మరో చాలెంజింగ్ పాత్రలో విజయ్ సేతుపతి

తమిళంలో కమల్ హాసన్, విక్రమ్, సూర్యల తర్వాత పాత్ర కోసం పరకాయ ప్రవేశం చేసే హీరోల్లో విజయ్ సేతుపతి ఒకరు.లేటెస్ట్‌గా ఈ తమిళ తంబీ..‘సీతాకతి’ అనే సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ రిలీజైంది.

news18-telugu
Updated: November 21, 2018, 4:55 PM IST
మరో చాలెంజింగ్ పాత్రలో విజయ్ సేతుపతి
సీతాకాతిలో విజయ్ సేతుపతి
  • Share this:
తమిళంలో కమల్ హాసన్, విక్రమ్, సూర్యల తర్వాత పాత్ర కోసం పరకాయ ప్రవేశం చేసే హీరోల్లో విజయ్ సేతుపతి ఒకరు. గత కొన్నేళ్లుగా ఈ కథానాయకుడు ఛాలెంజింగ్ పాత్రలు చేస్తూ ఆయన కంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు.

రీసెంట్‌గా మణిరత్నం తెరకెక్కించిన ‘నవాబ్’ మూవీలో నిజాయితీగల పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఇరగదీసాడు.  మరోవైపు ‘96’ మూవీలో ఫోటోగ్రాఫర్‌గా విజయ్ సేతుపతి నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇక చిరంజీవి హీరోగా నటిస్తోన్న ‘సైరా..నరసింహారెడ్డి’ సినిమాలో ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్నాడు.

లేటెస్ట్‌గా ఈ తమిళ తంబీ..‘సీతాకతి’ అనే సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ రిలీజైంది.


ఈ మూవీలో విజయ్ సేతుపతి..భారతీయుడులో కమల్  హాసన్ తరహా ముసలివాడి పాత్రలో విజయ్ గెటప్ ఉంది. అంతేకాదు ‘సీతాకతి’మూవీలో విజయ్ సేతుపతి హీరో పాత్రలో నటిస్తున్నాడు. బాలాజీ తరీంతన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో ప్రముఖ దర్శకుడు భారతీరాజా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు. ఈ మూవీని కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన ‘ఉత్తమ విలన్’ తరహాలో తెరకెక్కించినట్టు కనబడుతోంది. హీరోగా విజయ్ సేతుపతికి ఇది 25వ సినిమా. మరి ఈ మూవీతో కోలీవుడ్‌లో విజయ్ సేతుపతి మరో సెన్సేషన్ క్రియేట్ చేస్తాడా ? లేదా అనేది చూడాలి.
Published by: Kiran Kumar Thanjavur
First published: November 21, 2018, 4:55 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading