Babusivan: దారుణం.. చికిత్సకు డబ్బుల్లేక ప్రముఖ తమిళ దర్శకుడు కన్నుమూత..

Babusivan: ఇండస్ట్రీలో వరస విషాదాలు జరుగుతూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న తమిళ ఇండస్ట్రీలో కమెడియన్ వడివేల్ బాలాజీ ఆర్థిక సమస్యలతో చికిత్సకు డబ్బుల్లేక చనిపోయాడన్న..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 17, 2020, 8:28 PM IST
Babusivan: దారుణం.. చికిత్సకు డబ్బుల్లేక ప్రముఖ తమిళ దర్శకుడు కన్నుమూత..
తమిళ దర్శకుడు బాబు శివన్ (babusivan director)
  • Share this:
ఇండస్ట్రీలో వరస విషాదాలు జరుగుతూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న తమిళ ఇండస్ట్రీలో కమెడియన్ వడివేల్ బాలాజీ ఆర్థిక సమస్యలతో చికిత్సకు డబ్బుల్లేక చనిపోయాడన్న విషయం అందర్నీ కలిచి వేసింది. అది మరిచిపోయే లోపే మరో విషాదం కోలీవుడ్‌లో జరిగింది. ఈ సారి ప్రముఖ దర్శకుడు కూడా కేవలం చికిత్సకు డబ్బుల్లేక మరణించాడు. ఆయన పేరు బాబు శివన్. వయసు కేవలం 54 సంవత్సరాలు మాత్రమే. ఆయనేదో చిన్న దర్శకుడు మాత్రం కాదు.. ఈయన దళపతి విజయ్‌తోనే మూడు సినిమాలకు పని చేసాడు.
తమిళ దర్శకుడు బాబు శివన్ (babusivan director)
తమిళ దర్శకుడు బాబు శివన్ (babusivan director)


2009లో విడుదలై విజయం సాధించిన వెట్టైకారన్ సినిమాకు ఈయన దర్శకుడు కూడా. ఈ సినిమా అప్పట్లో మంచి కలెక్షన్స్ సాధించింది. అనుష్క హీరోయిన్‌గా నటించగా.. శ్రీహరి ప్రముఖ పాత్రలో నటించాడు. ఈ దర్శకుడు ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులతో చికిత్స చేసుకోవడానికి కూడా కనీసం డబ్బుల్లేని పరిస్థితుల్లో మృతి చెందాడన్న విషయం చాలా మందిని కలచి వేస్తుంది. ఇటీవల బాబు శివన్ ఇద్దరు కుమార్తెలు నీట్ పరీక్ష కోసం వెళ్లారు. వాళ్లతో పాటు ఆయన భార్య కూడా తోడు వెళ్లింది.
తమిళ దర్శకుడు బాబు శివన్ (babusivan director)
తమిళ దర్శకుడు బాబు శివన్ (babusivan director)

ఇంట్లో ఒంటరిగా ఉన్న బాబు శివన్ భార్య పిల్లలు వచ్చే సమయంకు కుప్పకూలి ఉన్నాడు. వెంటనే అతడిని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆయనకు పరీక్షలు నిర్వహించిగా లంగ్స్, కాలేయం పూర్తిగా చెడిపోయాయని తెలిసింది. అయితే చికిత్సకు లక్షల్లో ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పారు. దాంతో అంత డబ్బులు కట్టలేని కుటుంబ సభ్యులు రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు.
తమిళ దర్శకుడు బాబు శివన్ (babusivan director)
తమిళ దర్శకుడు బాబు శివన్ (babusivan director)

అక్కడ డయాలసీస్ చేయడంతో పాటు చికిత్స అందించారు. అయితే చికిత్స సమయంలోనే బాబు శివన్ ఆరోగ్యం మరింత విషమించి కన్నుమూసాడు. కేవలం డబ్బులు లేని కారణంగానే చికిత్స ఆలస్యమైందని.. లేదంటే మా నాన్న బతికేవాడంటూ ఆయన ఇద్దరు కుమార్తెలు రోధించడం అక్కడున్న వాళ్లను కూడా కంటతడి పెట్టించింది. తమిళ ఇండస్ట్రీలో సినిమా ప్రముఖులు ఒక్కరు కూడా బాబు శివన్ కుటుంబానికి సాయం చేయలేదని తెలిసింది.
Published by: Praveen Kumar Vadla
First published: September 17, 2020, 8:28 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading