కరోనా పుణ్యమా అని ఇతర భాషల్లోని సినిమాలన్నీ ఇప్పుడు తెలుగులోకి అనువదిస్తున్నారు. ఎలాగూ థియేటర్స్ అవసరం లేదు కాబట్టి అక్కడ హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా కేవలం హీరో ఇమేజ్‌నే క్యాష్ చేసుకోడానికి కొన్ని సినిమాలను కొని ఇక్కడ డబ్బింగ్ చేసి ఓటిటిలో విడుదల చేస్తున్నారు. అందులో విజయ్ సేతుపతి సినిమాలు చాలా ఉన్నాయి. ఈ మధ్యే విక్రమార్కుడు అంటూ ఓ సినిమాతో వచ్చాడు విజయ్. దానికి ముందు ఓ మంచి రోజు చూసి చెప్తా అనే సినిమాతో వచ్చాడు. ఇప్పుడు మరో సినిమాను కూడా నేరుగా ఓటిటిలో విడుదల చేయబోతున్నారు. అదే సూపర్ డీలక్స్. 2019లో విడుదలైన ఈ చిత్రానికి తమిళనాట విమర్శకుల ప్రశంసలు దక్కాయి.
అంతేకాదు ఈ సినిమాలో నటనకు గానూ జాతీయ ఉత్తమ సహాయ నటుడిగా అవార్డు కూడా గెలుచుకున్నాడు విజయ్ సేతుపతి. సమంత అక్కినేని, రమ్యకృష్ణ, ఫహాద్ ఫాజిల్ లాంటి స్టార్స్ ఈ సినిమాలో నటించారు. విజయం సాధించకపోయినా.. విమర్శకులు మాత్రం ఈ సినిమాను సూపర్ అనేసారు. ఇప్పుడు సూపర్ డీలక్స్ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు.
ఆగస్ట్ 6న ఆహా వేదికగా ఈ సినిమా స్ట్రీమ్ కానుంది. దీనికి సంబంధించిన తెలుగు ట్రైలర్‌ను విడుదల చేసారు. విజయ్ సేతుపతి అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా చూస్తున్నారు. తెలుగులో కచ్చితంగా మంచి వ్యూస్ వస్తాయని ఆహా కూడా నమ్ముతుంది. పైగా సమంత కూడా ఉండటంతో అంచనాలు కూడా బాగానే ఉన్నాయి. మరి ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Samantha akkineni, Telugu Cinema, Tollywood, Vijay Sethupathi