అనసూయకు లేడీ అమితాబ్ విజయశాంతి బిగ్‌షాక్..

అవును జబర్దస్త్ యాంకర్ అనసూయకు లేడీ అమితాబ్ విజయశాంతి బిగ్ షాక్ ఇచ్చింది. అవును నిజంగానే ఈ లేడీ అమితాబ్.. అనసూయ పాత్రలకు ఎసరు పెట్టే పనిలో పడింది.

news18-telugu
Updated: January 8, 2020, 2:02 PM IST
అనసూయకు లేడీ అమితాబ్ విజయశాంతి బిగ్‌షాక్..
విజయశాంతి,అనసూయ భరద్వాజ్ (Twitter/Photo)
  • Share this:
అవును జబర్దస్త్ యాంకర్ అనసూయకు లేడీ అమితాబ్ విజయశాంతి బిగ్ షాక్ ఇచ్చింది. అవును నిజంగానే ఈ లేడీ అమితాబ్.. అనసూయ పాత్రలకు ఎసరు పెట్టే పనిలో పడింది. విజయశాంతి దాదాపు 13 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో నటి రీ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే విడుదలైన ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రోమోస్ చూస్తుంటే.. ప్రొఫెసర్ భారతి పాత్రలో విజయశాంతి మరోసారి తన నట విశ్వరూపం చూపించబోతున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చిరంజీవి ముఖ్య అతిథిగా రావడం.. అంతేకాదు ఈ వేడుకలో మహేష్ బాబు కంటే చిరంజీవి, విజయశాంతి హైలెట్ కావడం.. ఆ వేడుకలో విజయశాంతితో చిరంజీవి పాత జ్ఞాపకాలను పంచుకున్నాడు. ఈ కోవలోనే ప్రస్తుతం చిరంజీవి, కొరటాల శివ సినిమాలో ఒక పాత్ర కోసం ముందుగా అనసూయను అనుకున్నారు. తాజాగా ఆ పాత్ర నిడివితో పాటు ప్రాధాన్యత పెంచి విజయశాంతితో చేయించాలనే ఆలోచనలో చిరంజీవి ఉన్నాడట.

vijayashanti big shock to anasuya bharadwaj character not yet confirmed,anasuya bharadwaj,vijayashanti,anasuaya bharadwaj vijayashanti,vijayashanti chiranjeevi,vijayashanti anasuay bharadwaj chiranjeevi,anasuya bharadwaj instagram,anasuya bharadwaj twitter,jabardasth comedy show,extra jabaradasth,anasuya jabardasth,chiranjeevi,chiranjeevi double acting,chiranjeevi facebook,chiranjeevi instagram,chiranjeevi twitter,chiranjeevi dual role in sye raa,chiranjeevi dual role,chiranjeevi dual role movies,megastar chiranjeevi dual role in 151 film,megastar chiranjeevi,dual role in 151 film,chiranjeevi movies,chiranjeevi in dual role,chiranjeevi playing dual role,megastar chiranjeevi dual role,chiru dual role,chiranjeevi dual role in sye raa movie,chiranjeevi dual role in koratala siva,nayanthara,ram charan koratala siva chiranjeevi,tollywood,telugu cinema,megastar,megastar chiranjeevi,chiru,chiranjeevi ram charan movie,chiranjeevi ram charan movie opening,chiranjeevi ram charan movie koratala siva,చిరంజీవి,మెగాస్టార్ చిరంజీవి,చిరు,చిరంజీవి ద్విపాత్రాభినయం,చిరు డబుల్ రోల్,చిరు ద్విపాత్రభినయం,చిరంజీవి డబుల్ యాక్టింగ్,చిరంజీవి,కొరటాల శివ,కొరటాల శివ చిరంజీవి,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,అనసూయ భరద్వాజ్,అనసూయ విజయశాంతి
విజయశాంతి,అనసూయ భరద్వాజ్ (Twitter/Photo)


అంతేకాదు ఈ విషయాన్ని కొరటాల శివతో కలిసి డిస్కషన్ చేసినట్టు చెబుతున్నారు. అంతేకాదు తొందర్లోనే ఈ క్యారెక్టర్ గురించి విజయశాంతికి కొరటాల శివతో కలిసి చిరంజీవి ఎక్స్‌ప్లేన్ చేయనున్నట్టు సమాచారం. ఒకవేళ విజయశాంతికి ఈ పాత్ర నచ్చితే.. చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. మొత్తానికి విజయశాంతి  రీ ఎంట్రీ ఇపుడు అనసూయకు కొత్త చిక్కులు తెచ్చిపెట్టిందనే చెప్పాలి.
Published by: Kiran Kumar Thanjavur
First published: January 8, 2020, 2:02 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading