• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • VIJAY THIRUPAACHI MOVIE ACTOR BENJAMIN ASKING FOR FINANCIAL HELP AND HE ADMITTED HOSPITAL DUE TO HEART ATTACK PK

Actor Benjamin: ప్రముఖ తమిళ నటుడికి గుండెపోటు.. వైద్యం కోసం అర్థిస్తూ వీడియో..

Actor Benjamin: ప్రముఖ తమిళ నటుడికి గుండెపోటు.. వైద్యం కోసం అర్థిస్తూ వీడియో..

తమిళ నటుడు బెంజోమిన్ (thirupaachi benjomin)

Actor Benjamin: ఈ మధ్య ఇండస్ట్రీలో వరస విషాదాలు వెంటాడుతున్నాయి. కొందరు శాశ్వతంగా దూరమైపోయారు కూడా. ఈ క్రమంలోనే కొందరు నటులు మాత్రం ఆర్థిక పరిస్థితి బాగోలేక చేయిచాచి అడుక్కుంటున్నారు.

  • Share this:
ఈ మధ్య ఇండస్ట్రీలో వరస విషాదాలు వెంటాడుతున్నాయి. కొందరు శాశ్వతంగా దూరమైపోయారు కూడా. ఈ క్రమంలోనే కొందరు నటులు మాత్రం ఆర్థిక పరిస్థితి బాగోలేక చేయిచాచి అడుక్కుంటున్నారు. ఈ మధ్యే తమిళ నటుడు తావసి కూడా ఇలాగే బాధ పడ్డాడు. పాపం శివ కార్తికేయన్ లాంటి హీరోలు సాయం చేసినా కూడా కాన్సర్‌తో ఈయన చనిపోయాడు. ఇప్పుడు మరో నటుడు కూడా సాయం కోసం అర్థిస్తున్నాడు. తమిళ నటుడు, రచయిత బెంజమిన్ చేరన్ ప్రస్తుతం విషమ పరిస్థితుల్లో ఉన్నాడు. 'విక్టరీ ఫ్లాగ్' సినిమాతో ఇండస్ట్రీకి వచ్చిన ఈ కమెడియన్.. విజయ్ హీరోగా నటించిన తిరుపాచ్చితో పాపులర్ అయ్యాడు. అందులో విజయ్‌కు స్నేహితుడిగా నటించాడు. ఆ తర్వాత 40కి పైగా తమిళ చిత్రాల్లో నటించాడు బెంజమిన్. ఇప్పుడు సేలంలో ఉంటున్నాడు బెంజమిన్. అంతా బాగానే ఉన్నా కూడా ఈయనకు ఉన్నట్లుండి హార్ట్ ఎటాక్ వచ్చింది. దాంతో ఆసుపత్రిలో చేరాడు. మూడు రోజుల పాటు సేలంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆయనకు తదుపరి శస్త్రచికిత్స కోసం ఆర్థికంగా సాయం కోరుతున్నాడు. ప్రస్తుతం ఈయన బెంగళూరులోని నారాయణ హిరుదయాలయ ఆసుపత్రిలో ఉన్నాడు. ఇంతలో అతను వైద్య చికిత్స కోసం చిత్ర పరిశ్రమలోని స్నేహితుల సహాయం కోరుతూ ఒక వీడియోను విడుదల చేశాడు. ఇది కాస్తా ఇప్పుడు వైరల్ అవుతుంది. తనకు గుండెపోటు వచ్చిందని.. వైద్యం కోసం డబ్బులు అవసరం అయ్యాయని.. అందుకే మంచి మనసుతో సాయం చేయాలని కోరుతూ వీడియో విడుదల చేసాడు బెంజమిన్. మరోవైపు ఈ వీడియో చూసిన తర్వాత అతడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు అభిమానులు. ఈ మధ్య లెజెండరీ నటుడు పొన్నంబళంతో పాటు తాపసి లాంటి వాళ్లు కూడా ఇలా సాయం కోసం అర్థించారు.
Published by:Praveen Kumar Vadla
First published:

అగ్ర కథనాలు