హోమ్ /వార్తలు /సినిమా /

Annabelle Sethupathi trailer: వెంకటేష్ చేతుల మీదుగా విజయ్ సేతుపతి 'అనబెల్ & సేతుపతి' ట్రైలర్ విడుదల..

Annabelle Sethupathi trailer: వెంకటేష్ చేతుల మీదుగా విజయ్ సేతుపతి 'అనబెల్ & సేతుపతి' ట్రైలర్ విడుదల..

అనబెల్ సేతుపతి ట్రైలర్ (Annabelle Sethupathi trailer)

అనబెల్ సేతుపతి ట్రైలర్ (Annabelle Sethupathi trailer)

Annabelle Sethupathi trailer: ఉప్పెన (Uppena), మాస్టర్ (Master), సైరా (Syeraa) లాంటి సినిమాలతో తెలుగులోనూ మంచి మార్కెట్ సంపాదించుకున్నాడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi). ఈ సారి ‘అనబెల్ సేతుపతి’ అనే ద్విభాషా చిత్రంతో ఆడియన్స్ ముందుకొస్తున్నాడు విజయ్.

ఇంకా చదవండి ...

ఉప్పెన, మాస్టర్, సైరా లాంటి సినిమాలతో తెలుగులోనూ మంచి మార్కెట్ సంపాదించుకున్నాడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి. అందుకే ఈయన సినిమాలను వరసగా తెలుగులో కూడా విడుదల చేస్తున్నారు. తాజాగా మరో సినిమా కూడా తెలుగులోకి వస్తుంది. ఈ సారి అనబెల్ సేతుపతి అనే ద్విభాషా చిత్రంతో ఆడియన్స్ ముందుకొస్తున్నాడు విజయ్. తాప్సీ హీరోయిన్‌గా విజయ్ సేతుపతి హీరోగా ప్యాషన్ స్టూడియోస్ 8 బ్యానర్‌పై సుధాన్ సుందరం, జి జయరాం నిర్మిస్తున్న సినిమా 'అనబెల్ & సేతుపతి'. దీపక్ సుందరరాజన్ ఈ సినిమాకు దర్శకుడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విక్టరీ వెంకటేష్ చేతుల మీదుగా విడుదలైంది. ట్రైలర్ సాంతం చాలా ఆసక్తికరంగా ఉందంటూ మెచ్చుకున్నారు వెంకటేష్. సినిమా కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందని తెలిపారు ఈయన. ఒకేసారి మూడు భాషల ట్రైలర్స్ విడుదల చేసారు మేకర్స్. తమిళంలో సూర్య.. మలయాళంలో మోహన్ లాల్ ఈ చిత్ర ట్రైలర్ విడుదల చేసారు. సెప్టెంబర్ 17 హాట్ స్టార్ డిస్నీలో నేరుగా 'అనబెల్ & సేతుపతి' చిత్రం విడుదల కానుంది.

ట్రైలర్ అంతా కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఉంది. విజయ్ సేతుపతి, తాప్సీ చుట్టూనే తిరిగింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో వెనకాల బంగ్లా ఒకటి బాగా ఫోకస్ చేశారు. పోస్టర్ ఆన్ రివర్స్ లో చూస్తే మిగిలిన నటీనటులను పరిచయం చేశారు. పోస్టర్‌లో హారర్ థ్రిల్లర్ అంశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అలాగే ట్రైలర్ నిండా కామెడీ సీన్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి. ఈ ఏడాది ఓటీటీలో విడుదలయ్యే సినిమాలలో 'అనబెల్ & సేతుపతి' కు ప్రత్యేక స్థానం ఉంది. ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందని నమ్మకంగా చెబుతున్నారు దర్శక నిర్మాతలు. ఈ సినిమాలో రాధిక శరత్ కుమార్, యోగి బాబు, రాజేంద్ర ప్రసాద్, జగపతిబాబు, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

First published:

Tags: Telugu Cinema, Tollywood, Vijay Sethupathi

ఉత్తమ కథలు