మాస్టర్, బీస్ట్ సినిమాల తర్వాత తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ (Thalapathy Vijay) నటించిన కొత్త సినిమా వారిసు. ఈ చిత్రంలో తెలుగులో వారసుడు (Vaarasudu) తమిళంలో ‘వారిసు’ (Varisu) అనే పేరుతో వస్తోంది. విజయ్ 66వ మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ బ్యానర్లపై నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్గా ( Rashmika Mandanna) చేస్తోంది. మంచి అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా వస్తోన్న ఈ సినిమా నుంచి ఇప్పటికే తమిళ్లో రంజితమే అనే పాట విడుదలై మంచి రెస్పాన్స్ దక్కించుకోగా.. ఇక తెలుగులో కూడా ఈ పాటను విడుదల చేశారు. థమన్ సంగీతం అంధించిన ఈ పాట తెలుగులో కూడా మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంటోంది. రామ జోగయ్య శాస్త్రి రాయగా.. అనురాగ్ కులకర్ణి, మానసి పాడారు. పాటలో లిరిక్స్ బాగున్నాయి. పాటకు సోసల్ మీడియాలో మంచి ఆదరణ దక్కుతోంది. చూడాలి సినిమా ఎలా ఉండనుందో..
ఇక సంక్రాంతి బరిలో ఉండడంతో.. ఈ సినిమా తెలుగులో చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలయ్య వీరసింహారెడ్డి సినిమాలతో పోటీ పడనుంది. దిల్ రాజు స్వయంగా ఈ సినిమాను నిర్మించడంతో పాటు తెలుగులో రిలీజ్ చేయడంతో మంచి థియేటర్స్ దక్కనున్నాయి. ఈ క్రమంలో ఈ సినిమా ఫస్ట్ డే 8 నుంచి 10 కోట్ల రేంజ్లో కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ నిపుణులు.
WWM ❤️???? Thalapathy @actorvijay & @iamRashmika ????????#Ranjithame (Telugu) from #Vaarasudu out now ▶ https://t.co/4Gs53x9Prs ????️ @anuragkulkarni_ & @manasimm ???? @MusicThaman ????️ @ramjowrites @directorvamshi @SVC_official @PVPCinema @TSeries pic.twitter.com/sCTQOILZZB
— ???????????????????????????????????????????? (@UrsVamsiShekar) November 30, 2022
ఇక కమర్షియల్ హంగులతో వంశీ పైడిపల్లి రూపొందిస్తున్న ఈ సినిమాపై జనాల్లో భారీ అంచనాలున్నాయి. పైగా రోజురోజుకు విజయ్ పాపులారిటీతో పాటు ఆయన సినిమాల మార్కెట్ రెట్టింపవుతూ వస్తోంది. ఈ సినిమా కోసం విజయ్ భారీ రెమ్మ్యూనరేషన్ తీసుకున్నారని తెలిసింది. మొత్తంగా 100 కోట్ల వరకు విజయ్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా టాక్ నడుస్తోంది. అందుకు తగ్గట్లుగానే ఇప్పుడు ఈ మూవీ బిజినెస్ జరుగుతోందని సినీ వర్గాల సమాచారం.
ఈ సినిమా నాన్ థియేట్రికల్, వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ కలుపుకుని మొత్తంగా 300 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ నడిచిందని తెలుస్తోంది. చూడాలి మరి ఆ రేంజ్లో సినిమా కలెక్షన్స్ రాబట్టనుందో లేదో.. ఇక ఈ సినిమాలో విజయ్ సరసన కన్నడ అందం రష్మిక మందన (Rashmika Mandanna) నటిస్తోంది. ఈ భామ పుష్ప సినిమాతో ఒక్కసారిగా ప్యాన్ ఇండియా స్థాయిలో పాపులర్ అయ్యింది. విజయ్, రష్మికతో పాటు ఈ సినిమాలో ప్రభు, శరత్ కుమార్, శ్రీకాంత్, శామ్, యోగి బాబు, ప్రకాష్ రాజ్ , జయసుధ, సంగీత, సంయుక్త తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hero vijay, Tollywood news, Varasudu Movie