VIJAY VIJAY SETHUPATHI MASTER SECOND DAY WORLD WIDE COLLECTIONS TA
Vijay Master 2nd Day Collections: విజయ్ ‘మాస్టర్’ సెకండ్ డే కలెక్షన్స్.. రెండో రోజు ఎంత రాబట్టిందంటే..
విజయ్ మాస్టర్ సెకండ్ డే కలెక్షన్స్ (Twitter/Photo)
Vijay Master 2nd Day Collections: తమిళ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి లీడ్ రోల్లో తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం ‘మాస్టర్’. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించాడు. మొదటి రెండు రోజుల్లో ఈ సినిమా ఎంత వసూళ్లను రాబట్టిందంటే..
Vijay Master 2nd Day Collections: తమిళ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి లీడ్ రోల్లో తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం ‘మాస్టర్’. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించాడు. ఖైదీ తర్వాత లోకేష్ కనకరాజ్ డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తోడు విజయ్, విజయ్ సేతుపతి కలిసి నటించడంతో అంచనాలు మరో రేంజ్లో ఏర్పడ్డాయి. ఇక సినిమా ఫస్ట్ లుక్ నుండి టీజర్ వరకూ మాస్టర్ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచింది. మాళవిక మోహన్ హీరోయిన్గా చేస్తోంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించాడు. ఇక ఈ సినిమా ఎప్పుడో విడుదలకావాల్సి ఉండగా.. కరోనా మహమ్మారి కారణంగా ఈ సినిమా వాయిదా పడుతూ చివరకు జనవరి 13న ప్రపంచ వ్యాప్తంగా తమిళంలో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీలో విడుదలైంది. ఈ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది.
కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ లో కొన్ని సడలింపులు ఇవ్వడంతో సినిమా హాళ్లు తెరుచుకున్నాయి. ఇప్పటికే తెలుగులో సాయి తేజ్ సోలో బతుకే సో బెటర్ విడుదలై పరవాలేదనిపించింది. తాజాగా రవితేజ క్రాక్ కూడా విడుదలై బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతోంది. ఈ మూవీ తెలుగులో ఫస్ట్ డే మంచి కలెక్షన్స్ రాబట్టింది. 50 శాతం ఆక్యుపెన్షీతో తెలుగులో దాదాపు 5.74 గ్రాస్ వసూళ్లను రాబట్టింది. రెండు రోజు మాత్రం తెలంగాణ (నైజాం)లో 1.49 కోట్లు, రాయలసీమ (సీడెడ్) 1.1 కోట్లు కొల్లగొట్టింది. మిగతా ఏపీలో కలిపి 3.24 కోట్లు కొల్లగొట్టింది. రెండో రోజు తెలుగులో ఈ సినిమా కలెక్షన్స్ అనూహ్యంగా డ్రాప్ అయ్యాయి. రెండో రోజు.. 1.68 కోట్లు షేర్ వసూళు చేసింది. మొత్తంగా రూ. 2.76 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
విజయ్ ‘మాస్టర్’ మూవీ (Twitter/Photo)
తమిళనాడు విషయానికొస్తే.. సగం థియేటర్స్ ఆక్యుపెన్షీతో మంచి వసూళ్లను రాబట్టింది. తమిళనాడులో ఈ సినిమా మొదటి రోజు.. దాదాపు రూ. 26 కోట్లను కొల్లగొట్టినట్టు తమిళ సినిమా అనలిస్ట్ శ్రీధర్ పిళ్లై ట్విట్టర్లో వివరించారు.రెండో రోజు రూ. 13 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. మొత్తంగా తెలుగు తమిళంలో రూ. 43 కోట్ల వరకు కొల్లగొట్టింది. మొత్తంగా తెలుగులో మాత్రం ఓ మోస్తరు టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ఈ వీకెండ్ వరకు ఏ మేరకు రాబడుతుందో చూడాలి.