HOME » NEWS » movies » VIJAY VIJAY SETHUPATHI LOKESH KANAGARAJ MALAVIKA MOHANAN MASTER TWITTER REVIEW SR

Vijay Master Twitter Review : దళపతి విజయ్ మాస్టర్ సినిమా ఎలా ఉందంటే.. ట్విట్టర్ రివ్యూ..

Vijay Master Twitter Review : తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం ‘మాస్టర్’. ఈ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.

news18-telugu
Updated: January 13, 2021, 8:02 AM IST
Vijay Master Twitter Review : దళపతి విజయ్ మాస్టర్ సినిమా ఎలా ఉందంటే.. ట్విట్టర్ రివ్యూ..
మాస్టర్ ట్విట్టర్ రివ్యూ Photo : Twitter
  • Share this:
తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం ‘మాస్టర్’. ఈ సినిమాకు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించాడు. ఖైదీ తర్వాత లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. దీనికి తోడు విజయ్, విజయ్ సేతుపతి కలిసి నటించడంతో అంచనాలు మరో రేంజ్‌లో ఏర్పడ్డాయి. ఇక సినిమా ఫస్ట్ లుక్ నుండి టీజర్ వరకూ మాస్టర్ ప్రేక్షకుల్లో అంచనాలను మరింతపెంచుతూ పోయింది. మాళవిక మోహన్ హీరోయిన్‌గా చేస్తోంది. ఈ చిత్రానికి అనిరుధ్‌ రవిచంద్రన్ సంగీతాన్ని అందించాడు. ఇక ఈ సినిమా ఎప్పుడో విడుదలకావాల్సి ఉండగా.. కరోనా మహమ్మారి కారణంగా ఈ సినిమా వాయిదా పడుతూ చివరకు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్‌ లో కొన్ని సడలింపులు ఇవ్వడంతో సినిమా హాళ్లు తెరుచుకున్నాయి. ఇప్పటికే తెలుగులో సాయి తేజ్ సోలో బతుకే సో బెటర్ విడుదలై పరవాలేదనిపించింది. తాజాగా రవితేజ క్రాక్ కూడా విడుదలై బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతోంది. ఇక తమిళ సూపర్ స్టార్ విజయ్ సినిమా కూడా ఈరోజు అటు తమిళ్‌తో పాటు తెలుగు హిందీ, మలయాళ భాషాల్లో విడుదలవుతోంది. తెలుగులో ఈ చిత్రాన్ని ఈస్ట్‌కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై మ‌హేశ్ కోనేరు విడుద‌ల చేస్తున్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్ షోస్ పడ్డాయి. మరి ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు ఏమంటున్నారు. సినిమా ఎలా ఉంది. విజయ్ యాక్టింగ్ ఎలా ఉంది.. ఏమాత్రం ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తోంది.. ఆకట్టుకునే అంశాలు ఏమిటి మొదలగు విషయాల గూర్చి సినిమాను చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా పంచుకుంటున్నారు. అవేంటో చూద్దాం..












ట్విట్టర్ రివ్యూస్ చూస్తుంటే సినిమా సూపర్ హిట్ అని తెలుస్తోంది. చూాడాలి మరి లాంగ్ రన్‌లో ఎలా ఉండనుందో..
Published by: Suresh Rachamalla
First published: January 13, 2021, 7:58 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading