HOME » NEWS » movies » VIJAY STARRER MASTER MOVIE PIRACY CAME IN THE SPAN OF JUST HOURS AND MAKERS APPROACHES CYBER CRIME PK

Master movie piracy: దారుణం.. పొద్దున్నే థియేటర్‌లో విడుదల.. మధ్యాహ్నం ఆన్‌లైన్‌లో పైరసీ..

Master movie piracy: 10 నెలల గ్యాప్ వచ్చింది.. చాలా రోజుల తర్వాత భారీ సినిమాలు ఇప్పుడు విడుదలవుతున్నాయి.. దాంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. నిర్మాతలకు కూడా థియేటర్స్‌కు వస్తున్న ప్రేక్షకులను చూసి నమ్మకం కలుగుతుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: January 13, 2021, 8:08 PM IST
Master movie piracy: దారుణం.. పొద్దున్నే థియేటర్‌లో విడుదల.. మధ్యాహ్నం ఆన్‌లైన్‌లో పైరసీ..
విజయ్ మాస్టర్ సినిమా రివ్యూ (Vijay Master)
  • Share this:
10 నెలల గ్యాప్ వచ్చింది.. చాలా రోజుల తర్వాత భారీ సినిమాలు ఇప్పుడు విడుదలవుతున్నాయి.. దాంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. నిర్మాతలకు కూడా థియేటర్స్‌కు వస్తున్న ప్రేక్షకులను చూసి నమ్మకం కలుగుతుంది. మునపటి పరిస్థితులు వస్తాయని ఇప్పుడిప్పుడే నమ్ముతున్నారు. ఒక్కొక్కటిగా అన్నీ మారుతున్నాయి.. కరోనా ఉన్నా కూడా జాగ్రత్తలు తీసుకుని థియేటర్స్ వైపు కదులుతున్నారు ఆడియన్స్. అయితే అంతా బాగున్నా పైరసీ మాత్రం ఆగడం లేదు. కనీసం ఒక్క రోజు కూడా గ్యాప్ ఇవ్వడం లేదు వాళ్లు. మరీ పోటీ అక్కడ థియేటర్స్‌లో సినిమా తొలి షో పడగానే ఏదో పరుగు పందెంలో పోటీ పడుతున్నట్లుగా మధ్యాహ్నానికే ఆన్‌లైన్‌లో ప్రింట్ పెట్టేస్తున్నారు. ఇప్పుడు విజయ్ మాస్టర్ విషయంలో కూడా ఇదే జరిగింది. జనవరి 13న ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 2000 థియేటర్స్‌లో విడుదలైంది మాస్టర్. తెలుగులో యావరేజ్.. తమిళంలో హిట్ టాక్ తెచ్చుకుంది ఈ చిత్రం. లొకేష్ కనకరాజ్ ఈ చిత్రంతో హ్యాట్రిక్ పూర్తి చేసేలా కనిపిస్తున్నాడు. మరోవైపు తెలుగులో మాత్రం పర్లేదు అనిపించేలా ఉన్నాడు మాస్టర్.
vijay master movie,vijay master movie online watch,vijay master movie movierulz,vijay master movie tamilrockers,vijay master movie piracy,vijay master movie leaked piracy,vijay master movie online full movie,vijay master full movie online,telugu cinema,మాస్టర్,విజయ్ మాస్టర్ ఆన్‌లైన్ రిలీజ్,విజయ్ మాస్టర్ పైరసీ
విజయ్ మాస్టర్ (Vijay Master)


ఇదిలా ఉంటే ఈ చిత్రం విడుదలైన కొన్ని గంటల్లోనే ఆన్‌లైన్‌లో ప్రత్యక్షం కావడం నిర్మాతలను కలవరపెడుతుంది. ఈ విషయం తెలిసి చిత్రయూనిట్ కూడా రంగంలోకి దిగింది. వెంటనే పైరసీని అడ్డుకోవాలంటూ వాళ్లు ప్రయత్నాలు మొదలు పెట్టారు. నిజానికి సినిమా విడుదలకు ముందే మాస్టర్ ఆన్‌లైన్‌లో ప్రత్యక్షం అయింది. దాంతో దర్శకుడు లోకేష్ కనకరాజ్ కన్నీళ్ళతో బయటికి వచ్చాడు. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.
vijay master movie,vijay master movie online watch,vijay master movie movierulz,vijay master movie tamilrockers,vijay master movie piracy,vijay master movie leaked piracy,vijay master movie online full movie,vijay master full movie online,telugu cinema,మాస్టర్,విజయ్ మాస్టర్ ఆన్‌లైన్ రిలీజ్,విజయ్ మాస్టర్ పైరసీ
విజయ్ మాస్టర్ సినిమా (Vijay Master movie)

దయచేసి ఏడాదిన్నర కష్టాన్ని కన్నీటి పాలు చేయొద్దని వేడుకున్నాడు. ఇప్పుడు మాస్టర్ విడుదలైంది.. పొద్దున్నే థియేటర్స్‌లో వచ్చిన ఈ సినిమాను మధ్యాహ్నానికి పైరసీ చేసేసారు. లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో విజయ్ హీరోగా నటించగా.. విజయ్ సేతుపతి విలన్‌గా నటించాడు. మాళవిక మోహనన్ హీరోయిన్. తొలిరోజు ఈ చిత్రం రికార్డ్ వసూళ్లు సాధించేలా కనిపిస్తుంది.
Published by: Praveen Kumar Vadla
First published: January 13, 2021, 8:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading