హీరోయిన్ల మీద విజయశాంతి వ్యాఖ్యల దుమారం..

చాలా రోజుల తర్వాత విజయశాంతి ముఖానికి మేకప్ వేసుకుంటున్నారు. సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఆమె పాత్ర చాలా కీలకంగా ఉంటుందని సినిమా యూనిట్ చెబుతోంది.

news18-telugu
Updated: September 11, 2019, 5:28 PM IST
హీరోయిన్ల మీద విజయశాంతి వ్యాఖ్యల దుమారం..
విజయశాంతి ఫైల్ ఫోటో (Source: Twitter)
  • Share this:
సీనియన్ నటి, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి.. ఈతరం హీరోయిన్ల మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈతరం హీరోయిన్లలో ఎవరంటే ఇష్టం అనే ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానం దుమారానికి దారి తీస్తోంది. ఈ రోజుల్లో హీరోయిన్లుల ఏడాదిలో కేవలం రెండు, మూడు సినిమాలకే పరిమతం అవుతున్నారని విజయశాంతి అభిప్రాయపడ్డారు. తాము హీరోయిన్లుగా ఉన్న సమయంలో ఏడాదికి 15 నుంచి 18 సినిమాల్లో నటించేవారిమన్నారు. ఇప్పుడున్న హీరోయిన్లు పెద్దగా కష్టపడడం లేదనే అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు. కేవలం రెండు, మూడు సినిమాలు మాత్రమే చేసి.. అలసిపోకుండా జాగ్రత్తపడుతున్నారని దెప్పిపొడిచారు. విజయశాంతి ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా చేస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటిస్తున్నారు. చాలా రోజుల తర్వాత ఆమె ముఖానికి మేకప్ వేసుకుంటున్నారు. ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా కీలకంగా ఉంటుందని సినిమా యూనిట్ చెబుతోంది. సరిలేరు నీకెవ్వరు సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది.

First published: September 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు