హోమ్ /వార్తలు /సినిమా /

M Thiagarajan death: తమిళ ఇండస్ట్రీలో విషాదం.. రోడ్డు పక్కన అనాథ శవంలా ప్రముఖ దర్శకుడు..

M Thiagarajan death: తమిళ ఇండస్ట్రీలో విషాదం.. రోడ్డు పక్కన అనాథ శవంలా ప్రముఖ దర్శకుడు..

తమిళ దర్శకుడు త్యాగరాజన్ కన్నుమూత (m thiagarajan director)

తమిళ దర్శకుడు త్యాగరాజన్ కన్నుమూత (m thiagarajan director)

M Thiagarajan death: తమిళ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు ఒకరు రోడ్డు పక్కన అనాథ శవంలా ఉండటం సంచలనం రేపుతుంది. ప్రముఖ నిర్మాణ సంస్థలతో పాటు బ్లాక్‌బస్టర్ సినిమాలకు పని చేసిన దర్శకుడు త్యాగరాజన్ (M Thiagarajan death) మరణించారు.

ఇంకా చదవండి ...

తమిళ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు ఒకరు రోడ్డు పక్కన అనాథ శవంలా ఉండటం సంచలనం రేపుతుంది. ప్రముఖ నిర్మాణ సంస్థలతో పాటు బ్లాక్‌బస్టర్ సినిమాలకు పని చేసిన దర్శకుడు త్యాగరాజన్ మరణించారు. రోడ్డు పక్కన అనాథ శవంలా పడి ఉండటం కలకలం రేపుతుంది. విజయ్‌కాంత్ నటించిన సూపర్ హిట్ చిత్రం మానగర కావల్ సినిమాకు ఈయన దర్శకుడు. 1991లో విడుదలైన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ AVM నిర్మించింది. ఇది వాళ్లకు 150వ సినిమా కావడం విశేషం. ఆ సంస్థలో పని చేసిన త్యాగరాజన్.. అదే ఏవీఎం స్టూడియో సమీపంలో రోడ్డు పక్కన అనాథగా చనిపోయిన ఘటన కోలీవుడ్‌లో సంచలనం రేపుతోంది. అరుప్పుకోట్టై నుంచి వచ్చిన త్యాగరాజన్ అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పూర్వ విద్యార్థి. 'పొన్ను పార్క పరేన్'తో అరంగేట్రం చేసాడు.

'వెట్రిమేల్ వెట్రి' సినిమాతో దర్శకుడిగా మారాడు. ఈ రెండు సినిమాలు పర్లేదనిపించాయి. తొలి రెండు సినిమాలు యావరేజ్ అయినా కూడా.. స్క్రీన్ ప్లే కారణంగా విజయ్‌కాంత్‌తో పని చేసే అవకాశం అందుకున్నాడు. అలా ఆయన తెరకెక్కించిన 'మానగర కావల్' అద్భుతమైన విజయం సాధించింది. కానీ ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల అతనికి సినిమా ఆఫర్లు రాలేదని.. అది ఆయనను నిరాశకు గురి చేసిందని కోలీవుడ్ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.

Prabhas 3 movies in 2022: ప్రభాస్ అనుకున్నది చేసేలా ఉన్నాడుగా.. మాస్టర్ ప్లాన్ అదుర్స్..


త్యాగరాజన్ తన భార్య పిల్లలతో మనస్పర్థలు కలిగి గత 15 ఏళ్లుగా ఒంటరిగానే ఉంటున్నాడు. అతడి భార్య 10 ఏళ్ళ కిందే చనిపోయారు. పిల్లలు బెంగళూరులో ఉన్నారు. ఆయన మాత్రం రోజూ అమ్మ క్యాంటీన్‌లో ఒక్క పూట మాత్రమే తింటూ జీవిస్తున్నాడని.. ఓ టెంట్ వేసుకుని ఉంటున్నాడని పోలీసులు తెలిపారు. AVM అతి ముఖ్యమైన 150వ చిత్రానికి దర్శకత్వం వహించిన త్యాగరాజన్.. చివరికి అదే రోడ్డులో అనాథలా మరణించడం జీర్ణించుకోలేకపోతున్నారు అభిమానులు. త్యాగరాజన్ మృతదేహాన్ని పోస్టుమార్టం పూర్తి చేసారు పోలీసులు. ఈయన మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Kollywood, Tamil Cinema, Telugu Cinema

ఉత్తమ కథలు