎవరికైనా ఇలాంటి పరిస్థితి ఎదురవడం బాధాకరం. అయితే దర్యాప్తులు, విచారణలనేవి వివక్ష లేకుండా ఎవరి విషయంలోనైనా ఒకేలా ఉండాలి. సంచలనాత్మకమైన ఇలాంటి ఎన్నో కేసుల విచారణ క్రమాన్ని గమనిస్తే, తెలంగాణ సహా చాలా రాష్ట్రాల్లో ఏసీబీ, సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థలు ఎంతో శ్రమించి కోర్టులకు తగిన ఆధారాల్ని సమర్పించిన తర్వాత కూడా వారు ఆశించిన ఫలితం రాకుంటే ప్రభుత్వాలు అప్పీలుకు వెళ్ళకపోవడం వల్ల శిక్షలు పడే అవకాశం బలంగా ఉన్న కేసులు సైతం నీరుగారుతున్నాయి. ఆ దిశగా ప్రయత్నాలు జరగాలి.'' అని విజయశాంతి అన్నారు.

జూన్ 14న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్య ముంబైలోని తన ఫ్లాట్‌లో అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసును మొదట ముంబై, బీహార్ పోలీసులు దర్యాప్తు చేశారు. ఐతే ముంబై పోలీసు తీరుపై తీవ్ర విమర్శలు రావడంతో కేసును సీబీఐకి అప్పగించింది కేంద్రం. ప్రస్తుతం సీబీఐ అధికారులు అన్ని కోణాల్లోనూ సుశాంత్ కేసును దర్యాప్తు చేస్తున్నారు.
Published by: Shiva Kumar Addula
First published: September 4, 2020, 10:50 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading