మాస్టర్, బీస్ట్ సినిమాల తర్వాత తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ (Thalapathy Vijay) నటించిన కొత్త సినిమా వారిసు. ఈ చిత్రంలో తెలుగులో వారసుడు (Vaarasudu)గా డబ్ అవుతోంది. ఇక తమిళంలో ‘వారిసు’ (Varisu) అనే పేరుతో వస్తోంది. విజయ్ కెరీర్‌లో 66వ మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు తెలుగు వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ బ్యానర్లపై నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కన్నడ అందం రష్మిక మందన్న హీరోయిన్‌గా ( Rashmika Mandanna) చేస్తోంది. భారీ అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా వస్తోంది. దీంతో ప్రమోషన్స్‌లో భాగంగా ఈ టీమ్ తాజాగా తమిళ ట్రైలర్‌ను విడుదల చేసింది. విజువల్‌గా ట్రైలర్ (Vaarasudu Trailer) అదిరింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా వస్తోన్న వస్తోన్న ఈ సినిమాలో ఏమోషన్స్, యాక్షన్ సమపాళ్లలో ఉన్నట్లు తెలుస్తోంది. కథ విషయానికి వస్తే.. శరత్‌కుమార్ విజయ్‌కు తండ్రిగా కనిపించనున్నారు. ఒక పెద్ద కుటుంబం.. ముగ్గురు అన్నదమ్ములు. అందరిలో చిన్నవాడు విజయ్. అయితే విజయ్ ఫ్యామిలీతో జీవించకుండా.. దూరంగా ఉంటున్నట్లు చూపించారు. ఫ్యామిలీ ఇబ్బందులను ఎదుర్కొన్నప్పుడు మాత్రం కుటుంబ వారసుడుగా విజయ్ బాధ్యత వహిస్తాడని తెలుస్తోంది. పండుగకు ఫ్యామిలీతో కలిసి చూసే సరైన సినిమాలాగా కనిపిస్తోంది.
పవర్ సీటులో కాదు, దాంట్లో కూర్చోనే వాడిలో ఉంటుందనే డైలాగ్ బాగుంది. అన్ని కమర్షియల్ హంగులతో ట్రైలర్ కట్ చేశారు. నిర్మాణ విలువలు అద్భుతంగా కనిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో విజయ్‌తో పాటు శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ , రష్మిక మందన్న, జయసుధ, ప్రభు, సంగీత కీలకపాత్రలు పోషిస్తున్నారు. థమన్ సంగీతం సమకూర్చగా, దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీ తెలుగు ట్రైలర్ ఈరోజు రాత్రి 7 గంటలకు విడుదల కానుంది.
THE BOSS has arrived ????#VarisuTrailer feast is here nanba ???? ▶️ https://t.co/SXIatTvGF0#Thalapathy @actorvijay sir @directorvamshi @MusicThaman @iamRashmika @karthikpalanidp @Cinemainmygenes @Lyricist_Vivek
— Sri Venkateswara Creations (@SVC_official) January 4, 2023
దిల్ రాజు (Dil Raju) ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న యాక్షన్ డ్రామా ప్యాన్ ఇండియా స్థాయిలో వస్తోంది. ఈ సినిమాను తమిళ్, తెలుగు, హిందీలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా టోటల్ బడ్జెట్ సుమారు 250 కోట్ల రూపాయలని తెలుస్తోంది. ఇక ఇక్కడ మరో విశేషం ఏమంటే.. ఈ సినిమా కోసం దళపతి విజయ్ 100 కోట్లకు (Vijay Remuneration For Varasudu Movie) పైగా రెమ్యునరేషన్ అందుకుంటున్నారని టాక్ నడుస్తోంది. అయితే ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. విజయ్ తన గత సినిమా విజిల్ కోసం వాడు దాదాపుగా 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు అప్పట్లో టాక్ నడిచిన సంగతి తెలిసిందే.
ఇక ఈ సినిమా విడుదల తేది విషయంలో క్లారిటీ వచ్చింది. ఈసినిమా రిలీజ్ డేట్‌ను టీమ్ తాజాగా ప్రకటించింది. వారసుడు (వారిసు) చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నట్టుగా టీమ్ ట్వీట్‌లో తెలిపింది. ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. థమన్ సంగీతం అంధించిన ఈ పాట తెలుగులో కూడా మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంటోంది. తెలుగులో రంజితమే పాటను రామ జోగయ్య శాస్త్రి రాయగా.. అనురాగ్ కులకర్ణి, మానసి పాడారు. పాటలో లిరిక్స్ బాగున్నాయి.
ఇక ఈ సంక్రాంతి బరిలో విజయ్ వారసుడుతో పాటు చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలయ్య వీరసింహారెడ్డి , అజిత్ తునివు సినిమాలు పోటీపడుతున్నాయి. దిల్ రాజు స్వయంగా ఈ సినిమాను నిర్మించడంతో పాటు తెలుగులో రిలీజ్ చేయడంతో మంచి థియేటర్స్ దక్కనున్నాయి. ఈ క్రమంలో ఈ సినిమా ఫస్ట్ డే 8 నుంచి 10 కోట్ల రేంజ్‌లో కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ నిపుణులు. ఈ సినిమా నాన్ థియేట్రికల్, వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ కలుపుకుని మొత్తంగా 300 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ నడిచిందని తెలుస్తోంది. చూడాలి మరి ఆ రేంజ్‌లో సినిమా కలెక్షన్స్ రాబట్టనుందో లేదో..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Dil raju, Rashmika mandanna, Tollywood news, Vaarasudu Movie, Vijay