Vijayakanth-Dhanush | తమిళ హీరోలైన విజయకాంత్, ధనుశ్ ఇళ్లను బాంబులతో పేల్చేస్తామంటూ చెన్నైలోని పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఎవరో గుర్తు తెలియని ఆకతాయి రెండు ఫోన్లు చేయడం కోలీవుడ్ వర్గాల్లో కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే..
Vijayakanth-Dhanush | తమిళ హీరోలైన విజయకాంత్, ధనుశ్ ఇళ్లను బాంబులతో పేల్చేస్తామంటూ చెన్నైలోని పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఎవరో గుర్తు తెలియని ఆకతాయి రెండు ఫోన్లు చేయడం కోలీవుడ్ వర్గాల్లో కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. చెన్నైలోని విరుగంబక్కంలోని ఎండీఎంకే అధినేత సినిమా హీరో విజయకాంత్ ఇంట్లో బాంబు పెట్టారని ఎవరో ఆకతాయి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మరోవైపు చెన్నైలోని అభిరామపురంలో ఉన్న రజినీకాంత్ అల్లుడు హీరో ధనుశ్ ఇంటిని కూడా బాంబులతో పేల్చేస్తామంటూ కాసేటి తర్వాత పోలీసులకు ఫోన్ వచ్చింది. ఇరువురు హీరోల ఇళ్లలో బాంబులు పెట్టిన సమాచారంతో వెంటనే రంగంలోకి దిగిన చెన్నై పోలీసులు.. విజయకాంత్, ధనుశ్ ఇళ్లను పోలీసు జాగిలాలతో పాటు మెటల్ డిటెక్టర్స్‌తో మొత్తం ఇంటిని సోదా చేసారు. అంతేకాదు చుట్టు పక్కల పరిసరాల్లో జల్లెడ పట్టారు. ఐతే.. వీళ్లిద్దరి ఇంట్లో ఫోన్ వచ్చినట్టు ఎలాంటి బాంబులు లేకపోవడంతో పోలీసులతో పాటు ఆయా హీరోల కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఐతే.. పోలీస్ కంట్రోల్ రూమ్‌కు రెండు సార్లు ఒకతనే ఫోన్ చేసినట్టు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. తప్పుడు సమాచారంతో ఎంతో అసౌర్యాన్ని కలిగించిన ఆ ఆకతాయిని కూడా పోలీసులు టెక్నాలజీ సహాయంతో వెంటనే పట్టేసుకున్నారు. అంతేకాదు అతన్ని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసారు. అంతేకాదు బాంబు బెదిరింపు కాల్స్ పై అతను ఎందుకు పోలీసులను తప్పు దారి పట్టించారనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
విజయకాంత్,ధనుశ్ (File/Photos)
ఐతే.. గత కొన్ని నెలలుగా చెన్నైలో ఇలాంటి బెదిరింపు కాల్స్ మాములైపోయాయి. ఇప్పటికే రజినీకాంత్, అజిత్, విజయ్ వంటి ఇళ్లకు బాంబు బెదిరింపు కాల్స్ ఎన్నోసార్లు వచ్చాయి. మెంటల్ కండిషన్ సరిగా ఓ వ్యక్తి పనులు చేసినట్టు పోలీసులు తమ దర్యాప్తులో తేల్చేరు. ఈ రకంగానే జూలై 18న ఓ పర్సన్ ఇలానే అజిత్ ఇంట్లో బాంబులున్నాయని పోలీసులకు తప్పుడు సమాచారం అందించారు. దీంతో పోలీసులు రంగంలోకి అజిత్ ఇంటిని సోదా చేయగా.. ఎలాంటి బాంబులు లేవని.. ఇదంతా ఎవరో కావాలనే పోలీసులను ఆట పట్టించడానికి చేస్తున్నారనే విషయం స్పష్టం అయింది.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.