హోమ్ /వార్తలు /సినిమా /

Vijayanand Movie Review: ‘విజయానంద్‘ మూవీ రివ్యూ.. ఆకట్టుకునే ఇన్‌స్ప్రేషనల్ స్టోరీ..

విజయానంద్ (Vijayanand)
విజయానంద్ (Vijayanand)
3/5
రిలీజ్ తేదీ:9/12/2022
దర్శకుడు : రిషిక శర్మ
సంగీతం : గోపీ సుందర్
నటీనటులు : నిహాల్,అనంత్ నాగ్, రవిచంద్రన్, భరత్ బోపన్న, అనీష్ కురువిల్ల,ప్రకాష్ బేలావాడి,సిరి ప్రహ్లాద్  తదితరులు.. 
సినిమా శైలి : బయోపిక్ మూవీ
సినిమా నిడివి : 2 Hr 56 Minits

Vijayanand Movie Review: ‘విజయానంద్‘ మూవీ రివ్యూ.. ఆకట్టుకునే ఇన్‌స్ప్రేషనల్ స్టోరీ..

విజయానంద్ మూవీ రివ్యూ (Twitter/Photo)

విజయానంద్ మూవీ రివ్యూ (Twitter/Photo)

Vijayanand Movie Review: విజయానంద్.. కన్నడ నాట VRL ట్రావెల్స్ వ్యవస్థాపకుడు విజయ్ సంకేశ్వర్ బయోపిక్. కేవలం ఒకే ఒక ట్రక్కుతో ఒక పెద్ద లాజిస్టిక్ కంపెనీ సామ్రాజ్యానికి అధిపతి అయ్యారు. ఎంతో మందికి ప్రేరణ ఇచ్చిన ఆయన జీవిత చరిత్రపై తెరకెక్కిన బయోపిక్‌లో నిహాల్ హీరోగా నటించారు. రిషికా శర్మ దర్శకత్వం వహించారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

రివ్యూ : విజయానంద్ (Vijayanand)

నటీనటులు : నిహాల్,అనంత్ నాగ్, రవిచంద్రన్, భరత్ బోపన్న, అనీష్ కురువిల్ల,ప్రకాష్ బేలావాడి,సిరి ప్రహ్లాద్  తదితరులు..

ఎడిటర్: హేమంత్ కుమార్

సినిమాటోగ్రఫీ: కీర్తన్ పూజారి

సంగీతం: గోపీ సుందర్

నిర్మాత : VRL ఫిల్మ్ ప్రొడక్షన్స్, ఆనంద్ సంకేశ్వర్

దర్శకత్వం: రిషిక శర్మ

విడుదల తేది : 9/12/2022

విజయానంద్.. కన్నడ నాట VRL ట్రావెల్స్ వ్యవస్థాపకుడు విజయ్ సంకేశ్వర్ బయోపిక్. ఆయనతో పాటు ఆయన కుమారుడు ఆనంద్ సంకేశ్వర్ పేరు కలిపి తన కంపెనీకి విజయానంద్ రోడ్ లైన్స్ అనే కంపెనీ స్థాపించారు.  కేవలం ఒకే ఒక ట్రక్కుతో  ఒక పెద్ద లాజిస్టిక్ కంపెనీని ఎలా స్థాపించాడు. ఎంతో మందికి ప్రేరణ ఇచ్చే  ఆయన జీవిత చరిత్రపై తెరకెక్కిన బయోపిక్‌లో నిహాల్ హీరోగా నటించారు. వీఆర్ఎల్ ఫిలిం ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై ఆనంద్ సంకేశ్వర్.. 'విజయానంద్' సినిమాను నిర్మించారు. కన్నడ చిత్ర పరిశ్రమలో ఇదే తొలి బయోపిక్.  రిషికా శర్మ దర్శకత్వం వహించారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..

కథ విషయానికొస్తే..

ఈ సినిమా కథ విషయానికొస్తే.. విజయ్ సంకేశ్వర్ (నిహాల్) వాళ్ల తండ్రి(కర్ణాటకలోని గడగ్‌లో ఒక మాములు ప్రింటింగ్ ప్రెస్ యజామాని.ఈ ప్రెస్‌లో చదువుకునే పుస్తకాలతో పాటు పెళ్లి పత్రికలు సహా ఎన్నింటినో ప్రింట్ చేస్తుంటారు. తన తండ్రి ప్రింటింగ్ ప్రెస్‌లో పనిచేయడం ఇష్టముండని విజయ్ సంకేశ్వర్.. సొంతంగా ఓ లారీ కొనుక్కొని వ్యాపారం చేయాలనుకుంటారు. ఈయన సొంత  ప్రింటింగ్ ప్రెస్ ఒదిలి లాజిస్టిక్ బిజినెస్‌ చేయడం తండ్రికి ఇష్టముందడు. ఐనా తాను నమ్ముకున్న దారిలోనే వెళతాడు.   ఈ క్రమంలో ఎన్నో అవమానాలను ఎదుర్కొంటారు. ఈ క్రమంలో ఒక్క ట్రక్కుతో మొదలైన ఆయన ప్రస్థానం దాదాపు 5 వేలకు ట్రక్కుల యాజమాని అవుతాడు.45 ఏళ్లలోనే కర్ణాటకలో అగ్ర వ్యాపారవేత్తగా ఎదుగుతాడు. ఈ క్రమంలో ఈయన ఒక పత్రికను కూడా స్థాపించాల్సి వస్తోంది. అందకు దారి తీసిన పరిస్థితులు ఏమిటి ? చివరకు తాను నమ్ముకున్న దారిలో ఎలా విజయాన్ని సొంతం చేసుకున్నాడనేడే విజయానంద్ మూవీ స్టోరీ.

కథనం, టెక్నీషియన్స్ విషయానికొస్తే.

ఒక వ్యక్తి జీవితాన్ని సినిమాగా తెరకెక్కించాలంటే అందులో కావాల్సింత ఎమోషన్,ఇన్‌స్ప్రేషన్, మోటివేషన్ ఉండాలి. అవన్ని ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ సంకేశ్వర్ జీవితంలో ఉన్నాయి. ఈయను అందరు కన్నడ అంబానీగా పిలుస్తూ ఉంటారు.  ఒక మాములు మధ్య తరగతి స్థాయి నుంచి ఉన్నత స్థితికి ఎలా చేరకున్నాడనే ఆయన జీవితాన్ని ఒక సినిమాగా అది కూడా ఆకట్టుకునే విధంగా  తెరకెక్కించడంలో దర్శకురాలు రిషికా శర్మ ఎంతగా హోం వర్క్ చేసిందో ఈ సినిమా చూస్తే తెలుస్తోంది. ఒక వ్యక్తి జీవితంలో జరిగిన సంఘనలను దాదాపు 2 గంటల పాటు ప్రేక్షకులను కదలకుండా కూర్చోబెట్టడంలో ఓ దర్శకురాలిగా సక్సెస్ అయింది. ముఖ్యంగా ఒకే ఒక ట్రక్కుతో ప్రారంభమై దాదాపు 5 వేలకు ట్రక్కులకు ఎలా  యాజమానిగా మారాడేనేది ఇపుడున్న యువతకు ఎంతో ప్రేరణగా నిలుస్తోంది. ఆయన జీవితాన్ని ప్రేక్షకులకు నచ్చేలా తెరకెక్కించడంలో సఫలమైంది. బయోపిక్ కాబట్టి.. సినిమా మొత్తం సీరియస్‌గా సాగిపోతూనే ఉంటుంది.  ఓ వర్గం ప్రేక్షకులకు ఈ సినిమా ఆకట్టుకోలేకపోవచ్చు.

ముఖ్యంగా ఈయన బీజేపీ తరుపున కర్ణాటకలో నార్త్ ధార్వాడ్‌లో ఎంపీగా గెలిచిన మొదటి వ్యక్తి. ఈయన రాజకీయ నాయకుడిగా మారిన తర్వాత ఎందుకు పత్రిక స్థాపించాల్సి వచ్చింది. అలా  విజయ కర్ణాటక పత్రికను స్థాపించడం..   నెంబర్ వన్ సర్కులేషన్ ఉన్న పత్రికగా ఒక వెలుగు వెలుగుతున్న సమయంలో  2007లో టైమ్స్‌కు విక్రయించారు. ఆయన ఎందుకు పత్రికను అమ్మాల్సి వచ్చిందో సినిమాలో కాస్త విడమరిచి చెబితే బాగుండేది.  ఆ తర్వాత తన కుమారుడు ఆనంద్‌తో కలిసి మళ్లీ విజయవాణి పత్రికను 2012లో స్థాపించడం జరగుతోంది. ఇపుడు అది  8 లక్షల సర్కులేషన్‌తో  నెంబర్ డైలీ న్యూస్ పేపర్‌గా ఉంది. ఈయన  మూడు సార్లు బీజేపీ తరుపున ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత బీజేపీతో విభేదించి కన్నడనాడు పార్టీని స్థాపించారు. ఆ తర్వాత మళ్లీ బీజేపీలో ఆ పార్టీని విలీనం చేసారనే విషయాన్నిసినిమాలో మాత్రం ప్రస్తావించలేదు. ఈయన రాజకీయ జీవితం కాకుండా... కేవలం విజయ వాణి పత్రికతో మళ్లీ పత్రికా రంగంలో కర్ణాకటలో నెంబర్ వన్‌గా ఎలా ఎదిగారేదానితో ఈ  సినిమను ఎండ్ చేసారు దర్శకురాలు. సినిమా ఫోటోగ్రఫీ, ఆర్ట్ వర్క్, గ్రాఫిక్స్ బాగున్నాయి. నిర్మాత ఈ సినిమాను ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించారు. ఎడటర్ ఇంటర్వెల్ తర్వాత కాస్తంత ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది.

నటీనటుల విషయానికొస్తే.. 

ఒక మాములు ట్రక్కు డ్రైవర్‌గా జీవితాన్ని ప్రారంభించి ఒక పెద్ద లాజిస్టిక్ మరియు పత్రిక రంగాన్నే శాసించే స్థాయి ఎదిగిన విజయ్ సంకేశ్వర్ పాత్రలో నిహాల్ చక్కగా నటించారు. సీరియల్ నటుడిగా, యాంకర్‌గా చేసిన ఈయనకు ఈ సినిమాలో ఎంతో అనుభవం ఉన్న నటుడిగా తన పాత్రకు న్యాయం చేసారు. ఇక ఈయన అబ్బాయి ఆనంద్ సంకేశ్వేర్ పాత్రలో నటించిన భరత్ బోపన్న.. తన క్యూట్ లుక్స్‌తో పాటు నటనతో అట్రాక్ట్ చేసాడు. ఇక విజయ్ సంకేశ్వర్ తండ్రి పాత్రలో నటించిన అనంత్ నాగ్ తన పాత్రలో జీవించాడనే చెప్పాలి. ఇక విజయ్ సంకేశ్వర్‌ వ్యాపారంలో రాణించడానికీ సహాయపడే గణేష్ పాత్రలో రవిచంద్రన్ నటన బాగుంది. ఇక ఈ సినిమాలో రామారావు అనే పత్రక యాజమాని పాత్రలో నటించిన ప్రకాష్ బేలావాడి యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఈ సినిమాలో తన నటనతో డామినేట్ చేసాడు. ఈయన భార్య లలిత పాత్రలో నటించిన సిరి ప్రహ్లాద్ నటన బాగుంది. మిగతా నటీనటులు తమ పరిధి మేరకు రాణించారు.

ప్లస్ పాయింట్స్ 

కథ

నిహాల్, ప్రకాష్ బేలావాడి, అనంత్ నాగ్  నటన

నిర్మాణ విలువలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్

మైనస్ పాయింట్స్ 

సినిమా నిడివి

సెకండాఫ్

ఎడిటింగ్

సీరియస్‌గా సాగే కథనం

చివరి మాట :  ఓ వర్గం ప్రేక్షకులను ఆకట్టుకునే ఇన్‌స్ప్రేషనల్ స్టోరీ

రేటింగ్ : 3/5

First published:

రేటింగ్

కథ:
3/5
స్క్రీన్ ప్లే:
3/5
దర్శకత్వం:
3/5
సంగీతం:
3/5

Tags: Sandalwood, Tollywood, Vijayanand Movie, VRL Group