చిరంజీవి సినిమాలో విజయశాంతి.. సుజీత్ దర్శకత్వంలో..

చిరంజీవి, విజయశాంతి Photo : Twitter

మెగాస్టార్ చిరంజీవి మలయాళ సూపర్ హిట్ ఫిల్మ్‌ ‘లూసిఫర్’‌ను తెలుగులో రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే.

  • Share this:
    మెగాస్టార్ చిరంజీవి మలయాళ సూపర్ హిట్ ఫిల్మ్‌ ‘లూసిఫర్’‌ను తెలుగులో రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు యువ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహించబోతున్నాడు. మలయాళ సినిమాలో మంజు వారియర్ పాత్ర ఎంతో కీలకమైనదే. ఆ పాత్రను తెలుగు వర్షన్ లో లేడి సూపర్ స్టార్ విజయశాంతి చేయబోతున్నట్లు సమాచారం. విజయశాంతి తాజాగా మహేష్ సరిలేరు నీకెవ్వరులో నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తల్లో నిజం ఎంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. ఇక తెలుగు ఆడియన్స్ కోరకు ఒరిజినల్ కథలో చాలా మార్పులు చేశాడట సుజీత్. ఇక్కడి వారికి కనెక్ట్ అయ్యేవిధంగా లూసిఫెర్ స్క్రిప్ట్‌లో మెగాస్టార్ కొన్ని కీలకమైన మార్పులను సూచించాడని.. సుజీత్ ఆ మార్పులను పూర్తి చేసి చిరుకి స్క్రిప్ట్‌ వినిపించాడని టాక్. దీంతో ఫైనల్ గా చిరంజీవి కూడా సుజీత్ చేసిన మార్పులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. ఇక ఈ సినిమాలో ముఖ్యంగా హీరోయిజమ్ ఎలివేషన్స్ సీన్స్ మరో రేంజ్‌లో ప్లాన్ చేశాడట సుజీత్. అది అలా ఉంటే చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్యలో నటిస్తున్నాడు. దాదాపు సగానికిపైగా షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ సినిమాను చరణ్, నిరంజన్ రెడ్డిలు కలిసి నిర్మిస్తున్నారు. చాలా రోజుల తర్వాత మణిశర్మ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. చిరంజీవికి జోడిగా కాజల్ నటిస్తోంది.
    Published by:Suresh Rachamalla
    First published: